రాయవరం ప్రజలు బాబుకు కౌంటర్ పేర్ని నాని ఫన్నీ రియాక్షన్
Breaking News
భారత్ కోకింగ్ కోల్‌కు యాంకర్ నిధులు
Published on Fri, 01/09/2026 - 07:45
న్యూఢిల్లీ: మైనింగ్ రంగ పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియా అనుబంధ కంపెనీ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్(బీసీసీఎల్) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 273 కోట్లు సమీకరించింది. ఇన్వెస్ట్ చేసిన ప్రధాన సంస్థలలో మ్యూచుకల్ ఫండ్స్.. బంధన్, నిప్పన్ ఇండియా, యూటీఐసహా, ఎల్‌ఐసీ, సిట్రీన్ ఫండ్, సొసైటీ జనరాలి ఓడీఐ, మేబ్యాంక్ సెక్యూరిటీస్ తదితరాలున్నాయి.
నేడు(9న) ప్రారంభంకానున్న పబ్లిక్ ఇష్యూకి రూ. 21–23 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 13న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు రూ. 23 ధరలో 11.87 కోట్లకుపైగా షేర్లను ఆఫర్ చేసింది. ఇష్యూలో భాగంగా మాతృ సంస్థ కోల్ ఇండియా 46.57 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచింది. తద్వారా రూ. 1,071 కోట్లకుపైగా సమీకరించాలని భావిస్తోంది. కంపెనీ లిస్టింగ్‌లో రూ. 10,700 కోట్ల విలువ సాధించే అవకాశముంది.
వెరసి కొత్త కేలండర్ ఏడాదిలో తొలి ఐపీవోగా బీసీసీఎల్ నిలవనుంది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో ఈ నెల 16న లిస్ట్‌కానుంది. రేటింగ్ దిగ్గజం క్రిసిల్ నివేదిక ప్రకారం కోకింగ్ కోల్ ఉత్పత్తిలో గతేడాది(2024–25) బీసీసీఎల్ అతిపెద్ద కంపెనీగా నిలిచింది. ఈ కాలంలో ఆదాయం రూ. 13,802 కోట్లుకాగా.. రూ. 1,204 కోట్ల నికర లాభం ఆర్జించింది.
కార్యకలాపాల విస్తరణ
1972లో ఏర్పాటైన బీసీసీఎల్ ప్రధానంగా స్టీల్, విద్యుత్ పరిశ్రమల్లో వినియోగించే కోకింగ్ కోల్, నాన్‌కోకింగ్ కోల్, వాష్‌డ్ కోల్ ఉత్పత్తి చేస్తోంది. కంపెనీ తొలుత ఝరియా(జార్ఖండ్), రాణిగంజ్(పశి్చమ బెంగాల్) గనుల నుంచి కోకింగ్ కోల్ సరఫరా కోసం ఏర్పాటైంది. తదుపరి కాలంలో భారీస్థాయిలో కార్యకలాపాలు విస్తరించింది. 2025కల్లా 40.50 మిలియన్ టన్నుల కోల్‌ను ఉత్పత్తి చేసింది.
2022లో సాధించిన 30.51 మిలియన్ టన్నులతో పోలిస్తే ఇది 33 శాతం వార్షిక వృద్ధి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి ఆరు నెలల్లో 15.75 మిలియన్ టన్నుల కోల్‌ను ఉత్పత్తి చేసింది. అయితే గతేడాది ఇదే కాలం(ఏప్రిల్–సెపె్టంబర్)లో ఉత్పత్తి చేసిన 19.09 మిలియన్ టన్నులతో పోలిస్తే క్షీణత నమోదైంది. 2025 సెపె్టంబర్‌కల్లా 34 గనులను నిర్వహిస్తోంది. వీటిలో 4 భూగర్భంలోనివికాగా.. 26 ఓపెన్‌కాస్ట్ గనులు.
Tags : 1