Breaking News

బోల్డ్‌ అండ్‌ వైల్డ్‌గా ‘టాక్సిక్‌’ టీజర్‌.. యశ్‌ విశ్వరూపం!

Published on Thu, 01/08/2026 - 10:53

‘కేజీఎఫ్, కేజీఎఫ్‌ 2’ లాంటి బ్లాక్‌ బస్టర్‌  తర్వాత కన్నడ రాకింగ్‌ స్టార్‌ యశ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’. కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వంలో కన్నడ, ఇంగ్లీష్‌ భాషల్లో తెరకెక్కుతోంది. కేవీఎన్‌ ప్రోడక్షన్స్, మాన్ స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్పై వెంకట్‌ కె.నారాయణ, యష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్‌ వెర్షన్‌ని మార్చి 19న రిలీజ్‌ చేస్తున్నారు. 

ఇప్పటికే ఈ చిత్రం నుంచి కియరా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి పాత్రలకు సంబంధించిన లుక్‌ని రిలీజ్‌ చేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి యశ్‌ లుక్‌తో పాటు టీజర్‌ని రిలీజ్‌ చేశారు. యశ్ 40వ పుట్టినరోజు సందర్భంగా గురువారం (జనవరి 8)ఈ టీజర్‌ను అధికారికంగా రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ టీజర్‌లో యశ్‌ను రాయా పాత్రలో పరిచయం చేశారు. ఒక స్మశానంలో మాఫియా డాన్ కొడుక్కి దహన సంస్కారాలు జరుగుతుండగా రాయా (యశ్‌) అక్కడికి కారులో వస్తాడు. దాని నుంచి  వైర్ల ద్వారా స్మశానం లోపల డైనమేట్లు పెట్టించి కారు నుంచి బయటికి రాకుండా బాంబులు పేల్చేస్తాడు. అది ఎలా చేశాడనేది బోల్డ్‌గా చూపించారు. రూథ్‌లెస్ మాఫియా బాస్‌గా యశ్‌ కనిపిస్తున్నాడు.  హాలీవుడ్ వైబ్స్‌తో కూడిన ఈ గ్లింప్స్‌కు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

#

Tags : 1

Videos

తెలంగాణలో మొదలైన మున్సిపల్ ఎన్నికల హడావిడి

బాబుకు చెంపపెట్టు.. టీడీపీ గుట్టురట్టు

Allu Arjun: పుష్ప టార్గెట్ చేశాడంటే..! నీయవ్వ తగ్గేదేలే

పోలీసుల నిర్లక్ష్యానికి దివ్యాంగురాలు బలి

200 మందితో అటాక్.. 9 ఎకరాల భూ కబ్జా!

Toxic Movie: టీజర్ తో మెంటలెక్కించాడుగా

తప్పుడు వార్తలతో అమరావతి రైతులపై కుట్ర

ఇదేమన్నా మీ ఇంటి వ్యవహారం అనుకున్నారా.. ఏకిపారేసిన సాకే శైలజానాథ్

Jada Sravan: ఏపీలో ముగ్గురేనా మంత్రులు.. మిగతా మంత్రులకు సిగ్గు లేదా

Kakani: దొంగతనం ఏలా చెయ్యాలో బాబు దగ్గర నేర్చుకో.. సోమిరెడ్డికి చెమటలు

Photos

+5

రెడ్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ నిధి అగర్వాల్

+5

నగరంలో హీరోయిన్‌ డింపుల్‌ హయతీ సందడి (ఫొటోలు)

+5

విజయవాడలో ఘనంగా మహిళా ఫెస్ట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో రాజాసాబ్.. డార్లింగ్ ప్రభాస్ ఫోటోలు చూశారా?

+5

జూబ్లీహిల్స్‌లో ‍సందడి చేసిన సినీ నటి నివేదా పేతురాజ్ (ఫొటోలు)

+5

అర్థరాత్రి విమల్ థియేటర్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ (ఫొటోలు)

+5

'అనగనగా ఒక రాజు'లో మీనాక్షి చౌదరి.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

'అనగనగా ఒక రాజు' ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మానందం, మంగ్లీ (ఫోటోలు)

+5

చంద్రబాబుది విలన్‌ క్యారెక్టర్‌.. ఆధారాలతో ఏకిపారేసిన వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)