తెలంగాణలో మొదలైన మున్సిపల్ ఎన్నికల హడావిడి
Breaking News
హైదరాబాద్‌లో మెరుగ్గా ఇళ్ల అమ్మకాలు
Published on Thu, 01/08/2026 - 07:50
హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు గతేడాది మెరుగ్గా కొనసాగాయి. 2024తో పోల్చితే 4 శాతం పెరిగి 38,403 యూనిట్లకు చేరాయి. ఇళ్ల ధర చదరపు అడుగునకు (ఎస్‌ఎఫ్‌టీ) 13 శాతం పెరిగి రూ.6,271కు చేరుకుంది. దేశవ్యాప్తంగా టాప్–8 నగరాల్లో చూస్తే మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు గతేడాది ఒక శాతం తగ్గి 3,48,207 యూనిట్లకు పరిమితమయ్యాయి.
ఇళ్ల ధరలు మాత్రం ఎస్‌ఎఫ్‌టీకి 19 శాతం పెరిగాయి. రేట్లు పెరగడంతో డిమాండ్ నెమ్మదించినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ గృహ రుణాలపై రేట్లు తగ్గడం, బలమైన ఆర్థిక వృద్ధితో ఇళ్ల డిమాండ్‌ను స్థిరంగా కొనసాగేలా చేసింది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్‌ఫ్రాంక్ విడుదల చేసింది. ప్రధాన ప్రాంతాల్లోని ఇళ్ల అమ్మకాల డేటా ఆధారంగా ఈ వివరాలు ప్రకటించింది.
పట్టణాల వారీ..
ముంబై మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు ఒక శాతం పెరిగి 97,188 యూనిట్లుగా ఉన్నాయి. ఇక్కడ చదరపు అడుగు ధర 7 శాతం పెరిగి రూ.8,856కు చేరింది.
బెంగళూరులో ఇళ్ల విక్రయాలు ఎలాంటి మార్పు లేకుండా 55,373 యూనిట్లుగా ఉన్నాయి. ఇళ్ల ధర ఎస్‌ఎఫ్‌టీకి 12 శాతం పెరిగి రూ.7,388గా ఉంది.
పుణెలో ఇళ్ల అమ్మకాలు 3 శాతం తగ్గి 50,881 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇక్కడ ధర 5 శాతం పెరిగి రూ.5,016కు చేరింది.
ఢిల్లీ ఎన్‌సీఆర్ మార్కెట్లో అమ్మకాలు 9 శాతం తగ్గి 52,452 యూనిట్లుగా ఉన్నాయి. ఇళ్ల ధర ఎస్‌ఎఫ్‌టీకి 19 శాతం ఎగసి రూ.60,28గా ఉంది.
అహ్మదాబాద్‌లో విక్రయాలు 2 శాతం పెరిగి 18,752 యూనిట్లుగా నమోదయ్యాయి. ధర 3 శాతం పెరిగి రూ.3,197కు చేరింది.
చెన్నైలో ఇళ్ల అమ్మకాలు 12 శాతం పెరిగాయి. 18,262 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇళ్ల ధర ఎస్‌ఎఫ్‌టీకి 7 శాతం వృద్ధితో రూ.5,135గా ఉంది.
కోల్‌కతాలో అమ్మకాలు 3 శాతం పడిపోయి 16,896 యూనిట్లుగా ఉన్నాయి. ఇళ్ల ధర 6 శాతం పెరిగి ఎస్‌ఎఫ్‌టీకి రూ.4,037గా నమోదైంది.
Tags : 1