Breaking News

మీ ‘లైఫ్‌’ పాలసీ సరైనదేనా..?

Published on Mon, 01/05/2026 - 04:03

గుడ్డివాళ్లు ఏనుగును తాకితే...? తోక పట్టుకున్నవారికి అదో తాడులా... తొండం తాకిన వారికి అదో పాములా... నడుము భాగాన్ని తాకినవారికి అదో గోడలా అనిపించింది. అంతేతప్ప ఎవ్వరికీ అదో ఏనుగులా అనిపించలేదు. దేన్నయినా సమగ్రంగా చూడాలి తప్ప ఒకే కోణంలో చూడొద్దని చెప్పేటపుడు పురాణాల్లోని ఈ తత్వాన్ని గుర్తు చేస్తుంటారు. ప్రస్తుతం మనవాళ్లు కొంటున్న బీమా పాలసీలకూ ఇదే తత్వం వర్తిస్తోంది. ఎందుకంటే నూటికి 90 శాతం మంది బీమా అవసరాన్ని అర్థం చేసుకుని కొనటం లేదు. రకరకాల కోణాల్లో దాన్ని చూసి డబ్బులు వృథా చేస్తున్నారన్నది తాజా సర్వేల సారాంశం. 

ఈ సర్వేల ప్రకారం... కొందరేమో బంధుమిత్రులు బలవంతపెట్టారనో, ఏజెంట్ల ఒత్తిడి తట్టుకోలేకో మొహమాటానికి బీమా పాలసీ తీసుకుంటున్నారు. మరికొందరేమో దీన్నో పెట్టుబడి సాధనంగా, పన్ను ఆదా చేసే పాలసీగా భావించి కొంటున్నారు. ఇంకొందరేమో గడువు తీరిన తరువాత తమ చేతికి ఎంత వస్తుందన్నదానిపైనే దృష్టి పెడుతున్నారు. నిజానికి ఈ మూడూ సరికాదు. బీమా అవసరాన్ని అర్థం చేసుకుని, ఆ అవసరం కోసమే దాన్ని తీసుకోవాలి. ప్రతి ఒక్కరికీ బీమా తప్పనిసరిగా ఉండాలి కూడా. అసలు బీమా అవసరమేంటో... డబ్బులు ఎలా వృథా అవుతున్నాయో... వీటినెలా నివారించాలో వివరించే ‘వెల్త్‌’ స్టోరీ ఇది...  

‘ఎండోమెంట్‌’ ఇష్టమైతే... కష్టమే 
జీవిత బీమా తీసుకోవాలనుకున్నవారు ఎక్కువగా ఎండోమెంట్‌ ప్లాన్‌లను ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఇందులో లో పాలసీదారు మరణించినట్టయితే ఎంపిక చేసుకున్న కవరేజీ (సమ్‌ అష్యూర్డ్‌) మేర పరిహారం లభిస్తుంది. అలాకాకుండా పాలసీ గడువు ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉన్నా సరే... ఈ ప్లాన్‌లో ఇస్తామని చెప్పిన అంతిమ ప్రయోజనాన్ని అందిస్తారు. చాలా మందికి నచ్చేది ఇదే. ఎందుకంటే భారతీయ భావనలో ‘మనం లేకపోతే’ అనే పదం చాలామందికి నచ్చదు. మనం జీవించి ఉంటామన్న ఆశే అందరికీ ఉంటుంది. దానివల్లే... జీవించి ఉంటే ఇంత మొత్తం వస్తుందని ఎండోమెంట్‌ ప్లాన్లలో చెబుతుంటారు. చాలామంది దీన్ని చూసే కొంటుంటారు. కానీ ఇది సరికాదన్నది నిపుణుల మాట.

తప్పనిసరిగా ‘టర్మ్‌’ ఉండాలి... 
అసలు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అనే పేరులోనే ఉంది కదా... అది జీవితానికిచ్చే బీమా అని. మరి జీవితానికి బీమా చేసుకుంటే చాలు కదా! ఆ బీమా మొత్తం నుంచి కూడా పెట్టుబడి తరహాలో లాభాన్ని ఆశించటమెందుకు? లైఫ్‌ ఇన్సూరెన్స్‌ టర్మ్‌ ప్లాన్లు అన్నవి కేవలం రక్షణ కల్పించడానికే పనికొస్తాయి. పాలసీ కాల వ్యవధిలో పాలసీదారు మరణించిన సందర్భాల్లోనే ఇవి పరిహారాన్ని చెల్లిస్తాయి. ఒకవేళ పాలసీ గడువు తీరాక కూడా పాలసీదారు జీవించి ఉంటే చేతికి రూపాయి కూడా రాదు. చాలా మందికి ఇదే నచ్చదు.  ఒక్కసారి తేడా చూద్దాం!. 30 ఏళ్ల ఆరోగ్యవంతుడైన వ్యక్తి ఏడాదికి రూ.10–12 వేల ప్రీమియాన్ని చెల్లిచండానికి సిద్ధపడతే... ఎండోమెంట్‌ ప్లాన్‌ను ఎంపిక చేసుకున్న సందర్భంలో రూ.2 లక్షల సమ్‌ అష్యూర్డ్‌తో కవరేజీ లభిస్తుంది. 

కాకపోతే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ అయితే ఇంతే ప్రీమియానికి రూ.50 లక్షల వరకూ కవరేజీ లభిస్తుంది.  కుటుంబానికి ఆధారమైన వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణిస్తే రూ.2 లక్షలు సరిపోతుందా? రూ.50 లక్షలయితే కొన్నాళ్లయినా ఆ కుటుంబం నిలదొక్కుకోగలదు కదా? పాలసీ గడువు ముగిశాక కూడా బతికి ఉంటే ఆ 2 లక్షలు వెనక్కి వస్తాయన్న ఉద్దేశంతో కంటే ఎండోమెంట్‌ పాలసీ మంచిదా? లేక పాలసీ గడువు ముగిశాక రూపాయి రాకపోయినా... ఈ మధ్యలో ఏదైనా జరిగితే కుటుంబాన్ని ఆదుకోగల రూ.50 లక్షల పాలసీ మంచిదా? ఇదిగో... ఈ కోణంలో సమగ్రంగా ఆలోచిస్తే బీమా విషయంలో డబ్బులు వృథా కావు.  

తక్కువ కాలం... తక్కువ కవరేజీ వద్దు 
కొంతమంది జీవిత బీమా పాలసీలను 5 ఏళ్ల కాలానికి, పదేళ్ల కాలానికి, 15 ఏళ్ల కాలానికి కూడా తీసుకుంటూ ఉంటారు. చాలామంది ఇన్సూరెన్స్‌ ఏజెంట్లు వీటినే అంటగట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి పాలసీలు అమ్మితే వారికి వచ్చే లాభం ఎక్కువ. ఎందుకంటే ఐదేళ్లు తిరిగేసరికి మీరు మళ్లీ ఇంకో పాలసీ తీసుకోక తప్పదు కదా... అందుకని!. ఇది కూడా డబ్బు వృథా చేయటమే. ఎందుకంటే పాలసీదారుకు కనీసం 70 ఏళ్లు వచ్చేవరకైనా కవరేజీ ఉండాలి. అది 30 ఏళ్ల వయసులో తీసుకున్నా... లేక 40 ఏళ్ల వయసులో తీసుకున్నా సరే!. ఎందుకంటే సాధారణ అంచనాల ప్రకారం పాలసీదారుకు , 70 ఏళ్లు వచ్చేసరికి తన పిల్లలు కూడా పెద్దవాళ్లయి ఉంటారు. 

70లోగా ఏమైనా జరిగితే... బీమా కవరేజీ మొత్తం కుటుంబాన్ని ఆదుకుంటుంది. ఒకవేళ 70 ఏళ్లు పూర్తయినా తను జీవించి ఉంటే పాలసీగడువు ముగిసిపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అప్పటికే కుటుంబం ఎంతో కొంత సెటిలై ఉంటుంది. ఈ కోణంలో ఆలోచించి దీర్ఘకాలానికి జీవితబీమా తీసుకోవాలి తప్ప... స్వల్ప కాలానికి తీసుకుంటే అది డబ్బులు వృథా చేయటమే. దీనికితోడు చిన్నచిన్న కవరేజీ కుటుంబానికి సరిపోదని గుర్తుంచుకోవాలి. కుటుంబ పెద్ద వార్షిక సంపాదనకు కనీసం 10 నుంచి 20 రెట్ల వరకు కవరేజీ ఉంటే మంచిది. ఈ స్థాయి కవరేజీకి ప్రీమియం కట్టడం కేవలం టర్మ్‌ ప్లాన్లలోనే సాధ్యం.

యులిప్‌లూ ఎండోమెంట్‌ లాంటివే... 
యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్స్‌ (యులిప్స్‌) కూడా ఒక రకంగా ఎండోమెంట్‌ లాంటివే. ఎండోమెంట్‌లో బీమా చార్జీలు పోను మిగిలిన మొత్తాన్ని డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసి, వచ్చిన రాబడిని పాలసీదారులకు చెల్లిస్తారు. యులిప్‌లలో మోరా్టలిటీ, ప్రీమియం అలోకేషన్‌ తదితర చార్జీలు మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తారు. దీంతో ఎండోమెంట్‌ కంటే యులిప్‌లలో కొంచెం అదనపు రాబడి (8 శాతం వరకు) ఆశించొచ్చు. కానీ, వీటిల్లో మొదటి ఐదేళ్లు లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. బీమా సంస్థలు చార్జీల రూపంలో ఎక్కువ మినహాయించుకుంటూ ఉంటాయి. పైగా ఇది కూడా బీమా, పెట్టుబడి కలిపిన సాధనం. కనుక కవరేజీ మెరుగ్గా ఉండదు.  

పన్ను మినహాయింపు చూడొద్దు
ఎండోమెంట్‌ ప్లాన్లలో మెచ్యూరిటీ గడువు తీరాక చేతికి అందే మొత్తంపై ఆదాయపు పన్ను ఉండదు. పైపెచ్చు చెల్లించే ప్రీమియాన్ని సెక్షన్‌ 80సీ కింద (పాత పన్ను విధానం) చూపించుకుని పన్ను ఆదా చేసుకోవచ్చు. చాలా మంది ఈ ప్రయోజనం కోసం ఎండోమెంట్‌ ప్లాన్‌ కొనుగోలు చేస్తుంటారు. వాస్తవానికి టర్మ్‌ ప్లాన్‌కు చెల్లించే ప్రీమియంపైనా ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. కాకపోతే ఎండోమెంట్‌ ప్లాన్లతో చివర్లో వచ్చే మొత్తాన్ని చూసుకుంటే అది మనం చెల్లించిన ప్రీమియానికి సరిపడా ఉంటుంది. దీనికి బదులు తక్కువ ప్రీమియంతో వచ్చే టర్మ్‌ ప్లాన్‌ తీసుకుని, మిగతా మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల పన్ను పోను నికర రాబడి.. ఎండోమెంట్‌ ప్లాన్లలో కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంలో ఇంకా పెరుగుతుంది.  

రైడర్లూ అవసరమే..  
→ జీవిత బీమాలో అదనపు రైడర్లూ మంచివే. ఎందుకంటే దేశంలో జీవిత బీమా క్లెయిమ్‌లలో 70 శాతం ప్రమాద మరణాలు లేదా ప్రమాదం కారణంగా వైకల్యానికి సంబంధించినవే ఉంటున్నాయి. అయినాసరే చాలామంది ఈ రైడర్లను తీసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. వీటి కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయక్కర్లేదు. ఏటా రూ.200 నుంచి 1,000కే రైడర్‌లను పొందొచ్చు.  

→ యాక్సిడెంటల్‌ డెత్, యాక్సిడెంటల్‌ టోటల్‌ అండ్‌ పర్మనెంట్‌ డిజేబిలిటీ (ప్రమాద మరణం లేదా అంగ వైక ల్యం) రైడర్‌ల ను తప్పకుండా జోడించుకోవాలి. 

→ వేవర్‌ ఆఫ్‌ ప్రీమియం రైడర్‌ కూడా అవసరమే. దీనికి ప్రీమియం రూ.100–200 వరకే ఉంటుంది. ప్రమాదాల్లో వైకల్యం పాలైన సందర్భాల్లో భవిష్యత్తు ప్రీమియం చెల్లించాల్సిన అవసరాన్ని ఈ రైడర్‌ తప్పిస్తుంది.  

→ జీవిత బీమా అయినా, ఆరోగ్య బీమా అయినా, చివరికి హోమ్‌ ఇన్సూరెన్స్‌ అయినా.. కనీసం రెండేళ్లకోసారి సమీక్షించుకోవాలి. ఆదాయంతోపాటు కుటుంబ బాధ్యతలూ పెరుగుతుంటాయి.  తీసుకున్న కవరేజీ, అందులోని సదుపాయాలు తమ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయా? అన్నది పరిశీలించుకోవాలి. అవసరమైతే, అదనపు కవరేజీ తీసుకోవాలి.  

Videos

క్లోజ్డ్ రూమ్ లో కన్నింగ్ ప్లాన్.. అసెంబ్లీ సాక్షిగా అంతా బాబే చేశాడు..

'బేబి' వైష్ణవి చైతన్య క్యూట్ ఫొటోలు

Gadikota Srikanth : రాయలసీమ ప్రాంతంపై ఎందుకింత ద్వేషం చంద్రబాబు

NEW RECORD: రూ.3 లక్షల కోట్లు దాటేసిన చంద్రబాబు అప్పులు

TVK అధినేత విజయ్ కు సీబీఐ నోటీసులు..

Tirumala: చిరంజీవి సతీమణి సురేఖకు అవమానం...పవన్ రియాక్షన్!

Mayor Rayana: మీది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం

Konasema: బయటపడుతున్న సంచలన విషయాలు..

ఏపీ-తెలంగాణ జల వివాదంపై స్పందించిన ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్

YSRCP Leaders: ఇది చేతగాకే.. ఓయబ్బో అని చేతులెత్తేశావ్..

Photos

+5

గోవాలో బీచ్ ఒడ్డున హీరోయిన్ రాశీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

కత్రినా కైఫ్ చెల్లిని ఎప్పుడైనా చూశారా? (ఫొటోలు)

+5

జపనీస్ చెఫ్ స్పెషల్.. చరణ్ ఇంట్లో బిర్యానీ పార్టీ! (ఫొటోలు)

+5

ఎ.ఆర్. రెహమాన్ బర్త్‌డే వేడుకలు.. సందడిగా సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

జగజ్జేతలకు సన్మానం.. ప్రత్యేక ఆకర్షణగా రోహిత్‌, హర్మన్‌

+5

Sankranti 2026 : పల్లె గాలిలో రుచుల పండుగ (ఫొటోలు)

+5

కోనసీమ గుండెల్లో బ్లో అవుట్‌ మంటలు (ఫోటోలు)

+5

సందడిగా సాక్షి ముగ్గుల పోటీలు (ఫొటోలు)

+5

'వామ్మో వాయ్యో' సాంగ్.. తెర వెనక ఆషిక ఇలా (ఫొటోలు)

+5

దీపికా పదుకోణె బర్త్‌డే స్పెషల్‌.. వైరల్‌ ఫోటోలు ఇవే