విజయ్ సేతుపతి హీరోగా మూకీ సినిమా.. టీజర్ రిలీజ్

Published on Sat, 01/03/2026 - 14:32

తమిళ నటుడు విజయ్ సేతుపతి దక్షిణాదితో పాటు హిందీలోనూ సినిమా చేస్తున్నాడు. గతేడాది ఏస్, తలైవన్ తలైవి లాంటి తమిళ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఇది త్వరలో రిలీజ్ కానుంది. ఇప్పుడు సడన్‌గా ఓ మూకీ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైపోయాడు. ఈ మేరకు టీజర్ రిలీజ్ చేశారు.

'గాంధీ టాక్స్' పేరుతో తీస్తున్న సినిమాలో తాను నటిస్తున్నానని విజయ్ సేతుపతి.. అప్పుడెప్పుడో 2021లో పోస్ట్ పెట్టాడు. తర్వాత ఈ మూవీ పత్తా లేకుండా పోయింది. 2023 నవంబరులో గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో చిత్రాన్ని ప్రదర్శించారు. తర్వాత మళ్లీ సైలెంట్. ఇప్పుడు అన్ని పనులు పూర్తి చేసుకుని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

గాంధీ వర్ధంతి సందర్భంగా జనవరి 30న ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి, అదితీ రావు హైదరీ, అరవింద్ స్వామి లాంటి స్టార్స్ ఇందులో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. టీజరో ట్రైలరో తెలీదు గానీ 80 సెకన్ల వీడియోని రిలీజ్ చేసి థియేటర్లలోకి ఎ‍ప్పుడొస్తుందనే విషయాన్ని ప్రకటించారు. మూకీ సినిమాని ఈ జనరేషన్ ప్రేక్షకులు ఎంతమేరకు ఆదరిస్తారనేది చూడాలి?

Videos

మణికొండలో కత్తితో ప్రేమోన్మాది హల్ చల్ !

చంద్రబాబు భోగాపురం టెండర్ల రద్దు.. సాక్ష్యాలు బయటపెట్టిన వైస్సార్సీపీ నేత

ఇంకా ప్రతిపక్షనేత భ్రమలోనే పవన్! అందుకే విన్యాసాలు

డ్రగ్ డాన్ లుగా కూటమి పెద్దలు!

న్యూయార్క్ జైలుకు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో

తిరుమలలో రోజుకో అపచారం

మేడారంకు పోటెత్తిన భక్తులు

చంద్రబాబుకు బిగ్ షాక్.. YSRCP లోకి భారీ చేరికలు

చీకటి ఒప్పందంతో రాయలసీమకు చంద్రబాబు ద్రోహం..

డ్రగ్స్ కేసులో జమ్మలమడుగు MLA ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి

Photos

+5

భక్తజనంతో కిక్కిరిసిన మేడారం (ఫొటోలు)

+5

'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మూవీ టీజర్‌ విడుదల (ఫొటోలు)

+5

విజయవాడలో పుస్తక మహోత్సవం సందడి (ఫొటోలు)

+5

విజయవాడ : వేడుకగా ముందస్తు సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)

+5

దుబాయి ట్రిప్‌లో భార్యతో కలిసి రాహుల్ సిప్లిగంజ్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి (ఫొటోలు)

+5

ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఆదిపురుష్ హీరోయిన్ సిస్టర్‌ (ఫొటోలు)

+5

2025 ఏడాది మధుర క్షణాలను షేర్‌ చేసిన సూర్యకుమార్‌ సతీమణి (ఫోటోలు)

+5

కూతురితో కలిసి పోర్చుగల్ ట్రిప్ వేసిన ప్రణీత (ఫొటోలు)