చెప్పినట్లే చేసిన చైనా దిగ్గజం: రూ. 50వేలు పెరిగిన కారు రేటు!

Published on Sat, 01/03/2026 - 07:28

2026 జనవరి 1నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు చెప్పిన చైనా కార్ల తయారీ సంస్థ బీవైడీ.. ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ SUV ధర సవరణను ప్రకటించింది. ఈ నెల ప్రారంభం నుంచి అమల్లోకి వచ్చిన ధరల ప్రకారం.. సీలియన్ 7 ప్రీమియం వేరియంట్ రేటు రూ. 50,000 పెరిగింది. అయితే పెర్ఫార్మెంట్ వేరియంట్ ధరల్లో ఎటువంటి మార్పు లేదని ప్రకటించింది.

జనవరి 1న జరిగిన ధరల సర్దుబాటు తర్వాత.. 82.56 kWh బ్యాటరీని కలిగిన BYD సీలియన్ 7 ప్రీమియం మోడల్ ధర రూ. 48,90,000 నుంచి రూ. 49,40,000లకు పెరిగింది. సీలియన్ 7 పెర్ఫార్మెన్స్ మోడల్ ధర రూ. 54,90,000వద్ద కొనసాగుతుంది. ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుంచి కంపెనీ 2,300 యూనిట్ల సీలియన్ కార్లను విక్రయించింది.

ఇదీ చదవండి: హ్యుందాయ్ వెన్యూ కొత్త వేరియంట్ లాంచ్: ధర ఎంతంటే?

కంపెనీ ఈ కారులో సెల్-టు-బాడీ డిజైన్ & బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ వంటి వాటిని అందించింది. ఇది సేఫ్టీలో కూడా 5 స్టార్ రేటింగ్ సాధించింది. ప్రీమియం వెర్షన్ 308 hp & 380 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 567 కి.మీ రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ కారు.. 15.6 ఇంచెస్ టచ్‌స్క్రీన్, నప్పా లెదర్ సీటింగ్, ఎలక్ట్రిక్ సన్‌షేడ్‌తో కూడిన పనోరమిక్ గ్లాస్ రూఫ్ & 12-స్పీకర్ డైనాడియో ఆడియో సిస్టమ్ పొందుతుంది. వీటితోపాటు.. ఇందులో 11 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ సేఫ్టీ లభిస్తుంది.

#

Tags : 1

Videos

మణికొండలో కత్తితో ప్రేమోన్మాది హల్ చల్ !

చంద్రబాబు భోగాపురం టెండర్ల రద్దు.. సాక్ష్యాలు బయటపెట్టిన వైస్సార్సీపీ నేత

ఇంకా ప్రతిపక్షనేత భ్రమలోనే పవన్! అందుకే విన్యాసాలు

డ్రగ్ డాన్ లుగా కూటమి పెద్దలు!

న్యూయార్క్ జైలుకు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో

తిరుమలలో రోజుకో అపచారం

మేడారంకు పోటెత్తిన భక్తులు

చంద్రబాబుకు బిగ్ షాక్.. YSRCP లోకి భారీ చేరికలు

చీకటి ఒప్పందంతో రాయలసీమకు చంద్రబాబు ద్రోహం..

డ్రగ్స్ కేసులో జమ్మలమడుగు MLA ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి

Photos

+5

భక్తజనంతో కిక్కిరిసిన మేడారం (ఫొటోలు)

+5

'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మూవీ టీజర్‌ విడుదల (ఫొటోలు)

+5

విజయవాడలో పుస్తక మహోత్సవం సందడి (ఫొటోలు)

+5

విజయవాడ : వేడుకగా ముందస్తు సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)

+5

దుబాయి ట్రిప్‌లో భార్యతో కలిసి రాహుల్ సిప్లిగంజ్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి (ఫొటోలు)

+5

ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఆదిపురుష్ హీరోయిన్ సిస్టర్‌ (ఫొటోలు)

+5

2025 ఏడాది మధుర క్షణాలను షేర్‌ చేసిన సూర్యకుమార్‌ సతీమణి (ఫోటోలు)

+5

కూతురితో కలిసి పోర్చుగల్ ట్రిప్ వేసిన ప్రణీత (ఫొటోలు)