10 నిమిషాల్లో డెలివరీ: స్పందించిన జొమాటో సీఈఓ

Published on Fri, 01/02/2026 - 12:45

జీతం, పని పరిస్థితులు, సామాజిక భద్రత లేకపోవడాన్ని నిరసిస్తూ డిసెంబర్ 31న గిగ్ వర్కర్లు సమ్మె నిర్వహించారు. ఆ తరువాత ప్రోత్సాహాలు అందిస్తున్నట్లు ప్రకటనలు వచ్చాయి. ఇప్పుడు 10 నిమిషాల డెలివరీపై జొమాటో సీఈఓ.. దీపిందర్ గోయల్ స్పందించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

10 నిమిషాల డెలివరీ సర్వీస్.. డెలివరీ ఏజెంట్స్ లేదా రైడర్లపై ఒత్తడి తెస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో, దీపిందర్ గోయల్ స్పందిస్తూ..ఇళ్ల చుట్టుపక్కల్లో దుకాణాలు ఎక్కువ కావడం వల్లనే 10 నిమిషాల డెలివరీ అనేది తీసుకొచ్చాము. దీని ఉద్దేశ్యం డెలివరీ ఏజెంట్ వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాలని కాదని అన్నారు. అంతే కాకుండా డెలివరీ కోసం కస్టమర్లకు ఇచ్చిన టైమర్.. డెలివరీ ఏజెంట్లకు కనిపించదని వెల్లడించారు.

బ్లింకిట్‌లో ఆర్డర్ వచ్చిన తరువాత.. దానిని 2.5 నిమిషాల్లో ప్యాక్ చేస్తారు. ఆ తరువాత రైడర్ 8 నిమిషాలకు 2 కిలోమీటర్ల చొప్పున రైడ్ చేసినా.. గంటకు సగటున 15 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలడు. ఈ విధానం అర్థం చేసుకోకపోవడం వల్లనే.. దీనిని రిస్క్ అని భావిస్తున్నారు. కాబట్టి దీనిని గిగ్ వర్కర్లు తప్పకుండా అర్థం చేసుకోవాలి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పూర్తిగా నమ్మవద్దని గోయల్ పేర్కొన్నారు.

ఇక కార్మికుల భద్రత గురించి వివరిస్తూ.. డెలివరీ భాగస్వాములకు వైద్య, జీవిత బీమా ఉందని గోయల్ అన్నారు. ఆలస్యానికి జరిమానాల విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ.. డెలివరీ ఏజెంట్స్.. సమయానికి అందించకపోతే ఏమీ జరగదు. కొన్నిసార్లు అనుకోకుండా ఆలస్యాలు జరుగుతాయని గోయల్ వెల్లడించారు

Videos

మణికొండలో కత్తితో ప్రేమోన్మాది హల్ చల్ !

చంద్రబాబు భోగాపురం టెండర్ల రద్దు.. సాక్ష్యాలు బయటపెట్టిన వైస్సార్సీపీ నేత

ఇంకా ప్రతిపక్షనేత భ్రమలోనే పవన్! అందుకే విన్యాసాలు

డ్రగ్ డాన్ లుగా కూటమి పెద్దలు!

న్యూయార్క్ జైలుకు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో

తిరుమలలో రోజుకో అపచారం

మేడారంకు పోటెత్తిన భక్తులు

చంద్రబాబుకు బిగ్ షాక్.. YSRCP లోకి భారీ చేరికలు

చీకటి ఒప్పందంతో రాయలసీమకు చంద్రబాబు ద్రోహం..

డ్రగ్స్ కేసులో జమ్మలమడుగు MLA ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి

Photos

+5

భక్తజనంతో కిక్కిరిసిన మేడారం (ఫొటోలు)

+5

'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మూవీ టీజర్‌ విడుదల (ఫొటోలు)

+5

విజయవాడలో పుస్తక మహోత్సవం సందడి (ఫొటోలు)

+5

విజయవాడ : వేడుకగా ముందస్తు సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)

+5

దుబాయి ట్రిప్‌లో భార్యతో కలిసి రాహుల్ సిప్లిగంజ్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి (ఫొటోలు)

+5

ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఆదిపురుష్ హీరోయిన్ సిస్టర్‌ (ఫొటోలు)

+5

2025 ఏడాది మధుర క్షణాలను షేర్‌ చేసిన సూర్యకుమార్‌ సతీమణి (ఫోటోలు)

+5

కూతురితో కలిసి పోర్చుగల్ ట్రిప్ వేసిన ప్రణీత (ఫొటోలు)