Breaking News

ఏం చేశావ్ బ్రో.. చూపు తిప్పుకోలేక‌పోయాం

Published on Thu, 01/01/2026 - 15:22

సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన ఓ వీడియో క్లిప్ గురించి మ‌నం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అంకిత్ ద్వివేది అనే వ్య‌క్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. దీనికి ఏకంగా 90 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్‌,  9 ల‌క్ష‌ల‌కు పైగా లైకులు, వేల సంఖ్య‌లో కామెంట్లు వ‌చ్చాయి. షేర్లు, రీపోస్టులు కూడా వేల సంఖ్య‌లో జ‌రిగాయి. అంత‌గా ఏముంది ఆ వీడియాలో..!

కార్పొరేట్ కంపెనీలో ప‌ని చేసే యువ‌కుడొక‌రు త‌న‌ స‌హోద్యోగుల ముందు డాన్స్ చేస్తున్న వీడియో ఇది. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ బ్లాక్ బస్టర్ మూవీ 'బ్యాంగ్ బ్యాంగ్'లోని పాట‌కు అత‌డు డాన్స్ చేశాడు. అయితే ఆషామాషీగా డాన్స్ చేయ‌లేదు. ఎంతో పొందిక‌గా, చూడ చ‌క్క‌గా చేశాడు. ఒక్క స్టైప్ కూడా మిస్ కాకుండా వావ్ అనిపించాడు. సహోద్యోగులు అత‌డి ప్రదర్శనను ప్ర‌త్య‌క్షంగా చూస్తూ, ఉత్సాహపరిచారు. అత‌డి డాన్స్‌ను త‌మ సెల్‌ఫోన్ల‌లో బంధించారు. అత‌డు కూడా ఓవ‌ర్ యాక్ష‌న్ చేయ‌కుండా చ‌క్క‌గా డాన్స్ చేసి త‌న టాలెంట్ ప్ర‌ద‌ర్శించాడు.

ఈ వీడియో క్లిప్‌ను అంకిత్ ద్వివేది ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 'కార్పొరేట్ జాబ్ కార‌ణంగా త‌న అభిరుచిని చంపుకున్న వ్య‌క్తి' అంటూ క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ వీడియో చూసిన వారంతా డాన్స్ బాగుందంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. మాకు కూడా ఈ స్టెప్పులు నేర్పిస్తారా అని అడుగుతున్నారు. కొంత‌మంది అయితే హృతిక్ రోషన్ (Hrithik Roshan) త‌ప్ప‌నిసరిగా ఈ వీడియో చూడాల‌ని కోరుతున్నారు.

నెటిజ‌న్ల కామెంట్లు
బాధ్య‌త‌ల కోసం త్యాగాలు చేయ‌డం త‌ప్ప‌ద‌ని ఒక‌రు కామెంట్ చేశారు. గ‌మ‌నిస్తే మ‌న చుట్టుక్క‌ల ఇలాంటి  వారు చాలా మంది ఉంటార‌ని మ‌రొక‌రు అన్నారు. బాధ్య‌త‌ల కోసం త‌మ ఇష్టాల‌ను వ‌దులుకునే వారు క‌చ్చితంగా తార‌స‌ప‌డార‌ని పేర్కొన్నారు. డాన్స్ అంటే అత‌డికి ఎంత ఇష్ట‌మో ఈ వీడియో చూస్తే తెలుస్తుంద‌న్నారు. ఏదో ఒక రోజు అత‌డు అభిష్టాన్ని నెర‌వేర్చుకుంటాడ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. 

 

Videos

అల్లు అర్జున్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ..?

నేను నిప్పు, తెరిచిన పుస్తకం అన్నావ్ గా.. మరీ ఈ సీక్రెట్ టూర్ లు ఏంటి?

ఫ్రెండ్స్ తో పందెం కట్టి.. పెన్ను మింగేశాడు

ఈ వయసులో నీకు బుద్ధి లేదా.. MLA బుచ్చయ్య చౌదరిపై రెచ్చిపోయిన చెల్లుబోయిన

స్విట్జర్లాండ్ లో పెను విషాదం.. 40 మంది మృతి ..100 మందికి గాయాలు

చంద్రబాబు మీద ఉన్న ప్రతి కేసు రీ ఓపెన్!

బుజ్జితల్లి టాలీవుడ్ కు వచ్చేస్తుందా..

ప్రేమపెళ్లి చేసుకున్న యువకుడిపై దాడి

800 KG కేక్ కట్టింగ్.. జగన్ ఆశీస్సులతో మనదే విజయం

జగన్ వార్నింగ్ తో చంద్రబాబు సెల్ఫ్ గోల్..

Photos

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

‘ఈషా’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

లంగా ఓణీలో 'ఈషా రెబ్బా'.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన సినీ సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

హైటెక్ సిటీలో ఉత్సాహంగా న్యూ ఇయర్ వేడుకలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు (ఫొటోలు)