అల్లు అర్జున్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ..?
Breaking News
భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
Published on Thu, 01/01/2026 - 14:29
2026 సంవత్సరం మొదటి రోజు భారతదేశం అంతటా.. హోటళ్ళు, రెస్టారెంట్లు, సర్వీస్ ఆపరేటర్లకు షాక్ తగిలింది. ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.. ఎల్పీజీ కమర్షియల్ గ్యాస్ ధరను రూ.111 పెంచాయి. తాజా సవరణతో.. దేశ రాజధానిలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.1,691.50కి (గతంలో రూ. 1,580.50 గా ఉండేది) పెరిగింది.
ముంబైలో కూడా ఇదే విధంగా రూ.1,531.50 నుంచి రూ.1,642.50కి పెరిగింది. కోల్‌కతాలో ధర రూ.1,684 నుంచి రూ.1,795కి పెరిగింది. చెన్నైలో అత్యధిక ధరలు (రూ.1,739.50 నుంచి రూ.1,849.50కి) నమోదయ్యాయి. ధరలు పెరగడం వల్ల.. రోజువారీ కార్యకలాపాలకు గ్యాస్‌పై ఎక్కువగా ఆధారపడే వ్యాపారాలకు నిర్వహణ ఖర్చులను గణనీయంగా పెంచే అవకాశం ఉంది. అయితే గృహ వినియోగం కోసం ఉపయోగించే 14.2 కేజీల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
Oil marketing companies have increased the prices of commercial LPG gas cylinders. The rate of the 19 KG commercial LPG gas cylinder has been increased by Rs 111, effective from today, 1st January.
In Delhi, the retail sale price of 19kg commercial LPG cylinder is now Rs 1691.50…— ANI (@ANI) January 1, 2026
Tags : 1