Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు
Breaking News
పెట్రోల్, సీఎన్‌జీ వాహనాలకు గ్రీన్ సెస్?: ధరలు పెరిగే ఛాన్స్
Published on Mon, 12/29/2025 - 16:16
డీజిల్ కార్లపై ప్రస్తుతం విధించే గ్రీన్ సెస్‌ను.. ఢిల్లీ ప్రభుత్వం పెట్రోల్, CNG వాహనాలపై విధించే అవకాశం ఉంది. దీనివల్ల కార్ల ధరలు మరింత పెరగనున్నాయి. ఎలక్ట్రిక్ వాహన విధానం ముసాయిదాలో భాగమైన ఈ ప్రతిపాదన ప్రకారం సెస్ అమలు చేయనున్నారు. మార్చి నాటికి ఈ విధానాన్ని ఖరారు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడ ప్రభుత్వం.. ఈవీలను ప్రోత్సహించడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే.. డీజిల్, పెట్రోల్, CNG వాహనాల కొనుగోలును తగ్గించాలి. దీనికోసం ధరలను పెంచాలని నిర్ణయించుకున్నట్లు.. రవాణా శాఖ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
సెంట్రల్ వాహన్ పోర్టల్ డేటా ప్రకారం.. ఢిల్లీలో ప్రతి నెలా జరిగే అన్ని వాహనాల రిజిస్ట్రేషన్లలో ఎలక్ట్రిక్ వాహనాలు 12-14% వాటా కలిగి ఉన్నాయి. ఈ సంవత్సరం నమోదైన సుమారు 8,00,000 వాహనాలలో, దాదాపు 1,11,000 ఎలక్ట్రిక్ వాహనాలు. ఈ సంఖ్యను మరింత పెంచే యోజనలో ప్రభుత్వం కొత్త నిర్ణయాలను తీసుకుంటోంది.
Tags : 1