Breaking News

లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. కుటుంబం లోన్ చెల్లించాలా?

Published on Sun, 12/28/2025 - 21:15

ఈ రోజుల్లో ఎంత పెద్ద ఉద్యోగం చేసేవారికైనా.. కొన్ని సందర్భాల్లో లోన్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే లోన్ తీసుకున్న వ్యక్తి అనుకోని సందర్భాల్లో మరణిస్తే.. ఆ లోన్ ఎవరు చెల్లించాలి?, ఇది చాలామంది మనసులో మెదిలే ప్రశ్న. ఈ ప్రశ్నకు.. ఇక్కడ సమాధానం తెలుసుకుందాం.

నిజానికి పర్సనల్ లోన్ పొందటానికి దాదాపు ఎలాంటి ఆస్తులకు పూచీకత్తు అవసరం లేదు. కాబట్టి దీనిని అన్‌సెక్యూర్డ్ లోన్ కింద పరిగణిస్తారు. కాబట్టి పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే చెల్లింపు విషయం కొన్ని పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

చాలా బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు లోన్‌తో పాటు లోన్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తాయి. ఆలాంటి ఇన్సూరెన్స్ ఉంటే.. లోన్ మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. కాబట్టి లోన్ భారం.. మరణించిన లోన్ తీసుకున్న వ్యక్తి కుటుంబ సభ్యులపై పడదు. ఇన్సూరెన్స్ లేని సందర్భంలో.. కుటుంబ సభ్యులు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు.

లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. అతనికి చెందిన ఆస్తులు ఏవైనా ఉంటే, బ్యాంక్ ఆ ఆస్తులపై క్లెయిమ్ చేయవచ్చు. ఆ ఆస్తుల విలువలో నుంచి లోన్ మొత్తాన్ని తీసుకుంటారు. మిగిలింది వారసులకు అప్పగిస్తుంది. ఒకవేళా కో-అప్లికెంట్ ఉన్నట్లయితే.. ఆ వ్యక్తే లోన్ చెల్లించాలి. గ్యారెంటర్ ఉంటే.. బ్యాంక్ గ్యారంటర్ దగ్గర నుంచి లోన్ రికవర్ చేస్తుంది

ఇదీ చదవండి: బ్యాంక్ అకౌంట్ వాడకుండా ఉంటే.. ఖాతాలో డబ్బు ఏమవుతుంది?

ఏ ఆస్తులు లేవు, కో-అప్లికెంట్ లేరు, గ్యారంటర్ లేరు అన్నప్పుడు.. కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ బ్యాంక్ లీగల్ నోటీసులు పంపిస్తుంది. దానికి కుటుంబ సభ్యులు భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో బ్యాంకులు లోన్ మాఫీ చేసే అవకాశం కూడా ఉంది.

#

Tags : 1

Videos

పిడుగురాళ్ల CI వేధింపులకు మహిళ ఆత్మహత్యాయత్నం

చిరు, వెంకీ ఊరమస్ స్టెప్స్..!

ఆపరేషన్ సిందూర సమయంలో భారత్ దెబ్బకు పారిపోయి దాక్కున్నాం

హార్ట్ పేషెంట్స్ ఎవ్వరూ లేరు..! కేటీఆర్ కు పొన్నం కౌంటర్

అల్లాడిపోతున్నది అమ్మ మా అనిత.. పేర్నినాని ఊర మాస్ ర్యాగింగ్

ఎవడబ్బ సొమ్మని మా భూమిలోకి వస్తారు.. మీకు చేతనైతే..

ఒక్క బిడ్ రాలేదు.. జగన్ దెబ్బకు బొమ్మ రివర్స్.. పగతో రగిలిపోతున్న చంద్రబాబు

సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్

సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్

టీడీపీ, జనసేన నేతలే ఛీ కొడుతున్నారు.. అయినా మీకు సిగ్గు రాదు

Photos

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు

+5

ప్రభాస్ ది రాజాసాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ సందడి.. ఫోటోలు

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)

+5

చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్‌ కర్ణ్‌ శర్మ (ఫొటోలు)