పిడుగురాళ్ల CI వేధింపులకు మహిళ ఆత్మహత్యాయత్నం
Breaking News
సల్మాన్ ఖాన్ ఐకానిక్ ఫిరోజా బ్రాస్లెట్ వెనుక ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదే..!
Published on Sun, 12/28/2025 - 13:19
బాలీవుడ్ ప్రముఖ నటుడు భాయిజాన్ సల్మాన్‌ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కండల వీరుడు సల్మాన్‌కి ఎంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. 60లలో సైతం యువ హీరోలను కూడా వెనక్కి నెట్టి తన హ్యాండ్సమ్ లుక్, వైవిధ్యభరితమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు బాయిజాన్. ఆయనకు సంబంధించిన ప్రతి విషయం అభిమానులకు ఆసక్తిని, కుతుహలాన్ని రేకెత్తిస్తుంటుంది.
తాజాగా ఆయన చేతికుండే వెండి బ్రాస్లెట్ గురించే అందరి అటెన్షన్. అది సాధారణ బ్రాస్లెట్లా కాకుండా ఒక రత్నంతో చాలా పెద్ద బ్రాసెలెట్. అంద పెద్దిది బాయిజాన్ ఎందుకు ధరిస్తారు అనేది అందరి మదిని తొలిచ్చే సందేహం ఇది. దీని వెనుకున్న కథను సల్మానే స్వయంగా వివరించి అభిమానుల అనుమానాలకు చెక్‌పెట్టారు. అంతేగాదండోయ్ దాని ధర, ప్రాముఖ్యత రెండు అత్యంత స్పెషాల్టీనే.
సికిందర్ భాయ్‌గా పిలిచే మన సల్లూ భాయ్ చేతికి ఉండే వెండి బ్రాస్లెట్ని ఎట్టిసమయంలో స్కిప్ చేయరు. ప్రతి ఫంగ్షన్లో ఆయన చేతికి అది తప్పనిసరిగా ఉంటుంది. బిగ్‌బాస్‌కి హోస్ట్‌గా ఉన్నప్పుడూ, పబ్లిక్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడూ ఎప్పుడు దాన్ని అస్సులు బయటకు తీయడు.
దబాంగ్ వంటి చిత్రాల షూటింగ్ సమయంలో మాత్రమే దాన్ని ధరించలేదు. ఆ మూవీ క్యారెక్టర్‌కి నప్పదు కాబట్లి సల్లూభాయ్‌కి తీయక తప్పలేదు. దీన్ని ఐకానిక్ ఫిరోజా బ్రాస్లెట్గా పిలుస్తారట. దీని ధర దగ్గర దగ్గర రూ. 80,000/- పైనే పలుకుతుందట.
అదంటే ఎందుకంత ఇష్టం..
సల్మాన్‌కి ఆ బ్రాస్లెట్ అత్యంత విలువైన వస్తువుల్లో ఒకటి. దానిని మణిక్టు నుంచి తీయడం అత్యంత అరుదు. ఇది సుల్తాన్ నటుడు సల్మాన్ తండ్రి సలీంఖాన్ వద్ది ఇదే బ్రాస్లెట్ ఉండేది. తాను చిన్నప్పుడు దానితో ఆడుకునేవాడినని పంచుకున్నారు. అయితే తాను సినీఫీల్డ్‌లోకి వచ్చినప్పుడూ అచ్చం అలాంటి బ్రాస్లెట్నే బహుమతిగా ఇచ్చినట్లు తెలిపారు.
ఈ రాయిని ఫిరోజా అంటారు. దీనిని సజీవరాయిగా పిలుస్తారు. అయితే సల్మాన్ దీన్ని ఫ్యాషన్ కోసం కాదు, ప్రశాంతత, ఆశావాద దృక్పథన్ని ఇచ్చే సెంటిమెంట్ బ్రాస్లెట్గా విశ్వసిస్తాడు. అందువల్లే మన సల్లుభాయ్ చేతికి ఆ బ్రాస్లేకుండా అస్సలు కనిపించడు.
స్పెషాల్టీ ఏంటంటే..
మనపై వచ్చే ప్రతికూలతలను ఇది గ్రహిస్తుంది. ఆ తర్వాత ఇది పగిలిపోవడం జరుగుతుంది. అలా ఇప్పటి వరకు ఏడు రాళ్లు మార్చినట్లు సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చారు. ఇది ఆకాశ నీలం-ఆకుపచ్చ షేడ్లలో ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం..బృహస్పతి గ్రహానికి సంబంధించినదిగా భావిస్తారు.
(చదవండి: ధురంధర్ మూవీ క్రేజ్‌తో వైరల్‌గా 'దూద్ సోడా'..! ఎలా తయారు చేస్తారంటే..?)
Tags : 1