రియల్‌ ఎస్టేట్‌.. ఫుల్‌ జోష్‌!

Published on Sat, 12/27/2025 - 11:56

హైదరాబాద్‌ నగరంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం గాడినపడింది. ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాలు, కీలకమైన ప్రాజెక్ట్‌ల కార్యాచరణ, అందుబాటు ధరలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, కాస్మోపాలిటన్‌ కల్చర్‌ వంటి కారణాలు అనేకం. ఈ ఏడాది నవంబర్‌లో 6,923 నివాస సముదాయాలు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. వీటి విలువ రూ.4,904 కోట్లు. ఈ ఏడాదిలో ఈ నెలలోనే అత్యధిక రిజిస్ట్రేషన్లు జరిగాయి. అలాగే ప్రాపర్టీల ధరలు సగటున 9 శాతం మేర వృద్ధి చెందాయని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది.  

గతేడాది నవంబర్‌లో రూ.3,504 కోట్ల విలువ చేసే 5,528 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. అంటే గతేడాది నవంబర్‌తో పోలిస్తే 25 శాతం మేర, అంతకుముందు నెల అక్టోబర్‌తో పోలిస్తే 12 శాతం రిజిస్ట్రేషన్లు పెరిగాయి. అలాగే రిజిస్టర్డ్‌ ప్రాపర్టీల విలువ గతేడాది ఇదే నెలతో పోలిస్తే 40 శాతం మేర వృద్ధి చెందాయి.

విశాలమైన ఇళ్లు.. 
విస్తీర్ణమైన ఇళ్ల కొనుగోళ్లకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. నవంబర్‌లో రిజిస్ట్రేషన్‌ జరిగిన ప్రాపర్టీలో 17 శాతం వాటా 2 వేల చ.అ.ల కంటే విస్తీర్ణమైన యూనిట్లే అత్యధికంగా ఉన్నాయి. ఇక, విస్తీర్ణాల వారీగా చూస్తే.. గత నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో అత్యధికంగా 1,000–2,000 చ.అ. ప్రాపర్టీల వాటా 67 శాతం కాగా.. 500–1,000 చ.అ. యూనిట్ల వాటా 14 శాతం, 500 చ.అ.ల్లోపు ప్రాపర్టీల వాటా 2 శాతంగా ఉంది.

లగ్జరీదే హవా.. 
విశాలమైన, విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్‌ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. నవంబర్‌లో జరిగిన రిజిస్ట్రేషన్లలో 87 శాతం ఈ విభాగానివే కావడమే ఇందుకు ఉదాహరణ. గత నెలలో రూ.కోటి కంటే ఎక్కువ విలువైన 1,487 యూనిట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. వీటి విలువ రూ.2,491 కోట్లు. ఇక, రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర ఉన్నవి 1,735 యూనిట్లు రిజిస్ట్రేషన్‌ కాగా వీటి విలువ రూ.1,244 కోట్లు, రూ.50 లక్షల్లోపు ధర ఉన్నవి 3,701 యూనిట్లు రిజిస్ట్రేషన్‌ కాగా వీటి విలువ రూ.1.169 కోట్లు.

Videos

హార్ట్ పేషెంట్స్ ఎవ్వరూ లేరు..! కేటీఆర్ కు పొన్నం కౌంటర్

అల్లాడిపోతున్నది అమ్మ మా అనిత.. పేర్నినాని ఊర మాస్ ర్యాగింగ్

ఎవడబ్బ సొమ్మని మా భూమిలోకి వస్తారు.. మీకు చేతనైతే..

ఒక్క బిడ్ రాలేదు.. జగన్ దెబ్బకు బొమ్మ రివర్స్.. పగతో రగిలిపోతున్న చంద్రబాబు

సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్

సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్

టీడీపీ, జనసేన నేతలే ఛీ కొడుతున్నారు.. అయినా మీకు సిగ్గు రాదు

శివాజీ వ్యాఖ్యలపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్

వైఎస్ జగన్ ను చూసి చంద్రబాబు అండ్ కో భయపడుతున్నారు

ప్లాన్ చేసి యువకుడి మర్డర్.. అక్కా చెల్లెళ్ల మాస్టర్ ప్లాన్

Photos

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు

+5

ప్రభాస్ ది రాజాసాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ సందడి.. ఫోటోలు

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)

+5

చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్‌ కర్ణ్‌ శర్మ (ఫొటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు.. కిక్కిరిసిన ఆలయ ప్రాంగణాలు.. పోటెత్తిన భక్తులు.. (చిత్రాలు)

+5

తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ శివయ్యను మీరు ఎప్పుడైనా చూశారా (ఫొటోలు)

+5

హీరోయిన్ల దుస్తులపై 'శివాజీ' కామెంట్‌.. ట్రెండింగ్‌లో 'అనసూయ' (ఫోటోలు)