Breaking News

పదకొండేళ్ల బైక్‌కి కేటీఎం బై బై..

Published on Sat, 12/20/2025 - 14:23

ప్రముఖ ప్రీమియం  ద్విచక్రవాహన సంస్థ కేటీఎం తమ పాపులర్‌ కేటీఎం ఆర్‌సీ390 బైక్‌కు వీడ్కోలు పలకనుంది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ తగ్గిన కారణంగా ఆర్‌సీ390 బైక్‌ మోడల్ను నిలిపిపేయాలని నిర్ణయించుకుంది. ఎంసీఎన్నివేదిక ప్రకారం.. సింగిల్-సిలిండర్ బైక్కు మార్కెట్లో తగినంత డిమాండ్ లేదు. దీంతో పాటు యూరో5+ ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా 373 సీసీ ఇంజిన్ను నవీకరించాలంటే అయ్యే ఖర్చుతో దాని ధర భారీగా పెరుగుతుంది. నేపథ్యంలో మోడల్ఉత్పత్తిని ఇక ఆపేయడం మంచిదనే నిర్ణయానికి ఆస్ట్రియా బైక్కంపెనీ వచ్చేసినట్లు తెలుస్తోంది.

దశాబ్దంపైనే..

కేటీఎం ఆర్సీ390 మొట్టమొదటిసారిగా 2014 లో భారత మార్కెట్లో విడుదలైంది. అప్పటి నుండి, ఈ సంవత్సరం తాజా అప్డేట్లో కలిసి రెండుసార్లు అప్డేట్అయింది. మార్కెట్లో సుమారు 11 సంవత్సరాలపాటు తన ఉనికిని కాపాడుకున్న మిడిల్వెయిట్స్పోర్ట్స్బైక్మంచి అమ్మకాలనే నమోదు చేస్తూప్రత్యర్థి కంపెనీ మోడళ్లకు గట్టి పోటీనే ఇచ్చింది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్నుంచి తప్పుకోకతప్పడం లేదు.

భారత్లో మాత్రం ఇంకొన్నాళ్లు

అంతర్జాతీయంగా ఆర్సీ390 బైక్ను నిలిపేస్తున్న కేటీఎం.. యూరోపియన్ మార్కెట్, యూకే డీలర్ షిప్ లలో ప్రస్తుతం ఉన్న స్టాక్ను 2026 వరకు విక్రయించనుంది. అయితే భారత మార్కెట్లో కేటీఎం ఆర్‌సీ390 బైక్ ఇంకొన్నాళ్లు కొనసాగుతుంది. సరిపడినంత డిమాండ్ ఇక్కడ ఇంకా ఉండటమే ఇందుకు కారణం. కేటీఎం మాతృ సంస్థ అయిన బజాజ్ ఆటో గొడుగు కింద ఈ బైక్భారత మార్కెట్లో తయారవుతుండటం దీనికి అదనపు ప్రయోజనాన్ని కలిగిస్తోంది.

కేటీఎం ఆర్‌సీ390 బైక్ ధర భారతదేశంలో ధర రూ .3.22 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండగా ప్రస్తుతం, బ్రాండ్ అధికారిక వెబ్ సైట్ నుండి ఈ మోటార్ సైకిల్ ధరను కంపెనీ తొలగించింది. ఇది 373 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్తో, ఆరు-స్పీడ్ ట్రాన్స్ మిషన్తోనడుస్తుంది. 43 బీహెచ్పీ శక్తిని, 37 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.

Videos

ఒకరోజు ముందే ఏపీ వ్యాప్తంగా సంబరాలు

సినిమా హీరోలు కూడా సరిపోరు.. ఆరోజుల్లోనే జగన్ క్రేజ్ ఎలా ఉండేదంటే

వివాదాల్లో కోదాడ పోలీసులు.. CI సస్పెండ్, ఎస్సై బదిలీ

హైదరాబాదులో ఘనంగా YSRCP అధినేత YS జగన్ జన్మదిన వేడుకలు

బీజేపీలో చేరిన సినీ నటి ఆమని

హాలీవుడ్ హీరోలా రోషన్.. ఛాంపియన్ బ్లాక్ బస్టర్ అంతే..!

జగన్ హయాంలోనే అభివృద్ధి.. ఆ రెండేళ్లు కోవిడ్ లేకపోతే ఏపీ పరిస్థితి మరోలా ఉండేది

ఇందుకే.. అమిత్ షా చంద్రబాబును ఏకి పారేశాడు

గోదావరి నడి మధ్యలో.. జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

కోతుల కోసం చింపాంజీ ఐడియా

Photos

+5

ఏపీవ్యాప్తంగా వైఎస్‌ జగన్‌ ముందస్తు బర్త్‌ డే వేడుకలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 20-27)

+5

శ్రీలంక ట్రిప్‌లో ధనశ్రీ వర్మ.. ఫుల్ చిల్ అయిపోతూ (ఫొటోలు)

+5

హ్యాపీ బర్త్ డే జగనన్న: జనం మెచ్చిన జననేత.. (ఫొటోలు)

+5

రెడ్ రోజ్‌లా 'కేజీఎఫ్' బ్యూటీ శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శనివారం చారిత్రక గోల్కొండ కోటను సందర్శించారు (ఫొటోలు)

+5

క్రిస్మస్ వేళ.. ఏపీలోని ఈ ప్రసిద్ధ చర్చి గురించి తెలుసా? (ఫొటోలు)

+5

కలర్‌ఫుల్‌ చీరలో కృతి శెట్టి.. ఫ్యాన్స్‌ కోసం ఫోటోలు షేర్‌ చేసిన బ్యూటీ

+5

ముచ్చట గొలిపే ముత్యాల ముగ్గులు.. మీరు ఓ లుక్ వేయండి (ఫొటోలు)

+5

‘మోగ్లీ 2025’ థ్యాంక్స్‌ మీట్‌..ముఖ్య అతిథిగా హీరో సాయిదుర్గా తేజ్‌ (ఫొటోలు)