ఒకరోజు ముందే ఏపీ వ్యాప్తంగా సంబరాలు
Breaking News
హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ ఆత్మహత్యాయత్నం
సోనియా గాంధీకి కిషన్రెడ్డి బహిరంగ లేఖ
జగనన్న బర్త్డే.. సోషల్ మీడియా షేక్
ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి ట్రంప్ డాటా గాయబ్
కోటి సంతకాలు.. కోట్ల గళాలు
#HBDYSJagan: సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధి
తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
రఘురామ ఒక 420.. కఠిన శిక్ష గ్యారెంటీ!
ఏఐ, చాట్ జీపీటీల వాడకం ప్రమాదం
ఈ రాశి వారికి వస్తులాభాలు.. ధనలబ్ధి
చక్రాల కుర్చీలో అంతరిక్ష యాత్ర
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఆ ప్రశ్న ఉద్యమం అయింది!
Published on Sat, 12/20/2025 - 04:18
గత మూడు దశాబ్దాలుగా న్యాయవాది వర్ష్ దేశ్ పాండే లింగ వివక్షతకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తోంది. అసౌకర్యం, బాధలో నుంచి తలెత్తిన ఒక సాధారణమైన ప్రశ్నతో ఆమె పోరాటం ప్రారంభమైంది. ‘అమ్మాయిలు తమదైన సమాజానికి ఎందుకు దూరం అవుతున్నారు?’ ఈ ప్రశ్న ‘దళిత మహిళా వికాస్ మండల్’కు పునాదిగా మారింది.
మహారాష్ట్రలో పాతుకుపోయిన చట్టవిరుద్ధమైన లింగనిర్ధారణ పరీక్షల రాకెట్లను బహిర్గతం చేసిన పాండే ఉద్యమాలు ఎన్నో చేసింది. ఎంతోమంది దొంగ వైద్యులను జైలుకు పంపించింది. ఈ సంవత్సరం ప్రతిష్ఠాత్మకమైన యూఎన్ పాపులేషన్ అవార్డ్ రూపంలో ఆమె పోరాటానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ‘ఇది నాకు వచ్చిన గుర్తింపు కాదు. నా పక్కన నిలబడిన ధైర్యవంతులైన మహిళలకు’ అంటోంది వర్ష్ దేశ్ పాండే పాండే.
#
Tags : 1