ఆస్ట్రేలియా లో కాల్పులు.. 10 మంది మృతి
Breaking News
సూపర్ స్టైల్
Published on Sun, 12/14/2025 - 04:29
‘‘మై డియర్ వెంకీ జన్మదిన శుభాకాంక్షలు. నువ్వెక్కడ ఉన్నా నీ చుట్టూ పాజిటివిటీ పంచుతుంటావు. ‘మన శంకర వరప్రసాద్‌గారు’ షూటింగ్‌లో మనం గడిపిన ప్రతి క్షణాన్ని నేనెంతో మధురంగా గుర్తు చేసుకుంటాను’’ అని సోషల్ మీడియా వేదికగా వెంకటేశ్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి. డిసెంబరు 13 వెంకటేశ్ బర్త్ డే.
ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి, ‘మన శంకరవరప్రసాద్‌గారు’లో ఆయన చేసిన కీ రోల్ లుక్‌ని విడుదల చేసింది యూనిట్. ఈ చిత్రంలో వెంకటేశ్ సూపర్ స్టైలిష్ క్యారెక్టర్ చేశారని లుక్ స్పష్టం చేస్తోంది. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న రిలీజ్ చేయనున్నామని శనివారం నిర్వహించిన విడుదల తేదీ ప్రకటన వేడుకలో దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు.
Tags : 1