Breaking News

సత్య నాదెళ్లకు అదో సరదా..

Published on Fri, 12/12/2025 - 16:32

ప్రపంచ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. భారతీయ-అమెరికన్‌ అయిన ఆయన మైక్రోసాఫ్ట్‌లో అంచెలంచెలుగా ఎదిగి ఆ సంస్థకు ఈసీవో అయ్యారు. అపారమైన తన శక్తి సామర్థ్యాలతో కంపెనీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు.

ప్రతి మనిషికీ వృత్తితోపాటు ఓ వ్యాపకమూ ఉంటుంది. ‘మడిసన్నాక కాసింత కళా పోషణ ఉండాల’ అంటాడు ఓ సినిమాలో విలన్‌ రావు గోపాలరావు. కానీ ఈ దిగ్గజ టెక్‌ సీఈవోది ‘క్రీడా పోషణ’. క్రీడాకారుడు కాకపోయినా క్రికెట్‌ ఆటను విశ్లేషించే మొబైల్‌ యాప్‌ ఒకదానిని సత్య నాదెళ్ల రూపొందించారు. అంతేకాదు.. కాస్త సమయం దొరికినప్పుడల్లా కోడ్‌ రాస్తుంటారాయన. అది ఆయనకో సరదా...

ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్వయంగా వెల్లడించారు. బెంగుళూరులో జరిగిన మైక్రోసాఫ్ట్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. థాంక్స్ గివింగ్ సందర్భంగా తాను చిన్నప్పటి నుండి ఇష్టపడే క్రీడ క్రికెట్ ను విశ్లేషించడానికి ఇంటి వద్ద తాను స్వయంగా డీప్ రీసెర్చ్ ఏఐ యాప్‌ను తయారు చేసినట్లు చెప్పుకొచ్చారు.

సత్య నాదెళ్ల ఈ వారం భారత్‌ వస్తున్నారు. ఇక్కడి వ్యాపార, రాజకీయ ప్రముఖులను కలుసుకోనున్నారు. మైక్రోసాఫ్ట్ ఇటీవలె భారత్‌లో రాబోయే నాలుగేళ్లలో ఏఐ, క్లౌడ్ రంగాల్లో 17.5 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది.

Videos

‘మధ్యలో ఏంటి బాసూ’ గజరాజుకు కోపం వచ్చింది

ఆరు నూరు కాదు.. నూరు ఆరు కాదు.. పెమ్మసానికి అంబటి దిమ్మతిరిగే కౌంటర్

సర్పంచ్ అభ్యర్థుల పరేషాన్

ఇకపై మంచి పాత్రలు చేస్తా

హోటల్ లో టమాటా సాస్ తింటున్నారా జాగ్రత్త!

ఘరానా మోసం.. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ.. 25 కోట్లు గోల్ మాల్

నేనింతే.. అదో టైప్.. నిజం చెప్పను.. అబద్దాలు ఆపను..

టెండర్లలో గోల్ మాల్.. కి.మీ.కు ₹180 కోట్లు !

మూసాపేట్ లో నవ వధువు ఆత్మహత్య

కోల్ కతాలో హైటెన్షన్.. స్టేడియం తుక్కు తుక్కు

Photos

+5

మెస్సీ మ్యాచ్‌.. ఫ్యాన్స్‌ జోష్‌! (ఫొటోలు)

+5

18 ఏళ్లుగా బెస్ట్ ఫ్రెండ్ 10 ఏళ్లుగా హస్బెండ్.. రోహిత్-రితిక పెళ్లిరోజు (ఫొటోలు)

+5

మ్యాచ్ ఆడ‌కుండానే వెళ్లిపోయిన మెస్సీ.. స్టేడియంలో ఫ్యాన్స్ ర‌చ్చ‌ (ఫోటోలు)

+5

రజనీకాంత్ బర్త్ డే.. వింటేజ్ జ్ఞాపకాలు షేర్ చేసిన సుమలత (ఫొటోలు)

+5

గ్లామరస్ మెరుపు తీగలా యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

చీరలో ట్రెడిషనల్‌ లుక్‌లో అనసూయ.. ఫోటోలు వైరల్‌

+5

కోల్‌కతాలో మెస్సీ మాయ‌.. (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ (ఫొటోలు)

+5

#RekhaNirosha : నటి రేఖా నిరోషా బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

ఇంద్రకీలాద్రి : రెండో రోజు దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్ష విరమణలు (ఫొటోలు)