Breaking News

ట్యాక్స్‌ అయిపోయింది.. ఇక భారీ మార్పులు వీటిలోనే..

Published on Sun, 12/07/2025 - 13:49

భారీ సంస్కరణలకు సంబంధించి తదుపరి అజెండాలో కస్టమ్స్‌ నిబంధనలను సరళతరం చేయడం ఉన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. వాటిని మరింత పారదర్శకంగా మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఇప్పటివరకు ఆదాయ పన్ను రేట్లు, వస్తు..సేవల పన్నుల (జీఎస్‌టీ) క్రమబద్ధీకరణ తదితర సంస్కరణలను అమలు చేసినట్లు ఆమె వివరించారు. ఇక కస్టమ్స్‌ డ్యూటీ రేట్లను క్రమబదీ్ధకరించడంపై దృష్టి పెట్టనున్నట్లు మంత్రి చెప్పారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో దీనిపై ప్రకటనలు ఉండొచ్చని ఆమె వివరించారు. గత రెండేళ్లుగా కస్టమ్స్‌ సుంకాన్ని తాము గణనీయంగా తగ్గించామని తెలిపారు.

అంతర్జాతీయ వాణిజ్యంలో భారత పోటీతత్వాన్ని పెంచేందుకు కస్టమ్స్‌ విధానాల్లో ఆధునీకరణ అత్యవసరమైందని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారని మంత్రి సూచించారు. సరుకుల క్లియరెన్స్‌ ప్రక్రియను వేగవంతం చేయడం, పేపర్‌లెస్‌ విధానాలను మరింత విస్తరించడం, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ను మెరుగుపరిచే చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ చర్యలతో ఎగుమతులు, దిగుమతుల సంబంధిత ఖర్చులు తగ్గి దేశీయ పరిశ్రమలకు మరింత అవకాశాలు కలుగుతాయని తెలిపారు.

అదేవిధంగా ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’లో దేశ ర్యాంకును మెరుగుపరిచేందుకు కస్టమ్స్‌ విభాగం కీలకంగా మారబోతోందని ఆమె అన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా పారదర్శకమైన, అంచనాలు స్పష్టంగా ఉండే కస్టమ్స్‌ విధానాలు ఎంతో అవసరమని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. వ్యాపార వర్గాల నుంచి వచ్చిన సూచనలను ప్రభుత్వం ఇప్పటికే పరిశీలనలోకి తీసుకుని రాబోయే బడ్జెట్‌లో వాటికి అనుగుణంగా విధానాలు ప్రకటించే అవకాశం ఉన్నదని ఆమె వెల్లడించారు.

Videos

Chintada Ravi: దేశ ప్రతిష్టను పాతాళానికి తొక్కేసాడు ఇండిగో సంక్షోభంపై రామ్మోహన్ నాయుడును ఏకిపారేసిన చింతాడ రవి

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జానియర్ ఎన్టీఆర్

Maoist Leader: మావోలకు భారీ ఎదురుదెబ్బ 3 కోట్లు రివార్డ్ ఉన్న మావోయిస్ట్ సరెండర్

ప్రజలకు వివరించి కోటి సంతకాల సేకరణ చేశాం: బొత్స సత్యనారాయణ

ఛీ.. ఛీ.. మీరు రాష్ట్రానికి పట్టిన. రామ్మోహన్ నాయుడు, లోకేష్‌పై రెచ్చిపోయిన KA పాల్

Kethireddy Pedda Reddy: అంతా మీ ఇష్టమా! తాడిపత్రి మీ అడ్డా కాదు

ఇండియాలో స్టార్ లింక్ సబ్ స్క్రిప్షన్ ధరలు ఇవే!

వెంటనే ఆపేయండి.. మెడికల్ కాలేజీల జోలికి పోవద్దు

Tadepalli : పోలీసుల ఓవర్ యాక్షన్ విద్యార్థి నేతలను లారీ ఎక్కించి..!

Machilipatnam: కూటమి నాయకుల మధ్య వాజ్‌పేయి విగ్రహం చిచ్చు

Photos

+5

చేతి వేళ్లన్నంటికీ రింగ్స్.. మృణాల్ ఠాకుర్ ఫ్యాషన్ (ఫొటోలు)

+5

సూర్య కొత్త సినిమా లాంచ్.. హీరోయిన్‌గా నజ్రియా (ఫొటోలు)

+5

అట్టహాసంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం (చిత్రాలు)

+5

Chiranjeevi : మేనేజర్ కుమార్తె బారసాల వేడుకలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు (ఫొటోలు)

+5

నేటి తరానికి స్పూర్తి.. మన 'ప్రగతి' విజయం (ఫోటోలు)

+5

హైదరాబాద్ : ఈ కాళీ మాత ఆలయాన్ని మీరు ఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

మడత మంచంపై పడుకుని ప్రకృతిని ఆస్వాదిస్తూ (ఫొటోలు)

+5

థాయ్‌ల్యాండ్ ట్రిప్‌లో 'రాజాసాబ్' బ్యూటీ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ బ్యూటీ రమ్య మోక్ష లేటేస్ట్ లుక్స్.. ఫోటోలు