యాపిల్‌ సేవలు నిలిపేస్తున్న మోడళ్లు ఇవే..

Published on Wed, 12/03/2025 - 19:15

టెక్ దిగ్గజం యాపిల్‌ సర్వీసులు అందించలేని(Obsolete) ఉత్పత్తుల జాబితాను అప్‌డేట్‌ చేసింది. ఐదు యాపిల్‌ ఉత్పత్తులకు అధికారిక హార్డ్‌వేర్ సేవలు, మరమ్మతులు నిలిపేస్తున్నట్లు తెలిపింది. కంపెనీ నిబంధనల ప్రకారం గడువు ముగిసిన నేపథ్యంలో ఈమేరకు యాపిల్‌ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అప్‌డేట్‌ చేసిన జాబితాలో కింది ఉ‍త్పత్తులు ఉన్నాయి.

  • ఐఫోన్ SE (మొదటి తరం)

  • 12.9 అంగుళాల ఐప్యాడ్ ప్రో (రెండవ తరం)

  • యాపిల్ వాచ్ సిరీస్ 4 హెర్మెస్ మోడల్స్

  • యాపిల్ వాచ్ సిరీస్ 4 నైక్ మోడల్స్

  • బీట్స్ పిల్ 2.0 పోర్టబుల్ స్పీకర్

ఏడేళ్ల గడువు పూర్తి

యాపిల్‌ అధికారిక పాలసీ ప్రకారం ఒక ఉత్పత్తి ‘ఒబ్సాలీట్’గా పరిగణించాలంటే కంపెనీ దాని అమ్మకాలను నిలిపివేసిన తర్వాత ఏడు సంవత్సరాలు పూర్తి కావాలి. ఈ ఏడేళ్ల గడువు దాటిన తర్వాత యాపిల్‌, దాని అధీకృత సర్వీస్ ప్రొవైడర్‌లు ఆ ఉత్పత్తులకు అన్ని రకాల హార్డ్‌వేర్ సేవలను పూర్తిగా నిలిపివేస్తారు. అంటే బ్యాటరీ మార్పిడి, మరమ్మతులు, విడి భాగాల లభ్యత ఉండదు. ఐఫోన్ SE (మొదటి తరం) సెప్టెంబర్ 2018లో అమ్మకాలు నిలిచిపోయాయి. దీంతో ఇది సరిగ్గా ఏడేళ్ల మార్క్‌ను దాటి ఒబ్సాలీట్ జాబితాలో చేరింది.

వినియోగదారులకు సవాలు

యాపిల్‌ ఒక ఉత్పత్తిని ముందుగా ‘వింటేజ్’ (అమ్మకాలు ఆపిన 5 ఏళ్ల తర్వాత)గా, ఆపై ఒబ్సాలీట్(7 ఏళ్ల తర్వాత)గా ప్రకటిస్తుంది. వింటేజ్ ఉత్పత్తులు రెండు సంవత్సరాల్లో ఒబ్సాలీట్‌గా మారతాయి. ఐఫోన్ SE వంటి అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ ఈ జాబితాలో చేరడం అనేది ఇప్పటికీ ఆ పరికరాన్ని వాడుతున్న చాలామంది వినియోగదారులకు సమస్యలను సృష్టించవచ్చు. అధికారిక హార్డ్‌వేర్ సేవలు లేకపోవడంతో వారు థర్డ్ పార్టీ రిపేర్ సెంటర్లను ఆశ్రయించవలసి ఉంటుంది లేదా కొత్త మోడల్‌కు అప్‌గ్రేడ్ కావాలి. ఈ నిర్ణయం యాపిల్‌ తన నూతన ఆవిష్కరణలపై దృష్టి పెట్టడానికి, పాత సాంకేతికతకు మద్దతు ఇవ్వడాన్ని తగ్గించుకోవడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది.

ఇదీ చదవండి: రాయికి రంగేసి రూ.5 వేలకు అ‍మ్మాడు.. కానీ..

Videos

హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్.. మహానటి.. డాక్టర్ సునీత

ఒక్కరోజే 270కి పైగా ఫ్లైట్స్ రద్దు.. ఎయిర్ పోర్టులలో గందరగోళం

వల్లభనేని వంశీ ఎమోషనల్ వీడియో

నువ్వు నీ డిప్ప కటింగ్.. ఒకసారి మొఖం అద్దంలో చూసుకో

5వ తేదీ వచ్చింది.. జీతాలెక్కడ బాబు?

చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం

వైద్య విద్యార్థులకు.. చంద్రబాబు వెన్నుపోటు

అఖండ 2 వాయిదా.. కారణం ఏంటంటే?

ప్రోటోకాల్ పక్కనపెట్టి పుతిన్ కి స్వయంగా స్వాగతం పలికిన మోదీ

కూటమికి YS జగన్ దబిడి దిబిడి

Photos

+5

విశాఖ చేరుకున్న భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు క్రికెట్ ఫ్యాన్‌ సందడి (ఫొటోలు)

+5

ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి..వైభవంగా కలశజ్యోతుల ఉత్సవం (ఫొటోలు)

+5

భారత్‌లో పుతిన్‌ (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో సమంత ఫ్రెండ్‌ శిల్పా రెడ్డి అందాలు (ఫోటోలు)

+5

షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తేజ సజ్జా, మీనాక్షి చౌదరి సందడి (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు (ఫోటోలు)

+5

దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణన్‌ మృతి.. ప్రముఖుల నివాళులు (ఫోటోలు)

+5

చలికాలం స్వింగ్‌లో పూజా హెగ్డే.. స్పెషల్‌ ఫోటోలు చూశారా..?

+5

'అఖండ 2 తాండవం' హీరోయిన్ సంయుక్త మీనన్ (ఫొటోలు)

+5

పిక్నిక్‌ వెళ్లిన ద ఫ్యామిలీ మ్యాన్‌ టీమ్‌! (ఫోటోలు)