Breaking News

వారి హృదయంలో హనుమ ఉంటారు: మంచు మనోజ్‌

Published on Fri, 11/28/2025 - 00:40

‘‘ఈ రోజుల్లో చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది లేదు. కంటెంట్‌ బాగుండే సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. బాగున్న ప్రతి సినిమా భాషలకు అతీతంగా ఇండియన్  సినిమా అయ్యింది. సాయం చేసే ప్రతి ఒక్కరి హృదయంలో హనుమ(ఆంజనేయస్వామి) ఉంటారు. అవినాశ్, అతని టీమ్‌ కష్టపడి చేసిన ‘వానర’ సినిమా సక్సెస్‌ కావాలి’’ అని మంచు మనోజ్‌ అన్నారు. అవినాశ్‌ తిరువీధుల హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘వానర’. సిమ్రాన్  చౌదరి హీరోయిన్ గా నటించగా, నందు విలన్ గా పాత్రపోషించారు.

శంతను పత్తి సమర్పణలో సిల్వర్‌ స్క్రీన్‌ సినిమాస్‌పై అవినాశ్‌ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధం అవుతోంది. ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన మనోజ్‌ మాట్లాడుతూ–‘‘అవినాశ్‌ ఫాదర్‌ హనుమంతరావుగారు హీరో కావాలనుకున్నారు. కానీ,పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కి వెళ్లారు. ఆయన తన కలను కొడుకు అవినాశ్‌ ద్వారా నిజం చేసుకున్నారు’’ అని చెప్పారు.

‘‘వానరుడిలాంటి హీరో బైక్‌ని రావణుడిలాంటి విలన్‌ తీసుకెళ్లిపోతే, ఆ బైక్‌ను తిరిగి తెచ్చుకునేందుకు ఎలాంటిపోరాటం చేశాడు? అన్నదే ఈ చిత్ర కథ’’ అని అవినాశ్‌ తిరువీధుల తెలిపారు. ‘‘ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు శంతను పత్తి.  డైలాగ్‌ రైటర్‌ సాయిమాధవ్‌ బుర్రా, నటులు శివాజీ రాజా, హర్ష, ఎడిటర్‌ ఛోటా కె ప్రసాద్, స్టోరీ– స్క్రీన్‌ ప్లే రైటర్‌ విశ్వజిత్, కెమెరామెన్‌ సుజాత సిద్ధార్థ్, క్రియేటివ్‌ డైరెక్టర్‌ జానకీరామ్‌ మాట్లాడారు.

Videos

మార్కెట్ కు కొత్త జోష్.. నిఫ్టీ సరికొత్త రికార్డ్

దళిత IPSలపై వివక్ష.. CID చీఫ్ కు నోటీసులు

ఒక్కరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటే.. పదేళ్ల జైలు శిక్ష..!

క్లైమాక్స్ కు కుర్చీ వార్!

అనంతపురం జిల్లాలో దారుణం.. కొడుకు గొంతుకోసి తల్లి ఆత్మహత్య..

తుఫాన్ అలర్ట్.. దూసుకొస్తున్న దిత్వా

మసిబొగ్గుల్లా భవనాలు.. మంటల్లో 300 మంది

అనుచరులతో మా ఇంటికొచ్చి..! బాధితురాలు సంచలన నిజాలు

మహిళ అని కూడా చూడకుండా చీర పట్టుకొని లాక్కెళ్లి.. కాళ్లతో తన్నుతూ..!!

దళారుల రాజ్యం! ధాన్యం కొనుగోలు గందరగోళం

Photos

+5

స్వామి అయ్యప్ప పడిపూజలో వితికా షేరు దంపతులు

+5

సింపుల్‌గా మరింత అందంగా అనసూయ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ డైరెక్టర్ (ఫొటోలు)

+5

అరుణాచలంలో జబర్దస్త్ కమెడియన్ పంచ్‌ ప్రసాద్ ప్రత్యేక పూజలు (ఫొటోలు)

+5

Rahul Sipligunj - Harinya Reddy : వైభవంగా సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ వివాహం (ఫొటోలు)

+5

దుబాయిలో చిల్ అవుతున్న అప్సరరాణి (ఫొటోలు)

+5

రాజన్న చైల్డ్‌ ఆర్టిస్ట్‌.. చీరకట్టులో ఎంత బాగుందో! (ఫోటోలు)

+5

‘ఆంధ్రా కింగ్ తాలూకా’మూవీ రిలీజ్ ట్రెండింగ్ లో భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

‘మరువ తరమా’ సినిమా ప్రీ రిలీజ్(ఫొటోలు)

+5

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రం సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)