Breaking News

డేటా సెంటర్లపై రూ. 60,000 కోట్లు 

Published on Thu, 11/27/2025 - 06:31

న్యూఢిల్లీ: దేశీయంగా డేటా సెంటర్ల ఆపరేటర్లు వచ్చే రెండేళ్ల కాలంలో భారీగా ఇన్వెస్ట్‌ చేయనున్నారు. 2026–2028 మధ్య కాలంలో రూ. 55,000–రూ. 60,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నారు. దీంతో డేటా సెంటర్ల సామర్థ్యం రెట్టింపై 2.3–2.5 గిగావాట్ల స్థాయికి చేరనుంది. క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. 

ఇటు కంపెనీలు, అటు రిటైల్‌ వినియోగదారులు భారీగా డిజిటల్‌ టెక్నాలజీలను వినియోగిస్తున్న నేపథ్యంలో 2028 ఆర్థిక సంవత్సరం నాటికి డేటా సెంటర్‌ ఆపరేటర్ల ఆదాయం వార్షికంగా 20–22 శాతం మేర వృద్ధి చెందుతుందని క్రిసిల్‌ అంచనా వేసింది. అప్పటికల్లా ఏటా రూ. 20,000 కోట్ల స్థాయికి చేరొచ్చని పేర్కొంది. ‘‘పెరుగుతున్న డిమాండ్‌కి తగ్గట్లుగా సేవలు అందించేందుకు పరిశ్రమ 2026–28 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో రూ. 55,000–65,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేసే అవకాశం ఉంది. ఈ నిధులు ప్రధానంగా రుణాల రూపంలోనే రానున్నప్పటికీ, స్థూలలాభాలు మెరుగ్గా ఉండటం వల్ల వ్యాపార పరిమాణానికి రుణ నిష్పత్తి స్థిరంగా 4.6–4.7 రెట్ల స్థాయిలో ఉంటుంది’’ అని క్రిసిల్‌ వివరించింది.  

మూడు అంశాల దన్ను.. 
డేటా సెంటర్‌ పరిశ్రమ వృద్ధికి మూడు అంశాలు దన్నుగా నిలవనున్నాయి. డిజిటల్‌ పరివర్తన, టెక్నాలజీ పురోగతిలో భాగంగా పబ్లిక్‌ క్లౌడ్‌ వినియోగాన్ని కంపెనీలు వేగంగా అందిపుచ్చుకుంటూ ఉండటం, కృత్రిమ మేథ (ఏఐ) టెక్నాలజీలపై పెట్టుబడులు పెరుగుతుండటం, 5జీ టెక్నాలజీ విస్తృత వినియోగం వీటిలో ఉంటాయి. భారత్‌లో ప్రస్తుతం డేటా సెంటర్ల సాంద్రత ప్రపంచంలోనే అత్యంత తక్కువగా ఎక్సాబైట్‌కి 65 మెగావాట్లుగా ఉందని క్రిసిల్‌ పేర్కొంది. మరోవైపు, డిమాండ్‌కి తగ్గ స్థాయిలో సేవలందించేందుకు 2028 మార్చి నాటికి పరిశ్రమ సామర్థ్యం రెట్టింపు కానుందని వివరించింది. 

Videos

అనంతపురం జిల్లాలో దారుణం.. కొడుకు గొంతుకోసి తల్లి ఆత్మహత్య..

తుఫాన్ అలర్ట్.. దూసుకొస్తున్న దిత్వా

మసిబొగ్గుల్లా భవనాలు.. మంటల్లో 300 మంది

అనుచరులతో మా ఇంటికొచ్చి..! బాధితురాలు సంచలన నిజాలు

మహిళ అని కూడా చూడకుండా చీర పట్టుకొని లాక్కెళ్లి.. కాళ్లతో తన్నుతూ..!!

దళారుల రాజ్యం! ధాన్యం కొనుగోలు గందరగోళం

నా ప్రాణాలు పోయినా.. నిన్ను మాత్రం.. కోటంరెడ్డికి నెల్లూరు మేయర్ భర్త ఛాలెంజ్

రోడ్ల మరమ్మతు పేరుతో కోట్లలో డబ్బు.. బాదుడే బాదుడు

డ్రగ్స్ ముఠాను చిత్తుచేసేందుకు ఈగల్ టీమ్ బిగ్ ప్లాన్

హాంగ్ కాంగ్ అగ్ని ప్రమాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

Photos

+5

సింపుల్‌గా మరింత అందంగా అనసూయ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ డైరెక్టర్ (ఫొటోలు)

+5

అరుణాచలంలో జబర్దస్త్ కమెడియన్ పంచ్‌ ప్రసాద్ ప్రత్యేక పూజలు (ఫొటోలు)

+5

Rahul Sipligunj - Harinya Reddy : వైభవంగా సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ వివాహం (ఫొటోలు)

+5

దుబాయిలో చిల్ అవుతున్న అప్సరరాణి (ఫొటోలు)

+5

రాజన్న చైల్డ్‌ ఆర్టిస్ట్‌.. చీరకట్టులో ఎంత బాగుందో! (ఫోటోలు)

+5

‘ఆంధ్రా కింగ్ తాలూకా’మూవీ రిలీజ్ ట్రెండింగ్ లో భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

‘మరువ తరమా’ సినిమా ప్రీ రిలీజ్(ఫొటోలు)

+5

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రం సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

హాంకాంగ్‌లో భారీ అగ్నిప్రమాదం (ఫొటోలు)