Breaking News

వందలాది ఇంజినీర్ల తొలగింపు: 2026లో మరోమారు!

Published on Sat, 11/22/2025 - 15:00

ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ 2025 అక్టోబర్ నెలలో 14,000 కంటే ఎక్కువ తొలగింపులను ప్రకటించింది. ఈ ప్రభావం క్లౌడ్ సర్వీసెస్‌, గ్రోసరీ, రిటైల్, ప్రకటనలకు సంబంధించిన విభాగాలపై మాత్రమే కాకుండా.. ఇంజినీర్ బృందాలపై కూడా పడింది.

అమెజాన్ తొలగింపులలో 1,800 మంది ఇంజినీర్లు ఉన్నారని.. న్యూయార్క్, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, వాషింగ్టన్ లేఆఫ్స్ రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఈ రాష్ట్రాల్లో మొత్తం ఉద్యోగుల తొలగింపులు 4,700 కంటే ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇందులో 40 శాతం ఇంజినీర్లే ఉన్నట్లు.. వర్కర్ అడ్జస్ట్‌మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ (WARN) ఫైలింగ్‌ల ద్వారా అమెజాన్ వెల్లడించింది. కాగా  జనవరి 2026లో కూడా మరోసారి ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని కొందరు చెబుతున్నారు.

ఇదీ చదవండి: అప్పుడు రూ.30 లక్షలు.. ఇప్పుడు లక్షల కోట్ల కంపెనీ!

కంపెనీ ఖర్చులను తగ్గించడంలో భాగంగానే.. అమెజాన్ ఈ ఉద్యోగుల తొలగింపును చేపట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగం పెరగడం వల్ల.. మరిన్ని ఉద్యోగాల కోతలకు దారితీసే అవకాశం ఉందని 2025 జూన్‌లో సంస్థ సీఈఓ ఆండీ జాస్సీ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 15.5 లక్షలు.

#

Tags : 1

Videos

పాకిస్థాన్ కు డిజిటల్ షాక్... హ్యాక్ అవుతున్న ప్రభుత్వ వెబ్ సైట్లు

Varudu: అయ్యో..ఏపీకి చివరి ర్యాంక్..! పోలీసుల పరువు తీసిన అనిత

తెలంగాణ DGP ముందు లొంగిపోనున్న మావోయిస్టు అగ్రనేతలు

జమ్మలమడుగులో ఎవరికి టికెట్ ఇచ్చినా YSRCPని గెలిపిస్తాం: సుధీర్రెడ్డి

టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డికి మాజీ మంత్రి కాకాణి సవాల్

Baba Vanga: మరి కొన్ని రోజుల్లో మరో తీవ్ర సౌర తుఫాను

మావోయిస్టు నేత హిడ్మా ఎన్ కౌంటర్ తరువాత బాడ్సె దేవాపై పోలీసుల ఫోకస్

Chittoor: ATM నగదు చోరీ కేసు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

ఏపీ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా

తెలంగాణ పంచాయతీరాజ్ జీవో విడుదల

Photos

+5

ప్రీమియర్ నైట్.. అందంగా ముస్తాబైన రాశీ ఖన్నా (ఫొటోలు)

+5

తెలుగు యాక్టర్స్ జోడీ మాలధారణ.. పుణ్యక్షేత్రాల సందర్శన (ఫొటోలు)

+5

‘3 రోజెస్’ సీజన్ 2 టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ HD మూవీ స్టిల్స్

+5

హైదరాబాద్ లో శబరిమల అయ్యప్ప ఆలయం..ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రం సక్సెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

తెలంగాణ బిడ్డగా మెప్పించిన గోదావరి అమ్మాయి (ఫోటోలు)

+5

బాలయ్య ‘అఖండ-2 ’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హైటెక్స్ లో 'తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్' చిత్రోత్సవం (ఫొటోలు)

+5

వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)