Breaking News

పెరిగిన మిడిల్‌ఈస్ట్‌ చమురు దిగుమతులు

Published on Wed, 11/19/2025 - 18:38

రష్యాకు చెందిన ప్రధాన చమురు ఉత్పత్తిదారులపై ఆంక్షలు అమలులోకి రానుండటంతో భారతదేశం చమురు దిగుమతులను పెంచుకోవడానికి మిడిల్‌ఈస్ట్‌ దేశాలపై మొగ్గు చూపుతోంది. దాంతో మధ్యప్రాచ్యం(మిడిల్‌ఈస్ట్‌) నుంచి భారత్‌కు సరుకులు తీసుకురావడానికి చమురు ట్యాంకర్ల(క్రూడాయిల్‌ సరఫరా చేసే షిప్‌లు) బుకింగ్స్ గణనీయంగా పెరిగాయి.

పెరిగిన డిమాండ్

షిప్ బ్రోకర్ నివేదికల ప్రకారం ఈ వారం ఇప్పటివరకు సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల నుంచి ముడి చమురును రవాణా చేయడానికి సుమారు డజను ట్యాంకర్లను అద్దెకు తీసుకున్నారు. ఈ ట్యాంకర్లు అరేబియా సముద్రం మీదుగా రవాణా కానున్నాయి. ఇది గత నెలలో ఇదే నమోదైన కేవలం నాలుగు బుకింగ్‌లతో పోలిస్తే పెరిగింది.

ఈ బుకింగ్‌ల్లో వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్స్ (వీఎల్‌సీసీ) అని పిలువబడే సూపర్ ట్యాంకర్లతో పాటు చిన్న సూయజ్‌మ్యాక్స్‌ నౌకలు కూడా ఉన్నాయి. భారతీయ దిగుమతిదారులు ఇంకా అదే మార్గాల్లో మరిన్ని ట్యాంకర్లను అద్దెకు తీసుకోవాలని చూస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.

నవంబర్ 21 నుంచి ఆంక్షలు

నవంబర్ 21న రోస్‌నెఫ్ట్‌ పీజేఎస్సీ(Rosneft PJSC), లుకోయిల్ పీజేఎస్సీ(Lukoil PJSC)పై ఆంక్షలు అమలులోకి రానున్న నేపథ్యంలో భారత చమురు వ్యాపారులు రష్యాయేతర ముడి చమురు కొనుగోళ్లవైపు మళ్లుతున్నారు. భారతదేశంలోని రిఫైనరీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తో సహా ఐదు ప్రధాన రిఫైనరీలు ఈ వారం తర్వాత రష్యన్ ముడి చమురు డెలివరీ చేసుకోబోమని ఇప్పటికే ప్రకటించాయి. మిగిలిన కంపెనీలు మాత్రం ఆంక్షలు లేని రష్యా చమురు విక్రేతల నుంచి కొనుగోళ్లు కొనసాగించవచ్చని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: డ్రైవర్‌ జీతం రూ.53,350.. త్వరలో రూ.1 లక్ష!

Videos

అంబేద్కర్ స్మృతివనం పట్ల నిర్లక్ష్యం బాబుపై హైకోర్టు ఆగ్రహం

జగన్ కోసం తండోపతండాలుగా జనాలు... ABN, TV5 థంబ్ నైల్స్ పై అంబటి మాస్ ర్యాగింగ్

Hyd: స్టేట్ ఏదైనా తగ్గని జగన్ క్రేజ్

జలుబు, దగ్గు, గొంతు నొప్పికి యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నారా?

Tripura: పికప్ వ్యాన్‌ను ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు

రాజమౌళి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న ధార్మిక సంఘాలు

Devabhaktuni: ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు వస్తుంటే చంద్రబాబు నిద్రపోతున్నారా..

ఎల్లో మీడియా విషపు రాతలు... ఇచ్చిపడేసిన జూపూడి

Corporator Sravan: చెరువులో దూకి కార్పొరేటర్‌ ఆత్మహత్యాయత్నం

Raja Singh: నీ లాంటి ఫాల్తూ డైరెక్టర్ ని ! జైల్లో వేసి..!!

Photos

+5

గ్రాండ్‌గా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా.. హాజరైన సినీతారలు (ఫోటోలు)

+5

భర్తతో కలిసి శ్రీలంకలో ఎంజాయ్ చేస్తోన్న అమలాపాల్ (ఫోటోలు)

+5

సిస్టర్‌ శిల్పా శిరోద్కర్ బర్త్‌డే.. చెల్లిపై నమ్రతా ప్రశంసలు (ఫోటోలు)

+5

రివాల్వర్ రీటా ప్రమోషన్స్‌లో కీర్తి సురేశ్.. (ఫోటోలు)

+5

వెకేషన్‌ ఎంజాయ్ చేస్తోన్న సాయి పల్లవి సిస్టర్స్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌కు జగన్‌.. పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

విశాఖ : కన్నుల పండుగగా అనంత పద్మనాభుని దీపోత్సవం (ఫొటోలు)

+5

నాగ‌దుర్గ‌ హీరోయిన్‌గా తొలి చిత్రం..‘కలివి వనం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు (ఫొటోలు)