Breaking News

‘వంతారా-సాంక్చురీ స్టోరీస్’ పేరుతో హాట్‌స్టార్‌లో డాక్యుమెంటరీ

Published on Mon, 11/17/2025 - 20:26

రిలయన్స్ ఫౌండేషన్ (Reliance Foundation) ఆధ్వర్యంలోని వంతారా(Vantara) జంతువుల సంరక్షణ, పునరావాస కార్యక్రమాలను హైలైట్ చేస్తూ ‘వంతారా-సాంక్చురీ స్టోరీస్’(Vantara-Sanctuary Stories) పేరుతో ఒక డాక్యుమెంటరీ సిరీస్‌ను జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

‘వంతారా-సాంక్చురీ స్టోరీస్’ సిరీస్‌లో వేటగాళ్ల బారిన పడిన, గాయపడిన లేదా నిరాదరణకు గురైన జంతువులను వంతారా బృందం ఎలా రక్షిస్తుంది అనే ఆపరేషన్లను చూపించనున్నారు. రక్షించిన జంతువులకు అందించే ప్రత్యేక వైద్య సంరక్షణ, పునరావాస ప్రక్రియను వివరిస్తారు. జంతువులను సంరక్షించే కేర్‌టేకర్లు, పశువైద్యులు వాటికి ఎలా చికిత్స అందిస్తారు, వాటి మధ్య ఏర్పడే నమ్మకం, ప్రేమ బంధాన్ని హైలైట్ చేసే అవకాశం ఉంటుంది.

వంతారాలో ఉన్న ఆధునిక వన్యప్రాణి ఆసుపత్రులు, చికిత్సలు, ఆక్యుపంక్చర్ వంటి సమగ్ర వైద్య పద్ధతులను వివరిస్తారు. జంతువులకు రక్షణ, పునరావాసం కల్పించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించాలనే వంతారా లక్ష్యాలను ఈ సిరీస్ తెలియజేస్తుందని కొందరు భావిస్తున్నారు.

వంతారా

అనంత్‌ అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్‌లు, హైపర్‌బారిక్ ఆక్సిజన్ ఛాంబర్‌తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి.

ఇదీ చదవండి: ఏటా కోటి రూపాయలు జీతం ఇస్తామన్నా చేసేవారు లేరు..

Videos

ఢిల్లీ ఉగ్రదాడి కేసులో వీడని మిస్టరీ ఆ మూడు బుల్లెట్లు ఎక్కడివి?

TS: ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు

Saudi Bus : మృతుల కుటుంబాలకు రూ .5 లక్షల చొప్పు న పరిహారం

సౌదీ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి

Kurnool: తగలబడ్డ లారీ తప్పిన పెను ప్రమాదం

BIG BREAKING : షేక్ హసీనాకు మరణశిక్ష

Sabarimala; వైఎస్ జగన్ ఫొటోతో స్వాముల యాత్ర

హిందూపురంలో వైఎస్ఆర్సీపీ ఆఫీస్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసనలు

కోర్టు ధిక్కర పిటిషన్‌పై తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

ఐ బొమ్మ వెబ్సైట్ నుంచి మెసేజ్ రిలీజ్

Photos

+5

చిన్నశేష వాహనంపై పరమ వాసుదేవుడు అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి అభ‌యం

+5

బ్లాక్ లెహంగాలో రాణిలా మిస్ ఇండియా మానికా విశ్వకర్మ..!

+5

తిరుప‌తిలో పుష్ప, శిల్పకళా ప్రదర్శన

+5

సీపీ సజ్జనార్‌ను కలిసిన టాలీవుడ్‌ ప్రముఖులు.. ఫోటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ స్టార్స్ (ఫొటోలు)

+5

రింగుల జుట్టు పోరి.. అనుపమ లేటెస్ట్ (ఫొటోలు)

+5

కుమారుడు, సతీమణితో 'కిరణ్‌ అబ్బవరం' టూర్‌ (ఫోటోలు)

+5

విజయవాడ : భవానీ ద్వీపంలో సందడే సందడి (ఫొటోలు)

+5

రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

కార్తీక మాసం చివరి సోమవారం..ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు (ఫొటోలు)