బడా క్రెడిట్ చోర్.. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్త!
Breaking News
జీసీసీల్లో 40 లక్షల కొత్త కొలువులు
Published on Sat, 11/15/2025 - 04:39
ముంబై: దేశీయంగా భారీగా ఏర్పాటవుతున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) హైరింగ్ కూడా గణనీయంగా పెరుగుతోంది. 2029–30 నాటికి కొత్తగా 28 లక్షల నుంచి 40 లక్షల వరకు ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని టీమ్‌లీజ్ ఒక నివేదికలో తెలిపింది. దీని ప్రకారం భారత్‌లో 1,800 జీసీసీలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద ఉన్న జీసీసీల్లో ఇది 55 శాతం.
2024–25 ఆర్థిక సంవత్సరంలో వీటిలో 19 లక్షల మంది ప్రొఫెషనల్స్ ఉండగా, ఎగుమతులపరంగా 64.6 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించాయి. సంఘటిత ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధికి భారత జీసీసీ వ్యవస్థ మూలస్తంభంగా ఎదుగుతోందని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో నీతి శర్మ తెలిపారు. కొత్త రిక్రూట్స్‌లో 14–22 శాతం మంది ఏఐ, క్లౌడ్, డేటా ఇంజినీరింగ్‌లాంటి డిజిటల్ నైపుణ్యాలు గల ఫ్రెషర్స్ ఉండబోతున్నారని పేర్కొన్నారు. మిగతా 76–86 శాతం మంది మధ్య స్థాయి ప్రొఫెషనల్స్ ఉంటారని వివరించారు.
కఠినతరమైన చట్టాలు..
వేగంగా విస్తరిస్తున్న జీసీసీలు కేంద్ర, రాష్ట్ర, స్థానిక స్థాయిలో ఏటా 2,000కు పైగా లీగల్ నిబంధనలను పాటించాల్సి ఉంటోంది. కారి్మక, ట్యాక్స్, పర్యావరణ చట్టాలు మొదలైనవి వీటిలో ఉంటున్నాయి. వీటికి అనుగుణంగా జీసీసీ ఆపరేటర్లు తమ కార్యకలాపాలను నిర్వహించుకోవాల్సి ఉంటుందని టీమ్‌లీజ్ రెగ్‌టెక్ సహ వ్యవస్థాపకుడు రిషి అగర్వాల్ తెలిపారు. తదుపరి విధానకర్తలు, పరిశ్రమ, విద్యారంగం ఏ విధంగా డిజిటల్ నైపుణ్యాలు గల, నిబంధనలకు అనుగుణంగా పని చేయగలిగే సిబ్బందిని తయారు చేసుకుంటాయనే దానిపైనే జీసీసీల విస్తరణ అనేది ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.
Tags : 1