బడా క్రెడిట్ చోర్.. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్త!
Breaking News
సరికొత్త లాగిన్ మెకానిజం..! పాస్‌వర్డ్‌లు గుర్తించుకోనవసరం లేదు
Published on Fri, 11/14/2025 - 11:34
పాస్‌వర్డ్‌ల మాదిరిగా కాకుండా మన ఎకౌంట్‌ను యాక్సెస్ చేయాలనుకున్న ప్రతిసారీ పాస్‌కీలను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ‘పాస్‌కీ’ అనేది సంపద్రాయ పాస్‌వర్డ్ సిస్టమ్‌కు ప్రత్యామ్నాయాన్ని అందించే కొత్త లాగిన్ మెకానిజం. పాస్‌వర్డ్ దొంగతనం, ఫిషింగ్‌లను నివారించడానికి ఫిడో అయెన్స్, డబ్ల్యూ3సీ పాస్ కీ’ని అభివృద్ధి చేశాయి.
ప్రతి వెబ్‌సైట్ లేదా యాప్‌లకు ప్రత్యేకమైన క్రిస్టోగ్రాఫిక్ కీ జత చేస్తాయి పాస్‌కీలు. ఈ పాస్‌కీలను యూజర్ డివైజ్‌లలో స్టోర్ చేస్తారు. ఫేస్‌ఐడీ, ఫింగర్‌ప్రింట్, పిన్‌లాంటి బయోమెట్రిక్ అథెంటికేషన్‌ల ద్వారా లాగిన్ కావచ్చు. సర్వర్‌తో ‘కీ’లను సింథనైజింగ్ చేయడం ద్వారా క్రిస్టోగ్రాఫిక్ సిస్టమ్ పనిచేస్తుంది.
పాస్‌వర్డ్ టైప్ చేయకుండానే లాగిన్‌లను అనుమతిస్తుంది. డివైజ్ వెలుపల డేటా షేరింగ్ కాకుండా నిరోధిస్తుంది. పాస్‌కీలు యూజర్ పాస్‌వర్డ్‌ను ఇంటర్నెట్ ద్వారా బదిలీ చేయవు. సర్వర్‌లో నిల్వ చేయవు. ఫిషింగ్ ఎటాక్స్, పాస్‌వర్డ్ దొంగతనం...మొదలైన ముప్పులను తగ్గిస్తాయి. ఆండ్రాయిడ్, క్రోమ్, మైక్రోసాఫ్ట్, వాట్సాప్, పేపాల్, అమెజాన్‌లాంటి ఎన్నో ప్రధానమైన ఫ్లాట్‌ఫామ్‌లు పాస్‌కీల ఎంపికను మొదలుపెట్టాయి. యూజర్‌లకు సంబంధించి అన్ని పరికరాల్లో పాస్‌వర్డ్–రహిత లాగిన్‌లకు వీలు కల్పిస్తాయి.
పాస్‌కీల ద్వారా యూజర్‌లు ప్రతి వెబ్‌సైట్, యాప్ కోసం వేర్వేరు పాస్‌వర్డ్‌లను సెట్ చేసుకొని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. బయోమెట్రిక్ విధానం లాగిన్‌ల వేగం, సులభతరం చేస్తుంది. భద్రత మెరుగుపడుతుంది. ‘పాస్‌కీ అనేది జటిలమైన విషయమేమీ కాదు. చాలా సులభం. ఇవి సైన్–ఇన్‌లను సులభతరం చేస్తాయి. పాస్‌వర్డ్‌ల ప్రతికూలతలు తొలగించడానికి సహాయపడతాయి’ అంటున్నాడు సాంకేతిక నిపుణుడు రెవ్.
(చదవండి: ఏఐకి.. బావోద్వేగ స్పర్శ...!)
Tags : 1