ఇఫీలో రజనీకాంత్‌కి సత్కారం

Published on Sun, 11/09/2025 - 00:01

సాధారణ బస్‌ కండక్టర్‌ నుంచి చిత్రసీమలోకి వచ్చి సూపర్‌ స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్‌కి 56వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో సత్కారం జరగనుంది. గోవా వేదికగా ఈ నెల 20న ఆరంభమయ్యే ఈ ‘ఇఫీ 2025’ వేడుక 28 వరకూ సాగుతుంది. ముగింపు రోజున రజనీకి సత్కారం జరగనుంది. 1975లో ‘అపూర్వ రాగంగళ్‌’ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమై, తొలి నాళ్లల్లో విలన్‌గా, ఆ తర్వాత హీరోగా తిరుగులేని సూపర్‌ స్టార్‌ అనిపించుకున్న రజనీ 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. చిత్రరంగానికి సుదీర్ఘ సేవలు అందించినందుకుగానూ రజనీకాంత్‌ని ఘనంగా సత్కరించాలని ‘ఇఫీ’ నిర్ణయించుకుంది.

అలాగే గత ఏడాది అక్కినేని నాగేశ్వరరావు, రాజ్‌ కపూర్, తపన్‌ సిన్హా, మొహమ్మద్‌ రఫీ వంటి లెజెండ్స్‌ శత జయంతి వేడుకలు నిర్వహించినట్లుగా ఈ ఏడాది కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది ‘ఇఫీ’. ప్రముఖ తెలుగు నటిదర్శకనిర్మాతగాయని పి. భానుమతీ రామకృష్ణ, ప్రఖ్యాత నటుడుదర్శకనిర్మాత గురుదత్, మరో ప్రముఖ దర్శకనిర్మాత రాజ్‌ ఖోస్లా, గొప్ప ఫిల్మ్‌ మేకర్‌గా పేరు తెచ్చుకున్న దర్శకరచయిత రిత్విక్‌ ఘటక్, లెజెండరీ సింగర్‌రైటర్‌మ్యూజిక్‌ డైరెక్టర్‌ భూపేన్‌ హజారికా, మరో ప్రముఖ గాయకుడురచయిత సలీల్‌ చౌదరిల శత జయంతి వేడుకలు ‘ఇఫీ 2025’లో జరగనున్నాయి. ఈ స్టార్స్‌కి సంబంధించిన ఒక్కో ‘ఐకానిక్‌ ఫిల్మ్‌’ని ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శించనున్నారు.

Videos

సాక్షి సాక్షిగా.. నాగార్జునకు ఇచ్చే వెళ్తా..!

పశువులను చంపి.. పిఠాపురంలో నకిలీ నెయ్యి కలకలం

జోగి రమేష్ త్వరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తారు

న్యాయం అడిగితే కేసులు పెడతారా ? అండగా ఉన్న అందరికీ ధన్యవాదాలు

ఏపీలో ఫ్రీ బస్సు పథకానికి మంగళం?

ఇదీ నా కాలే.. అదీ నా కాలే.. లైవ్ లో ఇచ్చిపడేసిన RGV

జల్సా టైటిల్ కరెక్ట్ గా సరిపోద్ది.. అధికారం ఏపీలో కానీ..

ప్రభుత్వ వైద్యానికి చంద్రగ్రహణం

చేపల వర్షం..ఇదేందయ్యా, ఇది!

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు

Photos

+5

చీరలో కిక్‌ ఇచ్చే ఫోజులతో బిగ్‌బాస్‌ 'అశ్విని శ్రీ ' (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : పెట్‌ షో అదరహో (ఫొటోలు)

+5

అను ఇమ్మాన్యుయేల్ 'ద గర్ల్‌ఫ్రెండ్' జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ పెళ్లిలో అనన్య సందడే సందడి (ఫొటోలు)

+5

'జగద్ధాత్రి' సీరియల్ హీరోయిన్ దీప్తి పెళ్లి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రోజా, ప్రియ (ఫోటోలు)

+5

వీకెండ్‌ స్పెషల్‌.. హైదరాబాద్‌ సమీపంలోని బెస్ట్‌ పిక్నిక్ స్పాట్‌లు (ఫొటోలు)

+5

రష్మికా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టీమిండియా టీ20 మ్యాచ్‌లో కాజల్ అగర్వాల్ సందడి (ఫొటోలు)

+5

ముద్దమందారం అంతా క్యూట్‌గా బ్రిగిడ (ఫొటోలు)