Breaking News

శివ్ నాడార్.. జాబితాలో అంబానీ కంటే ముందు: రూ.2708 కోట్లు..

Published on Thu, 11/06/2025 - 19:16

భారతదేశంలోని బిలియనీర్లు డబ్బు సంపాదించడం మాత్రమే కాదు.. దానం చేయడంలో కూడా ముందున్నారు. హురున్ ఇండియా విడుదల చేసిన జాబితా ప్రకారం.. 2025లో దేశంలోని ధనవంతులు రూ. 10,380 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు వెల్లడించింది. ఈ విరాళాలు గత ఏడాదికంటే 85 శాతం ఎక్కువ కావడం గమనార్హం.

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ & కుటుంబం.. ఏడాదిలో రూ. 2,708 కోట్ల విరాళాలు ఇచ్చి, నాల్గవసారి భారతదేశ అత్యంత ఉదారవాది అనే బిరుదును నిలుపుకున్నారు. నాడార్ రోజుకు రూ. 7.4 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. విద్య, కళలు, సంస్కృతి వంటిని ప్రోత్సహించే శివ్ నాడార్ ఫౌండేషన్ ద్వారా డబ్బును ఖర్చు చేశారు.

జాబితాలోని ఈ ఏడాది.. టాప్ 10 దాతలు సమిష్టిగా రూ. 5,834 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇది గత సంవత్సరం కంటే 26 శాతం ఎక్కువ, అంటే మొత్తం విరాళాలలో 56 శాతం అన్నమాట. జాబితాలో రెండో స్థానంలో ముకేశ్ అంబానీ & ఫ్యామిలీ ఉంది.

కుటుంబం & విరాళాలు
➤శివ్ నాడార్ & కుటుంబం: రూ. 2708 కోట్లు
➤ముకేశ్ అంబానీ & ఫ్యామిలీ: రూ. 626 కోట్లు
➤బజాజ్ ఫ్యామిలీ: రూ. 446 కోట్లు
➤కుమార్ మంగళం బిర్లా & కుటుంబం: రూ. 440 కోట్లు
➤గౌతమ్ అదానీ & ఫ్యామిలీ: రూ. 386 కోట్లు
➤నందన్ నీలేకని: రూ. 365 కోట్లు
➤హిందుజా ఫ్యామిలీ: రూ. 298 కోట్లు
➤రోహిణి నీలేకని: రూ. 204 కోట్లు
➤సుధీర్ & సమీర్ మెహతా: రూ. 189 కోట్లు
➤సైరస్ & ఆడారు పూనావాలా: రూ. 173 కోట్లు

Videos

Tirupati District: భారీ వర్షంతో పొంగిన వాగు విద్యార్థుల అష్టకష్టాలు

విద్యుత్ ఉద్యోగిపై TDP నేత రంగారెడ్డి బూతులు

Tirupati: అంధకారంలో గ్రామాలు వరదలో కొట్టుకుపోయిన పశువులు

జగన్ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు చేయాల్సిందే

KSR Live Show: క్రెడిట్ దొంగ

చంద్రబాబు గుండెల్లో బుల్లెట్ ట్రైన్లు కరకట్టపై యాంకర్ ఈశ్వర్ సంచలన నిజాలు

బీహార్ లో రికార్డు స్థాయిలో ఓటింగ్... ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేసిన సీఈసీ జ్ఞానేశ్ కుమార్

KGH: విద్యుత్ సరఫరా నిలిచిపోయి పనిచేయని వైద్య పరికరాలు

భారీ పెట్టుబడి ప్రతిపాదనకు ఆమోదం తెలప డానికి సిద్ధం

రోడ్డు ప్రమాదాల్లో ఏటా ఇన్ని లక్షల మంది చనిపోతున్నారా?

Photos

+5

చీరలో చందమామే.. అందరి చూపులు తనపైనే! (ఫోటోలు)

+5

'సంతాన ప్రాప్తిరస్తు' ట్రైలర్‌ ఈవెంట్‌లో సినీ ప్రముఖులు (ఫోటోలు)

+5

కాంత ట్రైలర్‌ లాంచ్‌.. ఒకే వేదికపై దుల్కర్‌, రానా (ఫోటోలు)

+5

ఎన్నికల వేళ అరుదైన చిత్రాలు.. బిహార్‌ ఓటర్ల ప్రత్యేక (ఫొటోలు)

+5

#KotiDeepotsavam : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విష్ణు విశాల్‌ ’ఆర్యన్‌‘ మూవీ ప్రీ రిలీజ్‌ (ఫొటోలు)

+5

ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు (ఫొటోలు)

+5

రష్మికా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన నారా రోహిత్ (ఫోటోలు)