Breaking News

ఈ ఊబర్‌ డ్రైవర్‌ కోటీశ్వరుడు

Published on Wed, 11/05/2025 - 08:44

కోటీశ్వరుడు ఉబర్‌ డ్రైవర్‌గా పనిచేస్తాడనేది ఊహకు కూడా అందదు. అయితే కొన్ని వాస్తవాలు ఊహాప్రపంచానికి కూడా అందవని చెబుతుంది ఈ వైరల్‌ వీడియో. ఇండియన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ నవ్‌ షా ఇటీవల ఫిజీకి వెళ్లాడు. ఉబర్‌లో ప్రయాణిస్తున్న షా 86 ఏళ్ల డ్రైవర్‌తో మాటలు కలిపాడు.‘ఈ వయసులో పనిచేస్తున్నారు. డబ్బులకు ఇబ్బందిగా ఉందా?’ అని అడిగాడు.ఆ డ్రైవర్‌ పెద్దగా నవ్వి... ‘అయ్యా! నేను కోటీశ్వరుడిని. గత దశాబ్ద కాలంగా ప్రతి సంవత్సరం 24 మంది అమ్మాయిలను చదివిస్తున్నాను. డ్రైవింగ్‌ ద్వారా వచ్చిన డబ్బును వారి చదువు కోసం వెచ్చిస్తున్నాను. 

నాకు ముగ్గురు ఆడపిల్లలు. బాగా చదివించాను. పేదింటి బిడ్డలు కూడా వారిలా చదువుకోవాలనుకుంటున్నాను’ అన్నాడు.అప్పుడెప్పుడో తన తండ్రి మొదలుపెట్టిన వ్యాపారాన్ని మరింతగా విస్తరించాడు ఈ పెద్దాయన. ఈయనకు 13 జువెలరీ షాప్‌లు, ఆరు రెస్టారెంట్లు, నాలుగు సూపర్‌మార్కెట్‌లు ఉన్నాయి. ఇప్పుడు వాటి బాధ్యతలు కూతుళ్లు చూస్తున్నారు.‘నిజమైన విజయం అనేది మీరు ఎంత ఎత్తుకు ఎదిగారనేదాని మీద ఆధారపడదు. ఎంతమందికి మీరు సహాయం చేశారు అనేదాని మీదే ఆధారపడి ఉంటుంది’ అనే కామెంట్‌తో వీడియో అప్‌లోడ్‌ చేశాడు నవ్‌ షా. 

#

Tags : 1

Videos

రన్నింగ్ బస్సులో మంటలు.. RTC బస్సు దగ్ధం..!

ACB రైడ్స్.. బయటపడ్డ కూటమి అవినీతి బాగోతాలు

దద్దరిల్లుతున్న పెద్ది సాంగ్ ప్రోమో.. దుమ్మురేపుతున్న రామ్ చరణ్ డాన్స్

YSRCP మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు గుండెపోటు

అజారుద్దీన్ పై కాంగ్రెస్ మహిళ నేత షాకింగ్ కామెంట్స్..

పవన్ నీ సొల్లు కబుర్లు ఆపు.. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన జడ శ్రవణ్

రాసిపెట్టుకో ఈశ్వర్.. రేవంత్ కథ అక్కడే ముగుస్తుంది

అంతుచిక్కని రహస్యం.. విశ్వంలో ఓ భారీ ఆకారం కదలిక

పులివెందులలో మెడికల్ కాలేజీ లేకుండా చేయాలి..!

అంబేద్కర్ విగ్రహంపై రెడ్ బుక్ రాజ్యాంగం

Photos

+5

#KotiDeepotsavam : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విష్ణు విశాల్‌ ’ఆర్యన్‌‘ మూవీ ప్రీ రిలీజ్‌ (ఫొటోలు)

+5

ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు (ఫొటోలు)

+5

రష్మికా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన నారా రోహిత్ (ఫోటోలు)

+5

తిరుమలలో బుల్లితెర నటుడు ప్రభాకర్‌ (ఫోటోలు)

+5

వేయి స్తంభాల దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు (ఫోటోలు)

+5

జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు.. సింగర్‌ ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

గ్రీన్ లెహంగాలో మెరిసిపోతున్న అత్తారింటికి దారేది హీరోయిన్ ప్రణీత.. ఫోటోలు