భవిష్ అగర్వాల్ ట్వీట్: కునాల్ కమ్రా రిప్లై

Published on Mon, 10/27/2025 - 21:14

ఒక్క షోరూమ్ లేకుండానే.. భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయం ప్రారంభించిన దేశీయ ఎలక్ట్రిక్ టూవీలర్ దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాల్లో గణనీయమైన పురోగతిని సాధించింది. ఆ తరువాత షోరూమ్స్ ప్రారంభించింది. ఇప్పుడు విక్రయానంతర సేవలను సైతం మొదలుపెట్టింది.

ఓలా ఎలక్ట్రిక్ తన సర్వీస్ నెట్‌వర్క్‌ను ఓపెన్‌ ప్లాట్‌ఫామ్‌గా మార్చింది. అంటే ఇప్పుడు విడిభాగాలు ఎవరైనా కొనుగోలు చేసుకోవచ్చన్నమాట. ఈ విషయాన్ని సీఈఓ భవిష్ అగర్వాల్ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు.

''ఈరోజు నుండి, ఓలా ఎలక్ట్రిక్ విడిభాగాలు మా యాప్ & వెబ్‌సైట్‌లో బహిరంగంగా అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఓలా కస్టమర్ ఇప్పుడు విడిభాగాలను నేరుగా కొనుగోలు చేయవచ్చు. మీరు ఏ మెకానిక్ దగ్గర అయినా వీటిని ఫిట్ చేసుకోవచ్చు'' అని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: రూ. 299తో 35జీబీ డేటా: ఉచితంగా జియోఫై డివైజ్

భవిష్ అగర్వాల్ ట్వీట్‌పై 'కునాల్ కమ్రా' స్పందించారు. ''మీరు ప్రజలను.. విడిభాగాలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి, ఏదైనా మెకానిక్ వద్దకు వెళ్లమని చెబుతున్నారా. సంవత్సరాలుగా కస్టమర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఇప్పుడు పరిష్కారం వచ్చింది. ఈ సందర్బంగా.. ఒక క్షమాపణ లేదు, అసౌకర్యానికి క్షమించండి అని కూడా చెప్పలేదు. ఇలాంటివి కేవలం భారతదేశంలో మాత్రమే జరుగుతుంది'' అని అన్నారు.

Videos

రైతులను నిండా ముంచిన మోంథా తుఫాన్

శాంతించిన మోంథా.. APకి తప్పిన పెను ప్రమాదం

వంశీ గురించి సక్సెస్ మీట్ లో మాట్లాడతా.. ఒక్కొక్కడి తాట తీస్తా

ఈ రాత్రికే భారీ వర్షం.. తెలంగాణలో ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్

తీరం దాటినా తగ్గని ప్రభావం.. మరో 48గంటలపాటు..

ఆ జిల్లాలకు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

మమ్మల్నెవరూ పట్టించుకోవటం లేదు.. విజయవాడలో మహిళ ఆవేదన

సీఎం, డీసీఎం లేకపోయినా అధికారుల పనితీరుకు హ్యాట్సాఫ్

మోంథా ముప్పు.. అధికారుల అప్రమత్తంతో తప్పిన పెను ప్రమాదం

Viral Video: దటీజ్ కోబ్రా.. దాని పౌరుషం చూస్తే.. గుండె గుభేల్

Photos

+5

'మాస్ జాతర' ప్రీ రిలీజ్.. శ్రీలీల క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

కురుమూర్తి జాతర : అంగరంగ వైభవంగా ఉద్దాల ఉత్సవం (ఫొటోలు)

+5

ఒంగోలులో ఈదురుగాలులతో కూడిన వర్షం..రోడ్లు జలమయం (ఫొటోలు)

+5

తెలంగాణ సీఎంకు సినీ కార్మికుల సన్మానం (చిత్రాలు)

+5

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రవితేజ ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

క్రికెటర్ చాహల్ రూమర్ గర్ల్‌ఫ్రెండ్ బర్త్ డే (ఫొటోలు)

+5

Cyclone Montha: మోంథా బీభత్సం.. (ఫొటోలు)

+5

నిషా అగర్వాల్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

హీరో నాని 13 ఏళ్ల బంధం.. లవ్‌లీ ఫొటోలు