ఐఆర్ఈఈ 2025లో వందే భారత్ స్లీపర్ కోచ్‌ ప్రదర్శన

Published on Tue, 10/14/2025 - 14:27

భారతీయ రైల్వేల ఆధునికీకరణ నేపథ్యంలో త్వరలో ప్రారంభించబోయే వందే భారత్ ఎయిర్ కండిషన్డ్ స్లీపర్ బోగీలు ప్రముఖ ఎగ్జిబిషన్‌లో దర్శనమివ్వనున్నాయి. అక్టోబర్ 15న ఢిల్లీలో ప్రారంభం కానున్న ఇండియన్ రైల్వే ఎక్విప్‌మెంట్‌ ఎగ్జిబిషన్ (ఐఆర్ఈఈ) 2025లో ఈ ఏసీ స్లీపర్‌ కోచ్‌ను ప్రదర్శించనున్నారు.

సుదూర, మధ్యస్థ ప్రయాణాలకు విమానం లాంటి సౌకర్యాన్ని అందించే లక్ష్యంతో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రైళ్లను ఆటోమేటిక్ డోర్లు, వైఫై సదుపాయం, విమానం (ఎయిర్ క్రాఫ్ట్)లాంటి డిజైనింగ్‌లో రూపొందించారు.

ఆసియాలోనే అతిపెద్ద రైల్వే ఈవెంట్

భారతీయ రైల్వేల సహకారంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) నిర్వహిస్తున్న ఐఆర్ఈఈ 2025 ఆసియాలోనే అతిపెద్ద రైల్వే ఎగ్జిబిషన్‌గా గుర్తింపు పొందింది. కాగా రైల్వేలు, రవాణా రంగంలో ప్రపంచంలోనే ఇది రెండో అతిపెద్ద ఈవెంట్.

ఇతర కోచ్‌ల ప్రదర్శన

ఐఆర్ఈఈ 2025లో వందే భారత్ స్లీపర్ కోచ్‌లతో పాటు చైర్ కార్ కోచ్‌లు, అమృత్ భారత్ కోచ్‌లు, తేజస్ భారత్, హమ్‌సఫర్‌ కోచ్‌లు, నమో భారత్ రైళ్లు, మెయిన్‌లైన్‌ కోచ్‌లు కూడా ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని ఇండియన్ రైల్వే బోర్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ ధ్రువీకరించారు.

ఇదీ చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవలకు టీసీఎస్ సన్నద్ధం

Videos

జోగి రమేషే ఎందుకు? అనలిస్ట్ పాషా సంచలన నిజాలు

బెడిసికొట్టిన ప్లాన్.. అడ్డంగా దొరికిన తర్వాత రూట్ మార్చిన టీడీపీ పెద్దలు

TDPకి ఓటువేయొద్దు.. నాశనమైపోతారు

సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం

బాబు, పోలీసులపై కోర్టు సీరియస్

Big Question: బెడిసి కొట్టిన పిట్టకథ..

పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి మద్యం దుకాణాలు నడుపుతున్నారు: వైఎస్ జగన్

టీడీపీ జనార్దన్ రావు వీడియోపై కేతిరెడ్డి సంచలన నిజాలు..

పవన్ ప్రశ్నలు బాబు కవరింగ్

నీ వల్ల రాష్ట్రానికి ఒక్క ఉపయోగం లేదు బాబుని ఏకిపారేసిన రాచమల్లు..

Photos

+5

‘తెలుసు కదా’ సినిమా ప్రెస్‌ మీట్‌లో సిద్ధు జొన్నలగడ్డ (ఫొటోలు)

+5

ట్రెడిషనల్‌ శారీ లుక్‌లో ‘కూలి​’ బ్యూటీ..

+5

సారా టెండుల్కర్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

స్విట్జర్లాండ్‌ ట్రిప్‌లో 'కాంతార' బ్యూటీ (ఫొటోలు)

+5

కాంతార ‘కనకావతి’ శారీ లుక్‌ అదరహో! (ఫొటోలు)

+5

'థామ' ప్రమోషన్స్‌లో రష్మిక, మలైకా అరోరా స్టెప్పులు (ఫోటోలు)

+5

చాలారోజుల తర్వాత 'విష్ణు ప్రియ' గ్లామ్‌ షూట్‌ (ఫోటోలు)

+5

‘మిత్రమండలి’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)