ఎందుకు మీకు అంత భయం.. విడుదల రజినిని ఆపేసిన పోలీసులు
Breaking News
స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో బతుకమ్మ వేడుకల సన్నాహాలు జోరుగా
Published on Fri, 09/19/2025 - 12:01
స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో ఉన్న మదర్ ఎర్త్ హిందూ టెంపుల్‌లో ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టెంపుల్ అధ్యక్షుడు డాక్టర్ పునీత్ బెడి, ఉపాధ్యక్షురాలు మమతా వూసికల, కార్యదర్శి వినీలా బత్తుల సమర్థవంతంగా ఈ కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో పలు సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలు, మాతృశక్తిని ఆరాధించే విశిష్ట పూజలు నిర్వహించనున్నారు. అంతేకాక, తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను కూడా ఆలయంలో ఘనంగా నిర్వహించేందుకు సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

బతుకమ్మ మరియు నవరాత్రులు మిలితంగా జరుపుకోవడం అనేది అక్కడి భారతీయ సమాజానికి విశేషమైన ఆనందాన్ని అందిస్తోంది. సామూహికంగా జరుపుకునే ఈ పండుగలు, భారతీయ సాంస్కృతిక విలువలను కొత్త తరానికి పరిచయం చేస్తున్నాయి.అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలను ఎదురుచూస్తున్నారు.

Tags : 1