Breaking News

‘బ్యూటీ’ మూవీ రివ్యూ

Published on Fri, 09/19/2025 - 10:49

టైటిల్‌ : బ్యూటీ
నటీనటులు: అంకిత్‌ కొయ్య, నీలఖి, నరేశ్‌ వీకే, వాసుకి,తదితరులు
నిర్మాణ సంస్థలు:ఏ మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో 
నిర్మాతలు : విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమూర్ భన్సల్
కథ, స్క్రీన్ ప్లే:  ఆర్.వి. సుబ్రహ్మణ్యం
దర్శకత్వం: జె.ఎస్.ఎస్. వర్దన్
సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌
విడుదల తేది: సెప్టెంబర్‌ 19, 2025

యూత్‌ని టార్గెట్‌ చేస్తూ వచ్చిన ‘లిటిల్‌ హార్ట్స్‌’ ఇప్పుడు బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తుంది. సినిమా విడుదలై రెండు వారాలు గడిచినా.. ఇప్పటికీ ఆ సినిమా కోసం ప్రేక్షకులు థియేటర్స్‌కి వెళ్తున్నారు. అదే జోష్‌లో వచ్చిన మరో యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ చిత్రం ‘బ్యూటీ’. ట్రైలర్‌ రిలీజ్‌ తర్వాత ఈ సినిమాపై బజ్‌ క్రియేట్‌ అయింది. మరో‘బేబీ’ చిత్రం అవుతుందని మేకర్స్‌ నమ్మకంగా చెప్పడంతో ‘బ్యూటీ’పై ఓ మోస్తరు అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలు ఈ చిన్న చిత్రం అందుకుందా? యూత్‌ని టార్గెట్‌ చేస్తూ వచ్చిన ఈ చిత్రం వారిని ఆకట్టుకుందా లేదా? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. 
వైజాగ్‌లో కాలేజీ చదువుతున్న అలేఖ్య(నీలఖి)ది మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ. నాన్న నారాయణ (వీకే నరేశ్‌) క్యాబ్‌ డ్రైవర్‌. అమ్మ (వాసుకి) హౌస్‌వైఫ్‌. తోటి స్నేహితులంతా స్కూటీపై కాలేజీకి వెళ్తుండంతో అలేఖ్య మనసు స్కూటీపై పడుతుంది. తనతో ఎంతో క్లోజ్‌గా ఉండే నాన్న నారాయణ ముందు తన స్కూటీ కోరికను బయటపెడుతుంది. డ్రైవింగ్‌ నేర్చుకున్నాక చూద్దాంలే అని నాన్న అంటారు. అదే సమయంలో అలేఖ్యకు పరిచయం అవుతాడు అర్జున్‌(అంకిత్‌ కొయ్య). డ్రైవింగ్‌ నేర్పిస్తానంటూ స్నేహం చేస్తాడు. ఈ క్రమంలో ఈ పెట్‌ ట్రైనర్‌తో ప్రేమలో పడుతుంది అలేఖ్య. 

ఓ రోజు ఇంట్లో అర్జున్‌తో రొమాంటిక్‌ వీడియో కాల్‌ మాట్లాడుతుండగా.. అమ్మ చూస్తుంది. ఆ భయంతో ఇంట్లో నుంచి పారిపోతుంది అలేఖ్య. అర్జున్‌ దగ్గరకు వచ్చి ‘నన్ను తీసుకెళ్లిపో’ అని చెబుతుంది. ఇద్దరు కలిసి హైదరాబాద్‌కి వెళ్తారు. కూతురుని వెతుకుతూ నారాయణ కూడా హైదరాబాద్‌ వస్తాడు. మరి నారాయణకు కూతురు దొరికిందా? అమ్మ చంపేస్తుందన్న భయంతో అర్జున్‌తో వచ్చిన అలేఖ్యకు హైదరాబాద్‌లో ఎదురైన కష్టాలేంటి? అర్జున్‌-అలేఖ్యలు పోలీసు స్టేషన్‌కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వీరిద్దరిని ఫాలో అవుతూ హైదరాబాద్‌ వరకు వచ్చిన మూడో వ్యక్తి ఎవరు?  అతనితో అర్జున్‌కి ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే.. 
‘ప్రపంచం మొత్తం నీపై పగ పట్టినా.. నీకోసం ప్రాణం పెట్టి పోరాడేవాడు ఒకడుంటాడు. అతను కచ్చితంగా నాన్న అయ్యి ఉంటాడు. ప్రపంచంలో నాన్నను మించి యోధుడు లేడు’ అని సందేశం ఇచ్చిన ఓ యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ ఇది. తెలిసి తెలియని వయసులో చేసే తప్పులు తల్లిదండ్రులను ఎంతటి క్షోభకు గురి చేస్తాయి? ప్రేమగా చూసుకునే పెరెంట్స్‌ని కాదని.. ‘ప్రేమ అంటే ఇదే’ అనుకొని ఇంట్లో నుంచి పారిపోయే అమ్మాయిలకు ఎలాంటి కష్టాలు ఎదురవుతాయని అనేది ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇది అందరికి తెలిసిన కథే. నిత్యం టీవీల్లో, పేపర్లలో చూస్తున్న వార్తే. 

యథార్థ సంఘటనల ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కించారు.  ఫస్టాఫ్‌ మొత్తం మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ కష్టాలు.. తండ్రి-కూతురు బాండింగ్‌తో పాటు రొమాంటిక్‌ లవ్‌ ట్రాక్‌ని చూపించి.. సెకండాఫ్‌లో వాటిలోని గ్రే షేడ్స్‌ని చూపించారు. కథగా చూస్తే ఇది రొటీనే కానీ.. స్క్రీన్‌ప్లే మాత్రం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా  పిల్లలపై పెరెంట్స్‌కి ఎంత ప్రేమ ఉంటుందో తెలియజేసే సన్నివేశాలను అద్భుతంగా మలిచారు.  

ఇంట్లో ప్రియుడితో రొమాంటిక్‌ వీడియో కాల్‌ మాట్లాడుతుండగా.. సడెన్‌గా అమ్మ చూడడం.. పారిపోయే క్రమంలో నాన్న క్యాబ్‌ ఎక్కడం.. లాడ్జ్‌లో, గదిలో ప్రియుడితో చేసే రొమాన్స్‌ ఒకవైపు.. చిన్నప్పుడు స్నానం చేయించి నాన్న దుస్తులు వేయించే సన్నివేశం మరోవైపు.. ఇవన్నీ  తెరపై చూస్తుంటే గుండె బరువెక్కడం ఖాయం.  

ప్రీ ఇంటర్వెల్‌ వరకు కథనం ఒకలా సాగితే.. ఆ తర్వాత మరోలా సాగుతుంది. ఫస్టాఫ్‌ కథ మొత్తం.. బేబీ, కొత్త బంగారులోకం..తదితర సినిమాల్లాగా సాగితే.. సెకండాఫ్‌ కథ.. ఆ మధ్య వచ్చిన ‘బుట్టబొమ్మ’ సినిమాను గుర్తు చేస్తుంది. ట్విస్ట్‌ తెలిసిన తర్వాత కథనం ఆసక్తికరంగా సాగదు. క్లైమాక్స్‌ కూడా రొటీన్‌గానే ఉంటుంది. అయితే సెకండాఫ్‌లో వచ్చే కొన్ని ఎమోషనల్‌ సీన్లు మాత్రం ఆకట్టుకుంటాయి.  

ఇక ఈ సినిమాలో మైనస్‌ పాయింట్స్‌ విషయానికొస్తే..  అర్జున్‌-అలేఖ్యల లవ్‌స్టోరీ వాస్తవికానికి దూరంగా అనిపిస్తుంది. వీడియో కాల్‌ సీన్‌ కూడా అంతే.. దానికి బలమైన కారణాన్ని తెరపై చూపించలేకపోయారు.  వీరిని ఫాలో అవుతున్న మూడో వ్యక్తికి సంబంధించిన సీన్లలో కూడా లాజిక్‌ మిస్‌ అవుతుంది. ఇక హీరోలో ఉన్న మరో కోణాన్ని కూడా పూర్తి కన్విన్సింగ్‌గా చూపించలేకపోయారు. నాన్నను మించి యోధుడు లేడు అని చెప్పేందుకు  క్లైమాక్స్‌లో మరిన్ని బలమైన సీన్లను పెట్టి ఉంటే బాగుండేదేమో. ఇవన్నీ పక్కన పెడితే.. కాలేజీ చదువుతున్న అమ్మాయిలతో పాటు వారి పెరెంట్స్‌ కూడా చూడాల్సిన సినిమా ఇది. అటు పిల్లలకు, ఇటు పెరెంట్స్‌కి ఓ మంచి సందేశం ఇచ్చారు. 

ఎవరెలా చేశారంటే.. 
ఈ సినిమాను నిలబెట్టిన పాత్ర నీలఖిది అనే చెప్పాలి. కాలేజీ చదువుతున్న అలేఖ్య పాత్రలో ఆమె జీవించేసింది.  దర్శకుడు ఆమె పాత్రని తీర్చిదిద్దిన విధానం ఎంత గొప్పగా ఉందో.. నీలఖి కూడా అంతే గొప్పగా నటించింది.  ఇంటర్‌ చదువుతున్న అమ్మాయిలకి ఆమె పాత్ర బాగా కనెక్ట్‌ అవ్వడమే కాదు..వారికొక హెచ్చరికను కూడా ఇస్తుంది.  అర్జున్‌గా అంకిత్‌ కొయ్య బాగా నటించాడు. ఇక మిడిల్‌ క్లాస్‌ ఫాదర్‌గా నరేశ్‌ వీకే మరోసారి తెరపై తన అనుభాన్ని చూపించాడు. కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన హృదయాలను కలిచివేస్తుంది. హీరోయిన్‌ తల్లిగా వాసుకి తనదైన సహజ నటనతో ఆకట్టుకుంది. సోనియా, నందగోపాల్‌, మురళీధర్‌ గౌడ్‌, ప్రసాద్‌ బెహరతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. 

ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం. పాటలు బాగున్నాయి. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. శ్రీ సాయికుమార్‌ దారా కెమెరా వర్క్ బాగుంది. ఎస్‌ బీ ఉద్దవ్‌ ఎడిటింగ్‌ పర్వాలేదు. సెకండాఫ్‌ని మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Videos

ఎందుకు మీకు అంత భయం.. విడుదల రజినిని ఆపేసిన పోలీసులు

రూ.6 వేల కోట్లు ఇవ్వడానికి చేతులు పడిపోయినాయా బాబూ..

నాగ్ 100 కోసం భారీ స్కెచ్.. కానీ

Jr Ntr: 7 వారాల్లో... 10 కిలోల బరువు తగ్గిన టైగర్

కుమ్మేస్తున్న రామ్ చరణ్! మెగా ఫ్యాన్స్ కు పూనకాలే

పోలీసుల ఓవరాక్షన్.. YSRCP నేతల ఉగ్రరూపం.. మచిలీపట్నంలో హైటెన్షన్!

తన బినామీలకు దోచిపెట్టడానికే బాబు కుట్రలు

చలో మెడికల్ కాలేజీ నిరసనలో... దద్దరిల్లిన మచిలీపట్నం

ఎవరి సొమ్ము.. ఎవరి సొత్తు.. బాబును రఫ్ఫాడించిన పేర్ని కిట్టు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై YARCP ఎమ్మెల్సీ ల నిరసన

Photos

+5

కదం తొక్కిన వైఎస్సార్‌సీపీ.. మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌పై ఉవ్వెత్తున ఉద్య‌మం (చిత్రాలు)

+5

విజయవాడ : కనులపండువగా దసరా సాంస్కృతిక ఉత్సవాలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఉదయం ఉక్కపోత..సాయంత్రం కుండపోత వర్షం (ఫొటోలు)

+5

హైదరాబాద్ రోడ్డుపై అడవి జంతువులు..అవునా.. నిజమా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ట్రాఫిక్‌ సమ్మిట్‌–2025..ముఖ్య అతిథిగా సాయి ధరమ్ తేజ్ (ఫొటోలు)

+5

కోర్ట్‌ జంట రిపీట్‌.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)

+5

ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

బ్యూటీఫుల్ శారీలో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర (ఫోటోలు)

+5

దివినుంచి దిగి వచ్చిన తారలా ‘పరదా’ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)