ఎందుకు మీకు అంత భయం.. విడుదల రజినిని ఆపేసిన పోలీసులు
Breaking News
దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం: ఉద్యోగులకు రూ.31000 పెంపు!
Published on Fri, 09/19/2025 - 07:05
భారతదేశంలోని అతిపెద్ద వాహన తయారీదారులలో ఒకటైన 'హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్'.. ఉద్యోగులకు వేతనాల పెంపుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. దీంతో ఉద్యోగుల జీతం రూ. 31వేలు వరకు పెరగనుంది. దీనికి సంబంధించిన ఒప్పందాన్ని యునైటెడ్ యూనియన్ ఆఫ్ హ్యుందాయ్ ఎంప్లాయీస్‌తో కుదుర్చుకుంది. ఇది మూడేళ్లు అమలులో ఉంటుంది.
హ్యుందాయ్ వేతనాల పెంపు మూడేళ్లు (2024-2027) దశలవారీగా అమలు చేయనున్నారు. మొదటి ఏడాది వేతనం 55 శాతం పెరుగుతుంది. రెండో సంవత్సరం 25 శాతం, మూడో ఏడాది 20 శాతం మేర జీతం పెరుగుతుంది. ఇలా మొత్తం మీద మూడేళ్లలో రూ. 31000 పెరుగుతుంది. వేతనాలు మాత్రమే కాకుండా.. కంపెనీ కొన్ని బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ఇందులో ఇన్సెంటివ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటివి కూడా ఉన్నాయి.
ఇదీ చదవండి: మళ్లీ తెరపైకి పని గంటల వివాదం: నెటిజన్లు ఫైర్!
కంపెనీ విజయానికి.. ఉద్యోగులే కారణం. సంస్థ, ఉద్యోగుల మధ్య విశ్వాసం, కమ్యూనికేషన్ ద్వారానే ప్రస్తుతం జీతాల పెరుగులకు సంబంధించిన ఒప్పందం సాధ్యమైంది. ఉద్యోగుల సంక్షేమం మా బాధ్యత అని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ పీపుల్ స్ట్రాటజీ ఫంక్షన్ హెడ్ 'యంగ్‌మ్యుంగ్ పార్క్' పేర్కొన్నారు.
Tags : 1