17 మెడికల్ కాలేజీల వద్ద నేడు YSRCP పోరుబాట
Breaking News
కొత్త జీఎస్టీ శ్లాబులను నోటిఫై చేసిన సీబీఐసీ
Published on Thu, 09/18/2025 - 14:49
జీఎస్టీ శ్లాబుల సవరణకు ఆమోదించిన కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) జీఎస్టీ రేటు నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చే సవరించిన రేట్ల నిర్మాణం ఏడు షెడ్యూళ్లలో సుమారు 1,200 వస్తువులపై ప్రభావం చూపుతుందని తెలిపింది.
సీబీఐసీ నోటిఫికేషన్‌లోని ముఖ్యమైన మార్పుల్లో బాల్‌పాయింట్ పెన్నులు, స్కూల్ బ్యాగులు, ముద్రించిన పుస్తకాలు, మార్కర్లు, ఫౌంటెన్ పెన్నులు, స్టైలోగ్రాఫ్ పెన్నులు వంటి రోజువారీ ఎడ్యుకేషన్ నిత్యావసరాలు 18% జీఎస్టీ శ్లాబ్ కింద ఉంచారు. ఇది కొంతమంది పరిశ్రమ వర్గాల్లో ఆందోళనను రేకెత్తించింది. దీనికి విరుద్ధంగా పెన్సిల్స్, క్రేయాన్లు, పాస్టెల్స్, డ్రాయింగ్ చాక్స్, టైలర్ చాక్స్‌ను జీఎస్టీ నుంచి మినహాయించారు. ఇవి గతంలో 12% శ్లాబులో ఉండేవి.
‘జీఎస్టీ హేతుబద్ధీకరణ విద్యార్థులపై భారాన్ని తగ్గించేందుకు, ప్రాథమిక విద్యా సాధనాలను ప్రోత్సహించడంపై దృష్టి సారించింది’ అని ఒక ట్యాక్స్ ఎక్స్‌పర్ట్ అన్నారు.
సీబీఐసీ నోటిఫికేషన్ కింది వస్తువులను 18% జీఎస్టీ రేటు కింద వర్గీకరించింది.
స్కూలు బ్యాగులు
ట్రంక్‌లు, సూట్ కేసులు, వ్యానిటీ కేసులు, ఎగ్జిక్యూటివ్, బ్రీఫ్ కేసులు
స్పెక్టాకిల్ కేసులు, బైనాక్యులర్, కెమెరా కేసులు
ట్రావెల్ బ్యాగులు, కంటైనర్లు
ఎక్సర్‌సైజ్ పుస్తకాలు, గ్రాఫ్ పుస్తకాలు, ల్యాబ్ నోట్‌బుక్‌లు, సారూప్య వస్తువులపై స్పష్టంగా జీఎస్టీ నుంచి మినహాయింపు లభించింది.
ఇదీ చదవండి: కేంద్ర బ్యాంకులకు బంగారు నిల్వలు ఎందుకు?
Tags : 1