భారీగా పెరిగిన బంగారం అమ్మకాలు..

Published on Thu, 09/18/2025 - 14:16

న్యూఢిల్లీ: జీవిత కాల గరిష్ట స్థాయిల వద్ద పసిడి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నది. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.1,800 పెరిగి మంగళవారం కొత్త గరిష్ట స్థాయి రూ.1,15,100 స్థాయికి చేరుకోగా.. బుధవారం రూ.1,300 నష్టపోయి రూ.1,13,800కు పరిమితమైంది. ధరలు తగ్గుముఖం పట్టడంతో.. సేల్స్ పెరిగాయి.

‘‘యూఎస్‌ ఫెడ్‌ పాలసీ సమావేశానికి ముందు లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు మెగ్గు చూపించడంతో బంగారం బలహీనంగా ట్రేడయ్యింది. కీలకమైన సమావేశానికి ముందు ఇన్వెస్టర్లు రిస్క్ తగ్గించుకున్నారు. కేవలం ఫెడ్‌ రేట్ల కోతపైనే కాకుండా, తదుపరి రేట్ల సవరణ దిశగా ప్రకటించే అంచనాల కోసం మార్కెట్లు వేచి చూస్తున్నాయి.

ఇదీ చదవండి: కొంటే ఇప్పుడు కొనండి!.. తగ్గిన గోల్డ్ రేటు

తటస్థ విధానం లేదా తదుపరి రేట్ల కోతకు సంబంధించి స్పష్టమైన కార్యాచరణ లోపిస్తే బంగారం ధరలు ఇక్కడి నుంచి కొంత శాతం తగ్గొచ్చు’’అని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ కమోడిటీ సీనియర్‌ అనలిస్ట్‌ జతిన్‌ త్రివేది తెలిపారు. మరోవైపు వెండి సైతం అమ్మకాల ఒత్తిడితో కిలోకి రూ.1,670 నష్టపోయి రూ.1,31,200 స్థాయికి దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్‌ గోల్డ్‌ ఔన్స్‌కు ఒక శాతం తగ్గి 3,665 డాలర్ల వద్ద, కామెక్స్‌ ఫ్యూచర్స్‌లో పావు శాతం తగ్గి 3,717 డాలర్ల వద్ద ట్రేడయ్యింది.

Videos

సాక్షి రిపోర్టర్ పై పోలీసుల దౌర్జన్యం

మెడికల్ కాలేజీలు పేదల కోసం.. బినామీలకు ఇస్తానంటే ఊరుకోము

Watch Live: ఛలో మెడికల్ కాలేజ్

ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెళ్లి తీరుతా.. బైరెడ్డి మాస్ వార్నింగ్

17 మెడికల్ కాలేజీల వద్ద నేడు YSRCP పోరుబాట

అమెరికాలో తెలంగాణ వాసి మృతి

మహేష్ తో ప్రభాస్ డైరెక్టర్.. స్క్రీన్స్ బ్లాస్ట్ పక్కా

మీలాంటి దుష్ట శక్తులనుండి ప్రజలను కాపాడాలని ఆ అప్పన్న స్వామిని వేడుకుంటున్నా

గుర్తుపెట్టుకో.. మేమే నిన్ను గెలిపించాం.. మేమే వచ్చే ఎన్నికల్లో నిన్ను ఓడిస్తాం

అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కాయి.. అనితను రఫ్ఫాడించిన నాగ మల్లీశ్వరి

Photos

+5

విజయవాడ : కనులపండువగా దసరా సాంస్కృతిక ఉత్సవాలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఉదయం ఉక్కపోత..సాయంత్రం కుండపోత వర్షం (ఫొటోలు)

+5

హైదరాబాద్ రోడ్డుపై అడవి జంతువులు..అవునా.. నిజమా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ట్రాఫిక్‌ సమ్మిట్‌–2025..ముఖ్య అతిథిగా సాయి ధరమ్ తేజ్ (ఫొటోలు)

+5

కోర్ట్‌ జంట రిపీట్‌.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)

+5

ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

బ్యూటీఫుల్ శారీలో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర (ఫోటోలు)

+5

దివినుంచి దిగి వచ్చిన తారలా ‘పరదా’ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ మీట్..ముఖ్య అతిథిగా సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)