Breaking News

బీటౌన్‌ ఈవెంట్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నీతా అంబానీ

Published on Thu, 09/18/2025 - 13:05

బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్(Shah Rukh Khan)  కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు.  తన తొలి ప్రాజెక్ట్‌గా "The Bads of Bollywood" అనే సాటిరికల్ యాక్షన్ డ్రామా (సెప్టెంబర్ 18) నుంచి  స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా నిర్వహించిన  స్టార్-స్టడెడ్ స్క్రీనింగ్ ఈవెంట్‌లో అనేక మంది ప్రముఖులు సందడి చేశారు. ముఖ్యంగా ఫ్యాషన్‌ ఐకాన్‌, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్‌ అంబానీ భార్య  నీతా అంబానీ (Nita Ambani) అందరి దృష్టిని ఆకర్షించారు.  తన స్టైలిష్ లుక్‌తో  స్పెషల్‌  ఎట్రాక్షన్‌గా నిలిచారు.

ఈవెంట్‌కి తగినట్టు డైమండ్‌ నగలు,అద్భుతమైన చీరలు, అందానికి మించిన హందాతనంతో ప్రతీ ఈవెంట్‌లోనూ నీతా అంబానీ  ప్రత్యేకంగా నిలుస్తారు. తాజాగా ఈవెంట్‌లో  ఆమె దుస్తులుఅందరినీ ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా ఆమె ధరించిన  పచ్చని అద్భుతమైన హారమే ప్రత్యేకంగా నిలవడం విశేషం.

నీతా అద్భుతమైన పరాయిబా, హృదయాకారపు వజ్రాల  డబుల్ స్ట్రింగ్, వజ్రాల హారాన్ని ధరించారు.  హృదయ ఆకారపు స్టడ్ చెవిపోగులు, సరిపోలే ఉంగరం ,సున్నితమైన డైమండ్ బ్రాస్‌లెట్‌తో తన లుక్‌ను మరింత ఎలివేట్‌ చేశారు. అలాగే ఈ హారానికి పొదిగిన టైటానియం ఫ్లవర్‌ పీస్‌మరింత  ఆకర్షణీయంగా నిలిచింది. దీనికి మ్యాచింగ్‌ కలర్‌లో ఆమె ధరించిన చీర నీతా అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసింది.

అనన్య పాండే, కరణ్ జోహార్, ఫరా ఖాన్, బాబీ డియోల్, అలియా–రణ్‌బీర్, విక్కీ కౌశల్ మరియు అనేక మంది స్టార్-స్టడెడ్ సాయంత్రం హాజరయ్యారు. సందడిగా సాగిన ఈ   స్క్రీనింగ్‌ ఈవెంట్‌లో అంబానీ  ఫ్యామిలీ మరో  ఎట్రాక్షన్‌.    సెలబ్రిటీలతో పాటు, అంబానీలు కూడాను అందంగా తీర్చిదిద్దారు. నీతా అంబానీ తన భర్త ముఖేష్ అంబానీ  చేతిలో చేయి వేసి, రెడ్ కార్పెట్‌పై  పోజులిచ్చారు. ఇంకా ఆకాష్ రాధిక , శ్లోకా, ఇషా అంబానీ  మెరిసారు. ఆకాష్ అంబానీ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.

 

గ్రాండ్ ప్రీమియర్ కోసం, రాధిక బోల్డ్ రెడ్ స్ట్రాప్‌లెస్ గౌను ధరించి, డైమండ్ నెక్లెస్ మరియు బ్రాస్‌లెట్‌తో పాటు చిన్న రెడ్ క్లచ్ బ్యాగ్‌తో తన లుక్‌ను అలంకరించింది. శ్లోకా షీర్ కార్సెట్-స్టైల్ బాడీస్ , భారీ ప్యాట్రన్డ్ స్కర్ట్‌తో కూడిన నేవీ-బ్లూ గౌనును ఎంచుకున్నారు, ఆకాష్ క్లాసిక్ బ్లాక్ వెల్వెట్ టక్సేడోలో చాలా అందంగా కనిపించారు.

Videos

Jagtial: 300 కోసం ఆటో డ్రైవర్‌ మర్డర్

2007లో జరిగిన వేలానికి నాకు ఏం సంబంధమో చిన్నీ చెప్పాలి: పేర్ని నాని

AP: కండక్టర్లకు ఫ్రీ బస్సు తంటాలు

తాడేపల్లిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ

Vidadala: ఇది తొలి అడుగు మాత్రమే... మీ పతనం ఇప్పటి నుండి ప్రారంభం

Narayana College: విద్యార్థిపై దాడి చేసిన ఫ్లోర్ ఇన్చార్జ్ సతీష్

Heavy Rain: హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఘటన ఫిర్యాదును నిర్లక్ష్యం చేయడంతో చర్యలు

Jada Sravan: మాకు మద్దతు తెలిపిన వైఎస్ జగన్ కు ధన్యవాదాలు

హరీష్ నన్ను కూడా కొట్టాడు..! హరిత షాకింగ్ కామెంట్స్

Photos

+5

కోర్ట్‌ జంట రిపీట్‌.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)

+5

ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

బ్యూటీఫుల్ శారీలో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర (ఫోటోలు)

+5

దివినుంచి దిగి వచ్చిన తారలా ‘పరదా’ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ మీట్..ముఖ్య అతిథిగా సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

తెలంగాణలో కొలువైన శ్రీరంగనాథస్వామి ఆలయం ఎక్కడో తెలుసా?

+5

‘బ్యూటీ’ మూవీ ప్రమోషన్స్ లో నరేష్, వాసుకి ఆనంద్ (ఫొటోలు)

+5

ఓజీ ప్రమోషన్స్ లో ప్రియాంక.. బ్లాక్ డ్రెస్ లో క్యూట్ లుక్స్ (ఫొటోలు)

+5

సైమా అవార్డ్స్‌ -2025లో అందరినీ ఆకర్షించిన ఫోటోలు ఇవే