Breaking News

కేంద్ర బ్యాంకులకు బంగారు నిల్వలు ఎందుకు?

Published on Thu, 09/18/2025 - 12:55

బంగారానికి భారత్‌తోపాటు వివిధ దేశాల్లో ఉన్న ​‍క్రేజ్‌ అంతాఇంతా కాదు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు భరోసానిచ్చే సాధనంగా సాధారణ ప్రజలు పసిడిని కొనుగోలు చేస్తూంటారు. దాంతోపాటు శుభకార్యాలు, ప్రత్యేక ఈవెంట్ల కోసం ఖరీదు చేస్తారు. వీరితోపాటు భారీ మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు బంగారు నిల్వలను ఉద్దేశపూర్వకంగా, వ్యూహాత్మకంగా కొనుగోలు చేస్తున్నాయి. ఇండియాతోపాటు చాలా దేశాలు ఎందుకు ఇలా భారీగా పసిడిని కొనుగోలు చేస్తాయో తెలుసుకుందాం.

కరెన్సీకి అండగా..

ద్రవ్యోల్బణం పెరుగుతూ, దేశ కరెన్సీ విలువ తగ్గుతుంటే దాన్ని కాపాడేందుకు బంగారం హెడ్జింగ్‌గా పని చేస్తుంది. ముద్రించిన కరెన్సీ(ఫియట్‌ కరెన్సీ) విలువ తగ్గినప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం విలువ బలపడుతుంది. ఇది దిగుమతులకు ఆసరాగా ఉంటుంది. అస్థిరత సమయాల్లో బంగారం జాతీయ కరెన్సీలను కాపాడుతుంది.  దేశం ద్రవ్య విధాన చట్రానికి విశ్వసనీయతను అందిస్తుంది.

రిస్క్‌ వైవిధ్యం

కేంద్ర బ్యాంకులు రిస్క్‌ను డైవర్సిఫై చేసేందుకు బంగారం నాన్-కోరిలేటెడ్ ఆస్తిగా ఉపయోగపడుతుంది. దీని విలువ ఈక్విటీలు లేదా బాండ్లతో అనుగుణంగా పడిపోదు. యూఎస్ డాలర్ పడిపోయినప్పుడు ఇది పెరుగుతుంది. ఇది రిజర్వ్ పోర్ట్ ఫోలియోల్లో స్మార్ట్ డైవర్సిఫికేషన్ హెడ్జ్‌గా మారుతుంది.

భౌగోళిక రాజకీయ పరిస్థితులు

బంగారం ఏ ఒక్క దేశానికి పరిమితమైంది కాదు. కాబట్టి దీన్ని నియంత్రించడం ఏ ఒక్క దేశంలో వల్లనో సాధ్యం కాదు. దీని విలువపై ఎన్నో అంతర్జాతీయ అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి విదేశీ కరెన్సీ నిల్వల మాదిరిగా కాకుండా, బంగారాన్ని స్తంభింపజేయడం లేదా దానిపై రాజకీయం చేయడం సాధ్యం కాదు. రష్యా, చైనా వంటి దేశాలు అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు బంగారం నిల్వలను పెంచాయి.

లిక్విడిటీ

బంగారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత లిక్విటిటీ ఆస్తుల్లో ఒకటి. దీన్ని దాదాపు ఏ ఆర్థిక మార్కెట్లోనైనా ఆమోదిస్తారు. ఆర్థిక సంక్షోభాలు లేదా యుద్ధాల సమయంలో దీన్ని త్వరగా నగదుగా మార్చవచ్చు లేదా అత్యవసర నిధుల కోసం తాకట్టుకు ఉపయోగించవచ్చు.

టాప్‌ 8 దేశాల్లోని బంగారు నిల్వలు..

దేశంబంగారం నిల్వలు (టన్నులు)
అమెరికా8,133.46
జర్మనీ3,350.25
ఇటలీ2,451.84
ఫ్రాన్స్2,437.00
రష్యా2,329.63
చైనా2,279.60
స్విట్జర్లాండ్1,040.00
భారతదేశం880.00

Videos

Jagtial: 300 కోసం ఆటో డ్రైవర్‌ మర్డర్

2007లో జరిగిన వేలానికి నాకు ఏం సంబంధమో చిన్నీ చెప్పాలి: పేర్ని నాని

AP: కండక్టర్లకు ఫ్రీ బస్సు తంటాలు

తాడేపల్లిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ

Vidadala: ఇది తొలి అడుగు మాత్రమే... మీ పతనం ఇప్పటి నుండి ప్రారంభం

Narayana College: విద్యార్థిపై దాడి చేసిన ఫ్లోర్ ఇన్చార్జ్ సతీష్

Heavy Rain: హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఘటన ఫిర్యాదును నిర్లక్ష్యం చేయడంతో చర్యలు

Jada Sravan: మాకు మద్దతు తెలిపిన వైఎస్ జగన్ కు ధన్యవాదాలు

హరీష్ నన్ను కూడా కొట్టాడు..! హరిత షాకింగ్ కామెంట్స్

Photos

+5

కోర్ట్‌ జంట రిపీట్‌.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)

+5

ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

బ్యూటీఫుల్ శారీలో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర (ఫోటోలు)

+5

దివినుంచి దిగి వచ్చిన తారలా ‘పరదా’ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ మీట్..ముఖ్య అతిథిగా సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

తెలంగాణలో కొలువైన శ్రీరంగనాథస్వామి ఆలయం ఎక్కడో తెలుసా?

+5

‘బ్యూటీ’ మూవీ ప్రమోషన్స్ లో నరేష్, వాసుకి ఆనంద్ (ఫొటోలు)

+5

ఓజీ ప్రమోషన్స్ లో ప్రియాంక.. బ్లాక్ డ్రెస్ లో క్యూట్ లుక్స్ (ఫొటోలు)

+5

సైమా అవార్డ్స్‌ -2025లో అందరినీ ఆకర్షించిన ఫోటోలు ఇవే