బ్యాంక్‌ రుణాల్లో వృద్ధి ఎంతంటే..

Published on Thu, 09/18/2025 - 12:12

బ్యాంకుల రుణ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 శాతంగా ఉండొచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. ముఖ్యంగా ద్వితీయ ఆరు నెలల కాలంలో (అక్టోబర్‌ నుంచి) రుణ వృద్ధి వేగాన్ని అందుకోవచ్చని తెలిపింది. కార్పొరేట్‌ రుణాలు నిదానిస్తాయంటూ.. రిటైల్‌ రుణాలు వృద్ధిని నడిపించనున్నట్టు వెల్లడించింది. డిపాజిట్లలో గృహాల వాటా తగ్గుతుండడం ఆందోళనకరమంటూ, డిపాజిట్లలో స్థిరత్వం సమస్యలకు దారితీయొచ్చని పేర్కొంది.

‘2025–26 క్యూ1లో (ఏప్రిల్‌–జూన్‌) రుణ వృద్ధి 9.5 శాతానికి నిదానించింది. ఆ తర్వాత 10 శాతానికి పెరిగింది. ద్వితీయ ఆరు నెలల్లో రుణాల్లో వృద్ధి వేగవంతమై పూర్తి ఆర్థిక సంవత్సరానికి 11–12 శాతానికి చేరుకోవచ్చు’ అని క్రిసిల్‌ చీఫ్‌ రేటింగ్‌ ఆఫీసర్‌ కృష్ణన్‌ సీతారామన్‌ తెలిపారు. ప్రభుత్వం, ఆర్‌బీఐ చర్యలు ఇందుకు అనుకూలిస్తాయన్నారు. ఆర్‌బీఐ రెపో రేట్ల తగ్గింపు ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రుణాలపై ఇంకా పూర్తిగా ప్రతిఫలించాల్సి ఉందన్నారు. బ్యాంకు రుణ రేట్లు తగ్గుముఖం పడితే అప్పుడు డిమాండ్‌ పుంజుకుంటుందని అంచనా వేశారు. ప్రైవేటు మూలధన వ్యయాలు పుంజుకోవడానికి కొంత సమయం పట్టొచ్చని చెప్పారు. 

డిపాజిట్లు కీలకం..

బ్యాంక్‌ డిపాజిట్లలో గృహాల వాటా ఐదేళ్ల క్రితం 64 శాతంగా ఉంటే, అది 60 శాతానికి తగ్గడం పట్ల క్రిసిల్‌ రేటింగ్స్‌ ఆందోళన వ్యక్తం చేసింది. స్థిరమైన రుణ వృద్ధికి డిపాజిట్లు కీలకమని పేర్కొంది. వ్యవస్థలో లిక్విడిటీ పెంచే దిశగా ఆర్‌బీఐ తీసుకున్న చర్యలతో (సీఆర్‌ఆర్‌ తగ్గింపు, లిక్విడిటీ కవరేజీ నిబంధనలు) డిపాజిట్లలో వృద్ధి తగినంత ఉన్నట్టు తెలిపింది. బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 2026 మార్చి నాటికి 2.3–2.5 శాతానికి పెరగొచ్చని అంచనా వేసింది.

ఇదీ చదవండి: త్వరలో ఈ-ఆధార్‌ యాప్‌ ప్రారంభం

Videos

17 మెడికల్ కాలేజీల వద్ద నేడు YSRCP పోరుబాట

అమెరికాలో తెలంగాణ వాసి మృతి

మహేష్ తో ప్రభాస్ డైరెక్టర్.. స్క్రీన్స్ బ్లాస్ట్ పక్కా

మీలాంటి దుష్ట శక్తులనుండి ప్రజలను కాపాడాలని ఆ అప్పన్న స్వామిని వేడుకుంటున్నా

గుర్తుపెట్టుకో.. మేమే నిన్ను గెలిపించాం.. మేమే వచ్చే ఎన్నికల్లో నిన్ను ఓడిస్తాం

అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కాయి.. అనితను రఫ్ఫాడించిన నాగ మల్లీశ్వరి

పోలీసులా? టీడీపీ కార్యకర్తలా? విద్యార్థులను ఈడ్చుకెళ్ళిన పోలీసులు

బిల్డప్ మాధవి.. కడప ఎమ్మెల్యే ఓవరాక్షన్

బాబూ.. నీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి మంచి పని చేశావా..

కారును ఈడ్చుకెళ్లిన టిప్పర్.. ఏడుగురిని చంపిన టీడీపీ నేత అత్యాశ

Photos

+5

హైదరాబాద్‌ : ఉదయం ఉక్కపోత..సాయంత్రం కుండపోత వర్షం (ఫొటోలు)

+5

హైదరాబాద్ రోడ్డుపై అడవి జంతువులు..అవునా.. నిజమా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ట్రాఫిక్‌ సమ్మిట్‌–2025..ముఖ్య అతిథిగా సాయి ధరమ్ తేజ్ (ఫొటోలు)

+5

కోర్ట్‌ జంట రిపీట్‌.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)

+5

ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

బ్యూటీఫుల్ శారీలో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర (ఫోటోలు)

+5

దివినుంచి దిగి వచ్చిన తారలా ‘పరదా’ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ మీట్..ముఖ్య అతిథిగా సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

తెలంగాణలో కొలువైన శ్రీరంగనాథస్వామి ఆలయం ఎక్కడో తెలుసా?