Breaking News

త్వరలో ఈ-ఆధార్‌ యాప్‌ ప్రారంభం

Published on Thu, 09/18/2025 - 11:14

భారత ప్రభుత్వం ఆధార్ వినియోగదారుల కోసం మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తోంది. ప్రాథమిక అవసరాల కోసం ఆధార్ సేవా కేంద్రాలను వ్యక్తిగతంగా సందర్శించాల్సిన అవసరం లేకుండా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా దీన్ని అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ ‘ఈ-ఆధార్‌’యాప్‌ను ఉపయోగించి సులువుగా ఆన్‌లైన్‌లోనే వ్యక్తిగత వివరాలను అప్‌డేట్‌ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ యాప్‌ను నవంబర్‌లో ప్రారంభించబోతున్నట్లు అంచనాలున్నాయి.

ఈ మొబైల్ అప్లికేషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయగల వ్యక్తిగత వివరాలు కింది విధంగా ఉన్నాయి.

  • పేరు

  • చిరునామా

  • పుట్టిన తేదీ

  • మొబైల్‌ నంబర్‌

  • బయోమెట్రిక్ మార్పులు (వేలిముద్ర / కనుపాపలు) మినహా, ఆధార్ సేవా కేంద్రాలను సందర్శించకుండా అన్ని అప్‌డేట్‌లను డిజిటల్‌గా చేయవచ్చు.

ముఖ్య లక్షణాలు

ఏఐ ఫేస్ ఐడీ ఇంటిగ్రేషన్: సురక్షితమైన రిమోట్ యాక్సెస్, ఐడెంటిటీ వెరిఫికేషన్‌ కోసం అనుమతిస్తుంది.

క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్: భౌతిక ఆధార్ ఫొటోకాపీల అవసరాన్ని తొలగిస్తుంది.

ఆటో డాక్యుమెంట్ పొందడం: పాన్, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పీడీఎస్, ఎంఎన్‌ఆర్‌ఈజీఏ, యుటిలిటీ రికార్డుల నుంచి వెరిఫై చేసిన డేటాను తీసుకుంటుంది.

ఇది ఎందుకు ముఖ్యం?

పేపర్ వర్క్, క్యూలు, మోసపూరిత నమోదులను తగ్గిస్తుంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో 130 కోట్ల మందికి పైగా ఆధార్ హోల్డర్లకు సాధికారత లభిస్తుంది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖ కింద భారతదేశ డిజిటల్ గవర్నెన్స్ ప్రోత్సాహానికి అనుగుణంగా ఉంటుంది.

ఇదీ చదవండి: ఈ-పాస్‌పోర్ట్‌ అర్హులు, దరఖాస్తు వివరాలు..

Videos

Jagtial: 300 కోసం ఆటో డ్రైవర్‌ మర్డర్

2007లో జరిగిన వేలానికి నాకు ఏం సంబంధమో చిన్నీ చెప్పాలి: పేర్ని నాని

AP: కండక్టర్లకు ఫ్రీ బస్సు తంటాలు

తాడేపల్లిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ

Vidadala: ఇది తొలి అడుగు మాత్రమే... మీ పతనం ఇప్పటి నుండి ప్రారంభం

Narayana College: విద్యార్థిపై దాడి చేసిన ఫ్లోర్ ఇన్చార్జ్ సతీష్

Heavy Rain: హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఘటన ఫిర్యాదును నిర్లక్ష్యం చేయడంతో చర్యలు

Jada Sravan: మాకు మద్దతు తెలిపిన వైఎస్ జగన్ కు ధన్యవాదాలు

హరీష్ నన్ను కూడా కొట్టాడు..! హరిత షాకింగ్ కామెంట్స్

Photos

+5

కోర్ట్‌ జంట రిపీట్‌.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)

+5

ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

బ్యూటీఫుల్ శారీలో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర (ఫోటోలు)

+5

దివినుంచి దిగి వచ్చిన తారలా ‘పరదా’ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ మీట్..ముఖ్య అతిథిగా సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

తెలంగాణలో కొలువైన శ్రీరంగనాథస్వామి ఆలయం ఎక్కడో తెలుసా?

+5

‘బ్యూటీ’ మూవీ ప్రమోషన్స్ లో నరేష్, వాసుకి ఆనంద్ (ఫొటోలు)

+5

ఓజీ ప్రమోషన్స్ లో ప్రియాంక.. బ్లాక్ డ్రెస్ లో క్యూట్ లుక్స్ (ఫొటోలు)

+5

సైమా అవార్డ్స్‌ -2025లో అందరినీ ఆకర్షించిన ఫోటోలు ఇవే