Breaking News

మరో నాలుగు రోజులు ఇంతే..

Published on Thu, 09/18/2025 - 09:10

భారతదేశం అంతటా ద్విచక్ర వాహన డీలర్‌షిప్‌ల్లో షోరూమ్ బుకింగ్‌లు దాదాపు స్తంభించాయి. సెప్టెంబర్ 4న సవరించిన పన్ను రేట్లను జీఎస్టీ కౌన్సిల్ అధికారికంగా ఆమోదం తెలిపినప్పటి నుంచి ఈ తంతు కొనసాగుతోంది. ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ రేటును తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 15న ప్రకటించిన నేపథ్యంలో ఈమేరకు దేశవ్యాప్తంగా వినియోగదారులు ధరల తగ్గింపునకు వేచిచూస్తున్నారు.

ఏదేమైనా, ఈ ప్రకటన విస్తృతంగా కొనుగోలుదారులను కట్టిపడేసింది. వినియోగదారులు తాము కొనాలనుకునే ఉత్పత్తులపై త్వరలో ధరల రాయితీ ఉంటుందని నమ్మి ఇలా కొనుగోళ్లను వాయిదా వేస్తున్నట్లు డీలర్లు చెబుతున్నారు. ‘జీఎస్టీ రేటు తగ్గింపును ప్రధాని ప్రకటించినప్పటి నుంచి అమ్మకాలు తగ్గాయి. సెప్టెంబర్ 4న చేసిన కొత్త రేట్లను అధికారికంగా ఆమోదం తెలపడంతో వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారు’ అని హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) డీలర్ ఆశిష్ పాండే చెప్పారు.

‘సెప్టెంబర్ 22 కొత్త జీఎస్టీ శ్లాబులు అమలు తర్వాతే కొనుగోళ్లు తిరిగి ఊపందుకుంటాయని ఆశిస్తున్నాం. అయితే ఇది భవిష్యత్తులో సాధారణ ప్రక్రియగానే మారుతుందని, పరిమిత సమయ పథకం కాదని వినియోగదారులకు తెలుసు’ అన్నారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే షోరూమ్ బుకింగ్స్ దాదాపు 50% పడిపోయాయని దేశవ్యాప్తంగా డీలర్లు చెబుతున్నారు.

ఇదీ చదవండి: అంతర్జాతీయంగా ఏఐ నైతిక ప్రమాణాలపై కసరత్తు

Videos

నాగార్జున యాదవ్ పై పోలీసుల దౌర్జన్యం

KSR Live Show: ప్రభుత్వ మెడికల్ కాలేజీల చరిత్రలో చీకటి రోజు

మారని పాక్ బుద్ధి.. బాల్ తో అంపైర్ పై దాడి

ఉడతతో స్నేహం

సాక్షి రిపోర్టర్ పై పోలీసుల దౌర్జన్యం

మెడికల్ కాలేజీలు పేదల కోసం.. బినామీలకు ఇస్తానంటే ఊరుకోము

Watch Live: ఛలో మెడికల్ కాలేజ్

ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెళ్లి తీరుతా.. బైరెడ్డి మాస్ వార్నింగ్

17 మెడికల్ కాలేజీల వద్ద నేడు YSRCP పోరుబాట

అమెరికాలో తెలంగాణ వాసి మృతి

Photos

+5

విజయవాడ : కనులపండువగా దసరా సాంస్కృతిక ఉత్సవాలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఉదయం ఉక్కపోత..సాయంత్రం కుండపోత వర్షం (ఫొటోలు)

+5

హైదరాబాద్ రోడ్డుపై అడవి జంతువులు..అవునా.. నిజమా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ట్రాఫిక్‌ సమ్మిట్‌–2025..ముఖ్య అతిథిగా సాయి ధరమ్ తేజ్ (ఫొటోలు)

+5

కోర్ట్‌ జంట రిపీట్‌.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)

+5

ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

బ్యూటీఫుల్ శారీలో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర (ఫోటోలు)

+5

దివినుంచి దిగి వచ్చిన తారలా ‘పరదా’ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ మీట్..ముఖ్య అతిథిగా సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)