Breaking News

కొత్త రూల్: పీయూసీ లేకుంటే.. పెట్రోల్ లేదు!

Published on Fri, 09/12/2025 - 16:56

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 'నో హెల్మెట్, నో ఫ్యూయెల్' విధానాన్ని గత నెలలో అమలు చేసింది. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం 'నో పీయూసీ, నో ఫ్యూయెల్' విధానానికి శ్రీకారం చుట్టింది. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే.. వాహనాలకు ఇంధనం నింపకూడదని కఠిన ఆంక్షలు పెట్టింది.

భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత వాతావరణాన్ని అందించడానికి, ప్రస్తుత తరం కొన్ని నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది. కాలుష్యాన్ని నియంత్రించే ప్రయత్నాలను బలహీనపరిచే అక్రమ పీయూసీ సర్టిఫికెట్లను ఆపాల్సిన అవసరాన్ని గురించి మహారాష్ట్ర రవాణా మంత్రి 'ప్రతాప్ సర్నాయక్' తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.

ఈ కొత్త విధానం ప్రకారం.. ప్రతి వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్‌ను పెట్రోల్ పంపులలోని సీసీటీవీ కెమెరాల ద్వారా స్కాన్ చేసి, దాని పీయూసీ సర్టిఫికేట్ చెల్లుబాటును ధృవీకరిస్తారు. చెల్లుబాటు అయ్యే సర్టిఫికేట్ లేకుండా దొరికిన వాహనాలకు ఇంధనం నింపరు. అంతే కాకుండా ఈ పీయూసీ సర్టిఫికేట్‌లను అక్కడిక్కడే జారీ చేయడానికి కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. అక్రమ సర్టిఫికెట్ జారీ చేసే ముఠాలను లక్ష్యంగా చేసుకుని రవాణా శాఖ ఈ ప్రచారం ప్రారంభించింది.

ఇదీ చదవండి: దేశంలో అతిపెద్ద డీల్!.. రూ.3472 కోట్లు వెచ్చించిన ఆర్‌బీఐ

భారతదేశంలో కొత్త కారు లేదా బైక్ యజమానులకు కొనుగోలు తేదీ నుంచి కనీసం ఒక సంవత్సరం పాటు పీయూసీ సర్టిఫికేట్ అవసరం లేదు. అంతే కాకుండా బీఎస్3 వాహనాలకు ఆరు నెలల పాటు చెల్లుబాటు అయ్యే పీయూసీ సర్టిఫికేట్ లభిస్తుంది. బీఎస్4, బీఎస్6 మోడళ్లకు పూర్తి సంవత్సరం పాటు చెల్లుబాటు అయ్యే సర్టిఫికేట్ జారీ చేస్తారు.

#

Tags : 1

Videos

YSRCP ఎప్పుడూ విజన్ తో ఆలోచిస్తుంది..విజయవాడ-గుంటూరు మధ్య పెడితే..: సజ్జల

రాజధానిపై చంద్రబాబు హాట్ కామెంట్స్

బరువెక్కుతున్న అమీర్..! కారణం అదేనా..?

RK Roja: మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది

ఈ వయసులో నీకెందుకు బాబు.. జూ.ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలు ఇచ్చేయ్

Diarrhea Cases: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 106 మంది

'మిరాయ్’ మూవీ రివ్యూ

చంద్రబాబుకి ఆ రెండంటే గుర్తొచ్చేది వ్యాపారమే

Haryana: కానిస్టేబుల్ ను గంట జైల్లో పెట్టిన కోర్టు

Garam Garam Varthalu: ‪120 ఏళ్లు.. హ్యాపీ బర్త్‌ డే బామ్మ

Photos

+5

రూ.2,700 కోట్ల విలాసం... కానీ తక్కువ ధరకే!! (ఫొటోలు)

+5

మాల్దీవుస్‌లో 'డిజే టిల్లు' బ్యూటీ.. నేహా శెట్టి ఫోటోలు చూశారా?

+5

హైదరాబాద్‌లో తప్పక సందర్శించాల్సిన ఆలయాలు ఇవిగో (ఫొటోలు)

+5

‘అందెల రవమిది’ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ఆరెంజ్‌ డ్రెస్‌లో అందంగా ఐశ్వర్య రాజేశ్‌ (ఫోటోలు)

+5

యాపిల్ సీఈఓతో అమితాబ్ బచ్చన్ మనవరాలు (ఫొటోలు)

+5

'మిరాయ్'తో మరో హిట్.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా? (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ నటి సుధ, అనిరుధ్, సప్తగిరి (ఫొటోలు)

+5

మతిపోగొడుతున్న అనుపమ అందం (ఫొటోలు)