Breaking News

గ్లోబల్‌ కంపెనీలకు కేంద్రం స్వాగతం

Published on Fri, 09/12/2025 - 13:52

భారత్‌లో తమ ఉత్పత్తులను పరీక్షించడానికి గ్లోబల్ ఆటోమొబైల్ కంపెనీలను స్వాగతిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. తద్వారా వారు స్థానికంగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారని తెలిపింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) నిర్వహించిన 7వ ఆటో కాన్‌క్లేవ్‌లో వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. భారతదేశం పూర్తిగా నిర్మించిన యూనిట్ల (సీబీయూ) దిగుమతిపై కస్టమ్స్ సుంకాలను తగ్గించిందని చెప్పారు. ప్రపంచంలోని చాలా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) చేసుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దాంతో అంతర్జాతీయంగా చాలా కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు.

‘కేంద్రం దేశీయ పరిశ్రమను, తయారీదారులను రక్షించేందుకు చర్యలు చేపడుతోంది. అదే సమయంలో కంపెనీల ఉత్పత్తుల మధ్య సరసమైన పోటీకి కట్టుబడి ఉన్నాం. ఈ పోటీ సామర్థ్యాన్ని పెంచుతోంది. ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరుస్తుంది. వ్యాపారాన్ని విస్తరించే లేదా కొత్త మోడళ్లకు అవకాశాలు కల్పించడంలో సమతుల్యత ముఖ్యం. దేశీయ తయారీకి ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. అయితే పరిశ్రమ వృద్ధి చెందాలంటే మరిన్ని ప్రపంచ కంపెనీలు భారతదేశానికి రావాలి. స్థానికంగా ఉత్పత్తులు తయారు చేసేందుకు లేదా సీబీయూలను పరీక్షించేందుకు ప్రపంచ కంపెనీలు ముందుకు రావాలి’ అని పిలుపునిచ్చారు.

ఇదిలాఉండగా, జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ‘మేడ్ ఇన్ ఇండియా’ కార్లను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయాలనుకుంటున్నట్లు సూచించిందని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మెర్సిడెస్ బెంజ్ ఛైర్మన్ దేశ ఉత్పత్తి నాణ్యత బలంగా ఉందని తనకు చెప్పినట్లు గడ్కరీ ఇటీవల ఓ కార్యక్రమంలో స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ఊబకాయం.. ఆర్థిక భారం!

#

Tags : 1

Videos

YSRCP ఎప్పుడూ విజన్ తో ఆలోచిస్తుంది..విజయవాడ-గుంటూరు మధ్య పెడితే..: సజ్జల

రాజధానిపై చంద్రబాబు హాట్ కామెంట్స్

బరువెక్కుతున్న అమీర్..! కారణం అదేనా..?

RK Roja: మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది

ఈ వయసులో నీకెందుకు బాబు.. జూ.ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలు ఇచ్చేయ్

Diarrhea Cases: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 106 మంది

'మిరాయ్’ మూవీ రివ్యూ

చంద్రబాబుకి ఆ రెండంటే గుర్తొచ్చేది వ్యాపారమే

Haryana: కానిస్టేబుల్ ను గంట జైల్లో పెట్టిన కోర్టు

Garam Garam Varthalu: ‪120 ఏళ్లు.. హ్యాపీ బర్త్‌ డే బామ్మ

Photos

+5

రూ.2,700 కోట్ల విలాసం... కానీ తక్కువ ధరకే!! (ఫొటోలు)

+5

మాల్దీవుస్‌లో 'డిజే టిల్లు' బ్యూటీ.. నేహా శెట్టి ఫోటోలు చూశారా?

+5

హైదరాబాద్‌లో తప్పక సందర్శించాల్సిన ఆలయాలు ఇవిగో (ఫొటోలు)

+5

‘అందెల రవమిది’ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ఆరెంజ్‌ డ్రెస్‌లో అందంగా ఐశ్వర్య రాజేశ్‌ (ఫోటోలు)

+5

యాపిల్ సీఈఓతో అమితాబ్ బచ్చన్ మనవరాలు (ఫొటోలు)

+5

'మిరాయ్'తో మరో హిట్.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా? (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ నటి సుధ, అనిరుధ్, సప్తగిరి (ఫొటోలు)

+5

మతిపోగొడుతున్న అనుపమ అందం (ఫొటోలు)