ఎన్ని కేసులు పెట్టినా జగనన్న వెంటే నడుస్తాం..
Breaking News
విజయ్ విమర్శలకు శరత్‌కుమార్ కౌంటర్
Published on Sat, 08/23/2025 - 07:46
మహానాడు వేదికగా తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, నటుడు విజయ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో రచ్చకెక్కాయి. తాను సింగిల్‌గానే 2026లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన బీజేపీ, అన్నాడీఎంకే, డీఎంకే కూటమి వర్గాలపై విమర్శలు చేశారు. దీంతో అక్కడి అన్ని పొలిటికల్ పార్టీలు విజయ్‌పై ముప్పెట్ట దాడి చేసేందుకు దిగాయి.
విజయ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, నటుడు శరత్‌కుమార్ రియాక్ట్ అయ్యారు. సిద్ధాంత పరంగా విజయ్ వ్యాఖ్యలు చేస్తే బాగుంటుందని హితవు పలికారు. మిస్టర్ పీఎం అంటూ ప్రధాని నరేంద్ర మోదీని సంబోధించే స్థాయికి ఇంకా ఎదగలేదన్నారు. ముందుగా పాసిజం అంటే ఏమిటో తెలుసుకుని రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని హితవు పలికారు. ఆపై అన్నాడీఎంకే నేతలు కూడా ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో అందరూ ఎంజీఆర్, జయలలితలు కాలేరని ఎద్దేవాచేశారు.
దివంగత నటుడు విజయకాంత్ ఆశీస్సులు విజయ్‌కి ఉంటాయని ఆయన సతీమణి ప్రేమలత అన్నారు. విజయ్ తమ ఇంటి బిడ్డ అని ఆమె అన్నారు. విజయ్ వ్యాఖ్యలు కూడా విజయకాంత్‌ను గుర్తుచేస్తున్నాయని డీఎండీకే నేత ప్రేమలత అన్నారు. ప్రస్తుతం విజయ్‌కి సపోర్ట్‌గా విజయకాంత్ సతీమణి రావడం అభిమానులు సంతోషిస్తున్నారు.
Tags : 1