బైకును ఎత్తిండ్రు అన్నలు
Breaking News
టెస్లాకు రూ.2100 కోట్ల జరిమానా: కారణం ఇదే..
Published on Sat, 08/02/2025 - 11:28
అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు ఫ్లోరిడా కోర్టు భారీ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. 2019లో జరిగిన రోడ్డు ప్రమాదానికి "ఆటోపైలట్" డ్రైవర్ అసిస్టెన్స్ టెక్నాలజీ కారణమని భావించి కోర్టు ఈ జరిమానా విధించింది.
2019లో కీ లార్గోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. నైబెల్ బెనవిడెస్ లియోన్ మరణించగా, ఆమె ప్రియుడు డిల్లాన్ అంగులో గాయపడ్డాడు. ఆ సమయంలో 'జార్జ్ మెక్‌గీ' టెస్లా కారు నడుపుతున్నాడు. ఆటోపైలట్ ఫీచర్ (టెస్లా కార్లలోని ఒక ఆటోమేటెడ్ డ్రైవింగ్ సిస్టం) ఆన్ చేసి ప్రయాణిస్తున్న సమయంలో.. తన ఫోన్ అనుకోకుండా కారులోనే కింద పడింది. ఆ సమయంలో వంగి ఫోన్ తీసుకున్న సమయంలో కారు రోడ్దుపై ఉన్న వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనపై బాధితులు కోర్టును ఆశ్రయించారు.
ఈ ఘటనపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు.. ఎట్టకేలకు తీర్పునిస్తూ 329 మిలియన్ డాలర్లు పరిగహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఇందులో 242 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,100 కోట్లు) టెస్లా చెల్లించాలని.. మిగిలిన మొత్తాన్ని డ్రైవర్ ఇవ్వాలని పేర్కొంది. ఈ తీర్పుపై టెస్లా తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ తీర్పుపై అప్పీల్ చేయనున్నట్లు సంస్థ యాజమాన్యం పేర్కొంది.
Tags : 1