బైకును ఎత్తిండ్రు అన్నలు
Breaking News
పూర్తిగా వెనక్కి రాని రూ.2,000 నోట్లు
Published on Sat, 08/02/2025 - 07:30
మార్కెట్ నుంచి రూ.2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించి రెండేళ్లు దాటినా.. ఇప్పటికీ రూ.6,017 కోట్ల విలువ చేసేవి వెనక్కి తిరిగి రాలేదు. 2023 మే 19న రూ.2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. చట్టపరంగా చెల్లుబాటును రద్దు చేయలేదు. 2023 మే 19 నాటికి వ్యవస్థలో రూ.3.56 లక్షల కోట్ల వలువ చేసే పెద్ద నోట్లు చలామణిలో ఉన్నాయి. 2025 జూలై 31 నాటికి రూ.6,017 కోట్లకు తగ్గిపోయినట్టు ఆర్‌బీఐ డేటా వెల్లడించింది.
ఇదీ చదవండి: కంటెంట్ క్రియేటర్ల పీక నొక్కిన యూఏఐ
నాడు చలామణిలో ఉన్న మొత్తం రూ.2,000 నోట్లలో 98.31 శాతం వెనక్కి వచ్చినట్లు తెలిపింది. తొలుత బ్యాంకుల్లో ఈ నోట్ల మార్పిడికి అవకాశం కల్పించడం తెలిసే ఉంటుంది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఆర్‌బీఐకి ఉన్న 19 ఇష్యూ ఆఫీసుల వద్ద వీటిని మార్చుకునే అవకాశం ఇప్పటికీ ఉంది. తమ వద్దనున్న 2,000 నోట్లను బ్యాంక్ ఖాతా వివరాలతోపాటు ఆర్‌బీఐ ఇష్యూ ఆఫీస్‌కు పోస్ట్ ద్వారా పంపొచ్చు.
Tags : 1