బైకును ఎత్తిండ్రు అన్నలు
Breaking News
ఇతర భాషల్లో సినిమాలు చేస్తే దివ్యాంగుల్లా అనిపిస్తుంది: మురుగదాస్
Published on Sat, 08/02/2025 - 07:11
కోలీవుడ్లో దీన, రమణ, గజనీ, తుపాకీ, సర్కార్ ఇలా వరుసగా విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి స్టార్ దర్శకుల లిస్ట్‌లో ఏఆర్.మురుగదాస్ చేరిపోయారు. ఈయన తెరకెక్కించిన గజనీ చిత్రాన్ని హిందీలో అమీర్‌ఖాన్ హీరోగా చేసి విజయాన్ని సాధించారు. అదేవిధంగా తెలుగులో చిరంజీవి హీరోగా స్టాలిన్ పేరుతో ఒక సినిమా చేశారు. ఇటీవల సల్మాన్‌ఖాన్ హీరోగా సికిందర్ అనే చిత్రాన్ని చేశారు. ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో నెటిజన్లతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా దర్శకుడితోపాటు యూనిట్ సభ్యులపై విమర్శలు గుప్పించారు.
కాగా మురుగదాస్ ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్ హీరోగా మదరాసి చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం సెప్టంబర్ 5న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మురుగదాస్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తాను ఇతర భాషల్లో చిత్రాలు చేసేటప్పుడు దివ్యాంగుల్లా భావన కలుగుతుందన్నారు. అదే మాతృభాషలో చిత్రం చేయడం చాలా బలం అని అన్నారు. కానీ, తెలుగులో మాత్రం అలాంటి ఇబ్బంది రాలేదన్నారు. ఎందుకంటే తెలుగు భాష కూడా ఇంచుమించు మన భాషలానే ఉండడంతో పట్టు దొరుకుతుందన్నారు.
భాష తెలియని ప్రాంతంతో చిత్రం చేయడం దివ్యాంగుల మాదిరి భావన కలుగుతుందనే అభిప్రాయాన్న మురుగదాస్ వ్యక్తం చేశారు. కాగా హిందీలో రెండు చిత్రాలు చేసిన ఆయన ఇలా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. హిందీలో తెరకెక్కించిన సికిందర్ సినిమా డిజాస్టర్ కావడం వల్లనే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
Tags : 1