బైకును ఎత్తిండ్రు అన్నలు
Breaking News
భారత్‌లో యాపిల్‌కు రికార్డు స్థాయిలో ఆదాయం
Published on Sat, 08/02/2025 - 07:11
జూన్ త్రైమాసికంలో భారత్ సహా ఇరవై నాలుగు మార్కెట్లలో రికార్డు స్థాయిలో ఆదాయాలు సాధించినట్లు అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. ఐఫోన్లు, మ్యాక్, సర్వీసులు మొదలైన విభాగాలు ఇందుకు దోహదపడినట్లు చెప్పారు. ప్రతి ప్రాంతంలోనూ ఐఫోన్ల విక్రయాలు పెరిగాయని, భారత్‌తో పాటు దక్షిణాసియా, బ్రెజిల్‌లాంటి వర్ధమాన మార్కెట్లలో రెండంకెల స్థాయి వృద్ధి నమోదైందని ఆయన వివరించారు.
ఇదీ చదవండి: ‘ఏఐకి అంత సీన్ లేదు’
మరోవైపు, అమెరికా టారిఫ్‌ల అంశం తీసుకుంటే 800 మిలియన్ డాలర్ల మేర ప్రతికూల ప్రభావం పడిందన్నారు. కొత్త టారిఫ్‌లేమీ లేకపోతే సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది 1.1 బిలియన్ డాలర్లకు చేరొచ్చని కుక్ వివరించారు. జూన్ త్రైమాసికంలో యాపిల్ ఆదాయం 10 శాతం పెరిగి 94.04 బిలియన్ డాలర్లకు, లాభం 9.2 శాతం పెరిగి రూ.23.42 బిలియన్ డాలర్లకు చేరింది.
Tags : 1