బైకును ఎత్తిండ్రు అన్నలు
Breaking News
పిల్లికి హైలెవల్ సెక్యూరిటీ..! ఇంకా ఇలానా..!
Published on Fri, 08/01/2025 - 15:38
అధికారులు తమ కింద పనిచేసే ఉద్యోగులను మాములుగా సతాయించారు. ఉద్యోగ ధర్మానికి సంబంధించిన పనులు తప్పించి..ఇబ్బందిపెట్టేలా అర్థం పర్థం లేని పనులు అప్పగించి బాధపెడుతుంటారు. పై అధికారి అనో లేక ఉద్యోగపోతుందనే భయంతోనో నోరు మెదపకుండా తలాడిస్తూ చేస్తుంటారు పాపం. కింది స్థాయి సిబ్బంది కూడా మనలాంటి సాటి మనుషులే కదా అని కూడా భావించరు కొందరు అధికారులు. అలాంటి వింత ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. నెటిజన్లు సైతం ఇంకా ఇలానా అంటూ మండిపడుతున్నారు.
ఆగ్రాలో జూలై 30న సాయంత్రం హోంగార్డులు రోజులానే విధుల్లోకి రాగా..పోలీస్ లైన్ కాంపౌండ్‌లో పార్క్ చేసిన కార్లపై నిఘా ఉంచాలేమో అనుకున్నారు. కానీ అనూహ్యంగా పై అధికారి విచిత్రమైన డ్యూటీని అప్పగించడంతో కంగుతిన్నారు వారంతా. తమ డ్యూటీ ఆ రోజు ఒక పిల్లికి కాపల కాయడం. అది ఓ ట్రాఫిక్ ఎస్పీకి చెందిన పిల్లి. ఆయన దాన్ని జాగ్రత్తగా చూసుకోమని వాళ్లను ఆదేశించారు.
ఏ జంతువు దానిపై దాడి చేయకుండా చూడటమే కాకుండా దానికి రాత్రిపూట పాలు, రొట్టే వంటివి ఇవ్వాల్సిందిగా చెప్పారట. ఒకవేళ ఆ పిల్లికి హాని కలిగేలా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారట ఆ అధికారి. దీంతో నిర్ఘాంతపోయారు హోంగార్డులు. ఈ విషయాన్ని ఒక హోంగార్డు తన డ్యూటీ ముగిసిన తదనంతరం సోష్‌లో మీడియాలో తన గోడును వెల్లబోసుకున్నారు.
పైగా ఆ పోస్ట్‌కి ఈ రోజు మా డ్యూటీ పిల్లికి కాపల. దానికేదైనా జరిగితే మాపై కఠిని చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని క్యాప్షన్‌ని కూడా జోడించి మరి తన బాధను వెల్లడించాడు ఆ హోంగార్డు. ఈ విషయం క్షణాల్లో వైరల్ అవ్వడంతో.స్వాతంత్ర భారతవనిలో ఇంకా ఇలాంటివి ఉన్నాయా అంటూ మానవ హక్కుల కార్యకర్లు ఒక్కసారిగా మడిపడ్డారు.
అటు నెటిజన్లు కూడా పోలీసుల విధుల గురించి సైటర్లు వేస్తూ పోస్టులు పెట్టారు. నెట్టింట ఈ విషయం తారస్థాయిలో ఆగ్రహోజ్వాలాలు రెకెత్తించగా..వెంటనే మరోపోస్ట్‌లో అతి వీధిపిల్లి అని ఎవ్వరిది కాదని అధికారిక పోస్ట్‌లో వివరణ ఇవ్వడం గమనార్హం.
(చదవండి: బుడ్డోడి డేరింగ్ ఫైర్ స్టంట్‌కి షాకవ్వాల్సిందే..! వీడియో వైరల్)
Tags : 1