Weather: ఏపీకి భారీ వర్ష సూచన
Breaking News
ప్రేమలో 'రాజా విక్రమార్క' హీరోయిన్
Published on Wed, 07/16/2025 - 08:45
కోలీవుడ్ హీరోయిన్ తాన్యా రవి చంద్రన్ ప్రేమలో పడిపోయింది. ఈ మేరకు తన బాయ్ఫ్రెండ్తో కలిసి దిగిన ఒక ఫోటోను ఆమె షేర్ చేసింది. దీంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. సినిమా కుటుంబం నుంచి వచ్చిన తాన్య 2016లో చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా అడుగుపెట్టింది. అయితే, కథ డిమాండ్ మేరకు గ్లామర్ పాత్రలు కూడా చేసి ట్రెండింగ్లో నిలిచింది.

తమిళ సీనియర్ హీరో రవిచంద్రన్ మనవరాలైన తాన్యా రవి చంద్రన్ కోలీవుడ్లో వరుస అవకాశాలు తెచ్చుకుంది. తెలుగులో కార్తికేయ నటించిన ‘రాజా విక్రమార్క’ (2021)లో హీరోయిన్‌గా తొలిసారి అవకాశం అందుకుంది. చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో నయనతారకు సోదరిగా తాన్యా నటించిన విషయం తెలిసిందే.. అయతే, 29 ఏళ్ల ఈ బ్యూటీ ఇప్పుడు ప్రేమలో పడిపోయింది. తన బాయ్ఫ్రెండ్కు లిప్‌లాక్ కిస్ ఇస్తూ దిగిన ఫోటోను షేర్ చేసింది. కానీ, తన వివరాలతో పాటు ఫేస్ను కూడా ఆమె రివీల్ చేయలేదు.

అయితే, ఇదే ఫోటోను చిత్రపరిశ్రమలో సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్న గౌతమ్ జార్జ్ షేర్ చేశారు. దీంతో నెటిజన్లకు ఒక క్లారిటీ వచ్చేసింది. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం లారెన్స్ సినిమా బెంజ్ ప్రాజెక్ట్ కోసం కెమెరామెన్గా గౌతమ్ జార్జ్ పనిచేస్తున్నారు.

Tags : 1